సోనూ సూద్‌ అలవాటు పడ్డ నేరస్తుడుః బీఎంసీ సంచలన వ్యాఖ్యలు

By Aithagoni RajuFirst Published Jan 13, 2021, 9:48 AM IST
Highlights

లాక్‌డౌన్‌లో రియల్‌ హీరో అనిపించుకున్న సోనూ సూద్‌పై ముంబయి మున్సిపల్‌ కార్పొరేషన్‌ కక్ష్య కట్టింది. ఆయనపై దారుణమైన అబాండం వేసింది. `సోనూ సూద్‌ నేరాలకు అలవాటు పడ్డ నేరస్థుడు` అంటూ సంచలన కామెంట్‌ చేసింది. ఈ మేరకు బాంబే హైకోర్ట్ కి ముంబయి నగరపాలక సంస్థ విన్నవించింది. 

లాక్‌డౌన్‌లో రియల్‌ హీరో అనిపించుకున్న సోనూ సూద్‌పై ముంబయి మున్సిపల్‌ కార్పొరేషన్‌ కక్ష్య కట్టింది. ఆయనపై దారుణమైన అబాండం వేసింది. `సోనూ సూద్‌ నేరాలకు అలవాటు పడ్డ నేరస్థుడు` అంటూ సంచలన కామెంట్‌ చేసింది. ఈ మేరకు బాంబే హైకోర్ట్ కి ముంబయి నగరపాలక సంస్థ విన్నవించింది. ముంబయిలోని జుహూ నివాసి ప్రాంతంలో గతంలో అనధికార కట్టడాలను మున్సిపల్‌ కార్పొరేషన్‌ రెండు సార్లు కూల్చేసిన కూడా తన పద్ధతి మానుకోలేదని, మళ్లీ అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారని హైకోర్ట్ కి తెలిపింది. 

సోనూ సూద్‌ ఇటీవల హైకోర్ట్ లో వేసిన అప్పీలు వ్యాజ్యానికి సమాధానంగా ముంబయి మున్సిపల్‌ కార్పొరేషన్‌ మంగళవారం అఫిడవిట్‌ దాఖలు చేసింది. సోనూ సూద్‌ తన నివాసంలో అక్రమ నిర్మాణాలు చేస్తున్నారని ఆరోపిస్తూ నగర పాలక సంస్థ ఇచ్చిన నోటీసులను ఆయన కోర్టులో సవాలు చేశారు. దీన్ని సివిల్‌ కోర్టు తిరస్కరించడంతో ఆయన హైకోర్టును ఆశ్రయించారు. 

ఆరు అంతస్థుల నివాస భవనం `శక్తిసాగర్‌`లో సోనూ సూద్‌ నిర్మాణ మార్పులు చేశాడని, దాన్ని వాణిజ్య హోటల్‌గా మారుస్తున్నాడని బీఎంసీ తన నోటీసులో పేర్కొంది. ఇందులో `అప్పీలు దారుడు అలవాటు పడ్డ నేరస్థుడు. అనధికార నిర్మాణాలతో ఆదాయాన్ని పొందుతున్నాడు. కూల్చేసిన భాగాన్ని, లైసెన్స్ లేని భాగాన్ని మళ్లీ అక్రమంగా నిర్మించాడ`ని తన అఫిడవిట్‌లో చెప్పింది బీఎంసీ. సోనూ నివాస స్థలం వాణిజ్యంగా మార్చడానికి అనుమతి లేదని, దాన్ని లెక్క చేయకుండా ఆయన హోటల్‌ నిర్మిస్తున్నారని తెలిపింది.

సోనూ సూడ్‌ అక్రమ నిర్మాణానికి వ్యతిరేకిస్తూ 2018 సెప్టెంబర్‌లో నోటీసులు జారీ చేశామని, నవంబర్‌ 12న కూల్చివేత చేశామని, దాన్ని అడ్డుకున్నాక కూడా సోనూ నిర్మాణ పనులు చేపట్టారని
వివరించింది. 2020 ఫిబ్రవరి 14న మరోసారి బీఎంసీ కూల్చివేతకు పాల్పడింది. తాజాగా బీఎంసీ అఫిడవిట్‌పై జస్టిస్‌ పృథ్వీరాజ్‌ చవాన్‌ నేడు(బుధవారం) విచారించనున్నారు.

click me!