`రెడ్‌` ఈవెంట్‌లో బిగ్‌ మిస్టేక్‌.. `క్రాక్‌` బిగ్‌ టికెట్‌ ప్రదర్శన.. దారుణంగా ట్రోలింగ్‌

Published : Jan 13, 2021, 07:35 AM IST
`రెడ్‌` ఈవెంట్‌లో బిగ్‌ మిస్టేక్‌.. `క్రాక్‌` బిగ్‌ టికెట్‌ ప్రదర్శన.. దారుణంగా ట్రోలింగ్‌

సారాంశం

రామ్‌ పోతినేని హీరోగా నటించిన `రెడ్‌` సినిమా సంక్రాంతి కానుకగా ఈ నెల 14న విడుదల కానుంది. ఈ సందర్భంగా మంగళవారం రాత్రి చిత్ర `ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌` జరిగింది. ఇందులో ఓ బిగ్‌ మిస్టేక్‌ జరిగింది. ఈవెంట్‌ ఆర్జనైజేషన్‌ తప్పిదం కారణంగా రామ్‌ తలదించుకోవాల్సి వచ్చింది. 

ఎనర్జిటిక్‌ హీరో రామ్‌ పోతినేని హీరోగా రూపొందిన చిత్రం `రెడ్‌`. కిశోర్‌ తిరుమల దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో నివేదా పేతురాజ్‌, మాళవిక శర్మ హీరోయిన్లుగా నటించారు. `స్రవంతి` రవికిషోర్‌ నిర్మించారు. సంక్రాంతి కానుకగా ఈ నెల 14న సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా మంగళవారం రాత్రి చిత్ర `ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌` జరిగింది. ఇందులో ఓ బిగ్‌ మిస్టేక్‌ జరిగింది. ఈవెంట్‌ ఆర్జనైజేషన్‌ తప్పిదం కారణంగా రామ్‌ తలదించుకోవాల్సి వచ్చింది. 

త్రివిక్రమ్‌ గెస్ట్ గా పాల్గొన్న ఈ ఈవెంట్‌లో చివరగా బిగ్‌ టికెట్‌ ప్రదర్శించారు. అయితే ఇందులో `క్రాక్‌` సినిమా టికెట్‌ని, 9వ తేదీని ఉన్న టికెట్‌ని ప్రదర్శించారు. ఇదే ఇప్పుడు రామ్‌ పరువు పోయేలా చేసింది. ఇంత పెద్ద ఈవెంట్‌ చేసి, అసలు విడుదల, సినిమా టికెట్‌ విషయంలోనే మిస్టేక్‌ చేయడం ఇప్పుడు అనేక విమర్శలకు తావిస్తుంది. పొరపాటు చిన్నదే అయితే దాని ప్రభావం చాలా పెద్దగా ఉంటుంది. అయితే విషయం తెలుసుకుని వెంటనే రెడ్‌ స్టిక్కర్‌ అంటిచ్చారు. డేట్‌ మాత్రం మార్చేలేదు.

ఇది చూసిన నెటిజన్లు దారుణంగా ట్రోలింగ్‌ చేస్తున్నారు. `రామ్‌ కొంచెం చూసుకోండి`, `ఇలా అయితే ఎలా రామ్‌`, `ఒక్క టికెట్‌నే ఎంత మందికి అమ్ముతారు.. `, `మేం రెడ్‌ చూడాలా, క్రాక్‌ చూడాలా` ఇలా నానా రకాలుగా ఏసుకుంటున్నారు. అయితే `క్రాక్‌` ఈవెంట్ ఆర్జనైజర్‌, రెడ్‌ ఈవెంట్‌ ఆర్జనైజర్‌ ఒక్కరే కావడంతో ఈ తప్పిదం జరిగిందని అంటున్నారు. పైగా ఒకే వేదికలో రెండు ఈవెంట్లు జరగడంతో ఇలా జరిగిందని అంటున్నారు. ఏదేమైనా, ఓ స్టార్‌ హీరో సినిమా ఈవెంట్‌లో ఇలా జరగడం ఆయనకే అవమానం. అది సినిమాపైనే ఎఫైక్ట్ పడుతుందనడంలో సందేహం లేదు. 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

తనూజతో రొమాంటిక్ మూమెంట్స్, సంతోషంతో పొంగిపోయిన కళ్యాణ్.. సంజనకి ఓజీ రేంజ్ ఎలివేషన్
ఆ స్టార్ హీరో వల్ల కెరీర్ నాశనం చేసుకున్న భూమిక, నగ్మా, స్నేహ ఉల్లాల్.. లిస్టులో మొత్తం ఏడుగురు బాధితులు