ప్రియాంక చోప్రా ఫ్యామిలీలో విషాదం.. `జక్కన్న` హీరోయిన్‌ మన్నారా చోప్రా తండ్రి కన్నుమూత

Published : Jun 17, 2025, 09:49 AM ISTUpdated : Jun 17, 2025, 09:55 AM IST
ప్రియాంక చోప్రా ఫ్యామిలీలో విషాదం.. `జక్కన్న` హీరోయిన్‌ మన్నారా చోప్రా తండ్రి కన్నుమూత

సారాంశం

ప్రియాంక చోప్రా ఫ్యామిలీలో విషాదం చోటుచేసుకుంది. ప్రియాంక కజిన్, హీరోయిన్‌ మన్నారా చోప్రా తండ్రి రామన్ రాయ్ హండా కన్నుమూశారు. 72 ఏళ్ల వయసులో ఆయన తుది శ్వాస విడిచారు.

 సినిమా ఇండస్ట్రీలో వరుసగా విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఆ మధ్యనే తెలుగు దర్శకుడు ఏఎస్‌ రవికుమార్‌ చౌదరీ కన్నుమూశారు. ఒక నిర్మాత మరణించారు. అలాగే బాలీవుడ్‌లో కరిష్మా కపూర్ మాజీ భర్త సంజయ్ కపూర్ గుండెపోటుతో మరణించిన వార్త ఇంకా మరువక ముందే మరో విషాదం చోటు చేసుకుంది.  

ప్రియాంక చోప్రా ఫ్యామిలీలో విషాదం

గ్లోబల్‌ స్టార్‌ ప్రియాంక చోప్రా ఫ్యామిలీలో విషాదం చోటు చేసుకుంది. ప్రియాంక కజిన్ మన్నారా చోప్రా తండ్రి రామన్ రాయ్ హండా కన్నుమూశారు. ఆయన వయసు 72 సంవత్సరాలు. చాలా కాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.

 ముంబైలో భార్య కమిని, కూతుళ్ళు మన్నారా, మిథాలితో కలిసి ఉండేవారు. మన్నారా తెలుగు, హిందీలో సినిమాలు చేస్తూ హీరోయిన్‌గా రాణిస్తుంది. అంతేకాదు బిగ్ బాస్ 17 లో కూడా పాల్గొన్నారు.

మన్నారా చోప్రా తండ్రి న్యాయవాది

మన్నారా చోప్రా తండ్రి రామన్ హండా ఢిల్లీ హైకోర్టులో న్యాయవాదిగా పనిచేశారు. ప్రియాంక చోప్రా, పరిణీతి చోప్రాల పిన్ని కమిని చోప్రాను వివాహం చేసుకున్నారు. తండ్రి మరణవార్తను మన్నారా సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. తండ్రి ఫోటో షేర్ చేస్తూ నివాళులు అర్పించారు. జూన్ 16, 2025న తండ్రి మరణించారని, జూన్ 18న అంబోలి, అంధేరీ వెస్ట్ లో అంత్యక్రియలు జరుగుతాయని తెలిపారు.

తెలుగులో సినిమాలు చేసిన మన్నారా చోప్రా  

మన్నారా చోప్రా.. ప్రియాంక చోప్రా, పరిణీతి చోప్రాల కజిన్. మోడల్ గా కెరీర్ ప్రారంభించిన ఆమె తెలుగు సినిమా 'ప్రేమ గీమా జంత నై' ద్వారా హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. `జక్కన్న`, `తిక్క`, `రోగ్‌`, `సీత`, `హై ఫౌవ్‌ః ఫన్‌ అండ్‌ గన్‌`, `తిరగబడరా సామీ` వంటి చిత్రాల్లో నటించింది. 

ఇక  'జిద్' సినిమాతో బాలీవుడ్ లో అడుగుపెట్టినా అక్కడ పెద్దగా గుర్తింపు రాలేదు. తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో  నటిస్తూ ఆకట్టుకుంటుంది. కానీ నటిగా స్టార్‌ స్టేటస్‌ని తెచ్చుకోలేకపోయింది. ఆ మధ్య హిందీలో బిగ్ బాస్ 17 షోలో పాల్గొని మంచి పాపులారిటీ సంపాదించింది మన్నారా. 

మహేష్‌, రాజమౌళి సినిమాలో ప్రియాంక

ప్రియాంక చోప్రా చాలా ఏళ్ల తర్వాత ఇండియన్‌ మూవీ చేస్తోంది. అదే సమయంలో తెలుగులో మొదటిసారి కలిసి నటిస్తుంది. మహేష్‌ బాబు హీరోగా రాజమౌళి దర్శకత్వంలో `ఎస్‌ఎస్‌ఎంబీ29` వర్కింగ్‌ టైటిల్‌తో ఓ మూవీ రూపొందుతుంది. ఈ చిత్రంలో కీలక పాత్రలో ప్రియాంక నటిస్తుంది. ప్రస్తుతం ఇది చిత్రీకరణ దశలో ఉంది. ఇంటర్నేషనల్‌ మూవీ రేంజ్‌లో దీన్ని రూపొందిస్తున్నారు దర్శకుడు రాజమౌళి. 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Articles on
click me!

Recommended Stories

Radha Daughter: చిరంజీవి హీరోయిన్ కూతురు, గుర్తుపట్టలేనంతగా ఎలా మారిపోయిందో చూడండి
Chiranjeevi: బ్యాగ్రౌండ్ లేకుండా స్టార్ గా ఎదిగిన హీరో, అతడికి కొడుకు పుట్టగానే జాతకం చెప్పిన చిరంజీవి