వర్మ "వంగవీటి"కి కౌంటర్ గా ఎమ్మెస్సార్ ప్రొడక్షన్స్ 'రణరంగం'

Published : Feb 23, 2017, 01:24 PM ISTUpdated : Mar 25, 2018, 11:58 PM IST
వర్మ "వంగవీటి"కి కౌంటర్ గా ఎమ్మెస్సార్ ప్రొడక్షన్స్ 'రణరంగం'

సారాంశం

బెజవాడ నేపథ్యంలో మరో సినిమా రణరంగం ఎం.ఎస్.ఆర్. ప్రొడక్షన్స్ పతాకంపై  నిర్మించనున్న మంచాల సాయిసుధాకర్ ఓ ప్రజా నాయకుని జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిస్తున్నామన్న నిర్మాత రామ్ గోపాల్ వర్మ వంగవీటి చిత్రానికి కౌంటర్ ఎటాక్ ఇచ్చేందుకే సినిమా?

ఎమ్‌.ఎస్‌.ఆర్‌. ప్రొడక్షన్స్‌ పతాకంపై విజయవాడలోని ఒక ప్రజానాయకుడి జీవిత చరిత్ర ఆధారంగా మరో చిత్రం తెరకెక్కనుంది. మంచాల సాయిసుధాకర్‌ నిర్మాణ సారథ్యంలో తెరకెక్కనున్న ఈ చిత్రానికి 'రణరంగం' అనే టైటిల్‌ని ఖరారు చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో నిర్మాత మంచాల సాయిసుధాకర్‌ మాట్లాడుతూ..'ప్రజల అభిష్టం మేరకు ఈ సినిమాను తెరకెక్కించనున్నాం. విజయవాడలోని ఒక ప్రజానాయకుడి జీవిత చరిత్రను, ఆయన గొప్పతనాన్ని ఈ చిత్రంలో చూపనున్నాం. ఈ చిత్రం పేరు 'రణరంగం'. ఈ చిత్రం షూటింగ్‌ని ఆంధ్రా, తెలంగాణలతో పాటు విదేశాల్లో కూడా షూటింగ్‌ జరపనున్నాం. దీనికి కారణం ఏమిటంటే ఆయనకి ప్రపంచవ్యాప్తంగా అభిమానులున్నారు. ఆ అభిమానుల కోరిక మేరకే ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మించనున్నాము. అలాగే ఈ చిత్రంలోని ఒక ప్రత్యేకమైన గీతాన్ని విజయవాడలో వేలాదిమంది అభిమానుల సమక్షంలో విడుదల చేయనున్నాము. అలాగే ఈ చిత్రానికి సంబంధించిన నటీనటులను, సాంకేతిక నిపుణులను విజయవాడ సభలో వెల్లడించనున్నాము..అని అన్నారు.

 

 
రైటర్‌ మరుధూరి రాజా మాట్లాడుతూ..'నాకు 14 యేట నుండి పేపరు చదివే అలవాటుంది. అప్పటి విజయవాడ రాజకీయ నేపథ్యాన్ని ఆకలింపు చేసుకుని, సినిమాగా రాయాలని అనుకున్నాను. విజయవాడ, అనంతపురం రాజకీయ నేపథ్యాలతో నా ఆధ్వర్యంలో ఓ సినిమా ఉండాలని కోరిక ఉండేది. అది ఇన్నాళ్లకు నెరవేరబోతుంది...అని అన్నారు. 


కార్యక్రమంలో ప్రముఖ దర్శకుడు జితేందర్‌, సంగీత దర్శకుడు ఆర్‌.బి. షా తదితరులు పాల్గొన్నారు.

PREV
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9: భరణి ఎలిమినేటెడ్.. టాప్ 5 సభ్యులు వీరే, ప్రియురాలి కోసం ఇమ్ము చేయబోతున్న త్యాగం ఇదే
రానా దగ్గుబాటి కెరీర్ లో టాప్ 10 సినిమాలు, అస్సలు మిస్ కాకూడదు.. ఇలాంటి పాత్రలు చేయగలిగిన ఏకైక నటుడు