కంగనా... ఆ లిస్ట్ ఏంటో మాకూ చెప్పొచ్చుగా..

First Published Feb 23, 2017, 10:13 AM IST
Highlights
  • మరోసారి సంచలనాత్మక స్టేట్ మెంట్ ఇచ్చిన కంగనా రనౌత్
  • గతంలో చాలామందికి ఆ సుఖం అందించానంటున్న బాలీవుడ్ బ్యూటీ
  • ఆ లిస్ట్ అంతా తన దగ్గర రెడీగా ఉందని ప్రకటించిన కంగన

బాలీవుడ్ లో బోల్డ్ యాక్షన్ డోస్ పెంచి యమా క్రేజ్ సంపాదించింది కంగనా రనౌత్. ఇటీవల హృతిక్ రోషన్ తో ఎఫైర్ బెడిసికొట్టి రచ్చ రచ్చైంది. అయితే హృతిక్ తో ఎఫైర్ కన్నా ముందే తన జీవితంలో రచ్చ రచ్చ వ్యవహారాలు చేశానంటోందీ బోల్డ్ బ్యూటీ.

 

తన కెరీర్ తొలినాళ్ళ లో చాలామంది తనతో ఆటలాడుకున్నారని చెప్తోంది కంగన. తెలిసి తెలియక అప్పట్లో చాలామందికి ఆ సుఖం అందించానని సంచలన వ్యాఖ్యలు చేసింది. బాలీవుడ్ క్వీన్ కంగన గత కొంత కాలంగా చీటికీ మాటికీ సంచలన వ్యాఖ్యలు చేస్తూ బాలీవుడ్ మగాళ్ల పరువుని బజారు కీడుస్తోంది. నిన్నటిదాకా హృతిక్ రోషన్ ను చెండాడిన కంగనా రనౌత్ తాజాగా మరో బాంబ్ పేల్చింది.

 

బాలీవుడ్ కు చెందిన పలువురు ప్రముఖ దర్శక నిర్మాతలు , హీరోలు  తనను ఇష్టం వచ్చినట్లు వాడుకున్నారంటోంది కంగన. అయితే అదంతా అప్పట్లో తనకు తెలియక చేయాల్సి వచ్చిందని.. కొత్తగా వచ్చే వాళ్ళు అలా లొంగిపోవద్దని, లౌక్యంగా వ్యవహరించాలని సలహా ఇస్తోంది కంగన రనౌత్.

 

తాజాగా కంగన నటించిన రంగూన్ మూవీ రిలీజ్ కు రెడీ అయింది. ఈ మూవీలో నగ్నంగా నటించడమే కాక.. ఎక్కడా ఎలాంటి టేప్స్ పెట్టుకోకుండా నటించానని చెప్పింది కంగన.

 

తనతో ఆడుకున్న వాళ్ళ లిస్ట్ అంతా తన దగ్గర ఉందని చెప్పి షాక్ ఇచ్చింది. దీంతో బాలీవుడ్ ప్రముఖుల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. ఆ లిస్ట్ ఏదో మాకూ ఇవ్వొచ్చుగా కంగనా..

click me!