‘సీఎస్ కేలోకి నన్ను తీసుకోండి’.. ఎంఎస్ ధోనీకి కమెడియన్ యోగిబాబు రిక్వెస్ట్.. అదిరిపోయే రిప్లై..

By Asianet News  |  First Published Jul 11, 2023, 4:29 PM IST

తమిళ నటుడు యోగిబాబు తాజాగా నటించిన చిత్రం LGM. ఈ చిత్ర ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు ఎంఎస్ ధోనీ హాజరయ్యారు. ఈ సందర్భంగా యోగిబాబు అడిగిన ప్రశ్నకు  అదిరిపోయే రిప్లై ఇచ్చారు. 
 



తమిళ నటుడు యోగిబాబు (Yogi Babu)ఇండస్ట్రీకి వచ్చిన  తక్కవ కాలంలోనే హ్యాసనటుడిగా మంచి పేరు సంపాదించారు. స్టార్ హీరోల సినిమాల్లో కీలక పాత్రలు పోషిస్తూ వచ్చారు. కోలీవుడ్ లో స్టార్ కమెడియన్ గా ఎదిగారు. ఇటు తెలుగు ప్రేక్షకులకు కూడా ఈయన బాగా పరిచయం అనే చెప్పాలి.  ప్రస్తుతం వరుస చిత్రాలతో ఫుల్ బిజీగా ఉన్నారు.

ఇక తాజాగా యోగిబాబు నటించిన లేటెస్ట్ ఫిల్మ్ ‘లెట్స్ గెట్ మ్యారీడ్’ (LGM). భారత మాజీ కెప్టెన్ MS ధోని, ఆయన భార్య సాక్షి ప్రారంభించిన ప్రొడక్షన్ హౌజ్ లో ఈ మూవీ రూపుదిద్దుకుంది. ఎంఎస్ ధోనీ ఎంటర్ టైన్ మెంట్స్ నుంచి వస్తున్న తొలిచిత్రం ఇదే. అయితే నిన్న చెన్నైలోని లీలా ప్యాలెస్ హోటల్‌లో మూవీ ఆడియో, ట్రైలర్ లాంచ్ ఈవెంట్ జరిగింది. ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో అభిమానులను సంపాదించుకున్న ఎంఎస్ ధోనీకి ‘చెన్నై సూపర్ కింగ్స్‌’ ద్వారా అక్కడి వారితో ప్రత్యేక అనుబంధం ఉందని చెప్పాలి. 

Latest Videos

దీంతో అతని తొలిచిత్రం ఎల్జీఎం ట్రైలర్ లాంచ్ ను చెన్నైలోనే నిర్వహించారు. అయితే ఈవెంట్ లో ప్రముఖ నటుడు యోగి బాబు ధోనీని అడిగిన ఓ ప్రశ్నకు, ఆయన ఇచ్చిన సమాధానం నెట్టింట వైరల్ గా మారింది. యోగిబాబు మాట్లాడుతూ.. ‘సిఎస్‌కెలో నన్ను ప్లేయర్‌గా తీసుకోవాలి’ అని కోరారు. దానికి ధోనీ ఆసక్తికరంగా రిప్లై ఇచ్చారు. 

ధోనీ మాట్లాడుతూ.. ‘ప్రస్తుతం అంబటి రాయుడు రిటైర్డ్ అయ్యాడు. కాబట్టి CSKలో మీకు స్థానం ఉంది. నేను మేనేజ్‌మెంట్‌తో మాట్లాడుతాను. కానీ, మీరు సినిమాల్లో చాలా బిజీగా ఉన్నారు. నేను మీకు చెప్తాను, మీరు స్థిరంగా ఆడాల్సి ఉంటుంది. వాళ్లు మాత్రం చాలా వేగంగా అంటే వేగంగా బౌలింగ్ చేస్తారు. కొన్ని సందర్భాల్లో మిమ్మల్ని గాయపరిచేందుకే బౌలింగ్ చేస్తారు కూడా’ అంటూ ఫన్నీగా ఆన్సర్ ఇచ్చారు. ప్రస్తుతం ఈ కన్వర్జేషన్ వైరల్ గా మారింది. ఇక గతంలో యోగిబాబుకు ధోనీ క్రికెట్ బ్యాట్ ను ప్రజెంట్ చేసిన విషయం తెలిసిందే. 
 

click me!