లుక్ మార్చేసిన రామ్ పోతినేని.. ‘డబుల్ ఇస్మార్ట్’కు రెడీ.. వైరల్ గా మారిన వీడియో

By Asianet News  |  First Published Jul 11, 2023, 3:35 PM IST

‘స్కంద’ లుక్ నుంచి రామ్ పోతినేని ఇస్మార్ట్ శంకర్ లుక్ లోకి మారిపోయారు. నయా లుక్ లో ఉస్తాద్ మరింత మాస్ గా కనిపిస్తున్నారు. తాజాగా ‘డబుల్ ఇస్మార్ట్’ విడుదల చేసిన రామ్ ట్రాన్స్ ఫర్మేషన్ వీడియో వైరల్ గా మారింది.
 


ఉస్తాద్ రామ్ పోతినేని (Ram Pothineni) - స్టార్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ కాంబోలో 2019లో ‘ఇస్మార్ట్ శంకర్’ శంకర్ విడుదలైన విషయం తెలిసిందే. ఈ చిత్రం మాస్ ఆడియెన్స్ ను బాగా మెప్పించింది. రామ్ పోతినేని అటిట్యూడ్, సాంగ్స్, ఫైట్స్, తెలంగాణ స్లాంగ్, స్టైల్, పూరీ మార్క్ ప్రేక్షకులకు బాగా నచ్చింది. గతంలో ప్రకటించినట్టుగానే సీక్వెల్ ను కూడా రీసెంట్ గా ప్రారంభించారు. ‘డబుల్ ఇస్మార్ట్’ టైటిల్ తో రూపుదిద్దుకోనుంది.

నిన్న గ్రాండ్ పూజా కార్యక్రమాలతో Double Ismart మూవీ ప్రారంభమైన విషయం తెలిసిందే. అయితే తాజాగా యూనిట్ ఓ ఇంట్రెస్టింగ్ వీడియోను షేర్ చేసింది. మొన్నటి వరకు రామ్ పోతినేని బోయపాటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ’స్కంద’ మూవీ లుక్ లో కనిపించిన విషయం తెలిసిందే. ఇక తాజాగా లుక్ మార్చేశారు. ఇస్మార్ట్ శంకర్ గా మారాపోయారు. రామ్ పోతినేని లేటెస్ట్ లుక్స్ కు ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. 

Latest Videos

అప్పట్లో ఇస్మార్ట్ శంకర్ లుక్ ఎంత ట్రెండ్ అయ్యిందో తెలిసిందే. అలాగే బాడీ లాంగ్వేజీ, డ్రెసింగ్ విధానం కూడా యూత్ పై ప్రభావం చూపింది. దీంతో ఇస్మార్ట్ శంకర్ కలెక్షన్స్ ను కూడా అందుబాటులోకి తీసుకొచ్చారు. ఇక తాజాగా గడ్డంతోనే డబుల్ ఇంపాక్ట్ చూపించేలా రామ్ పోతినేని మాస్ లుక్ లో రెడీ అయ్యారు. ఈ ట్రాన్స్ ఫార్మేషన్   వీడియోను యూనిట్ విడుదల చేసింది. 

ఈ వీడియోను పంచుకుంటూ రేపటి నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుందని కూడా వెల్లడించారు. రామ్ పోతినేని రేపు సెట్స్ లో అడుగుపెట్టబోతున్నారని తెలిపారు. ఇక రామ్ తన లుక్ ను పూర్తిమార్చేయడంతో ‘స్కంద’ షూటింగ్ పూర్తైనట్టు తెలుస్తోంది. ఈ చిత్రం సెప్టెంబర్ 15న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక  డబుల్ ఇస్మార్ట్ వచ్చే ఏడాది మార్చి 8న గ్రాండ్ గా విడుదల కానుంది. 

A transformation that will transport you to the world of 🤙

Ustaad is back to Banger Avatar as to give you all DOUBLE IMPACT🔥

- https://t.co/ynTwXYDnWM

Madness begins on the sets TOMORROW❤️‍🔥
In cinemas on MARCH 8th, 2024💥… pic.twitter.com/eFwMkCalvO

— Puri Connects (@PuriConnects)
click me!