వర్మ, రాజమౌళి ఇష్టపడే నవల్లో పాత్ర ఆధారంగా 'మిస్టర్ కింగ్'

By Surya Prakash  |  First Published Feb 21, 2023, 11:46 AM IST

హోవార్డ్‌ రోర్క్‌ నిరుద్వేగి. దేనికీ కుంగిపోడు. దేనికీ ఉప్పొంగిపోడు. పోతపోసిన ఇనుము. అతని నిస్సందిగ్ధత మనల్ని ముగ్ధుల్ని చేస్తుంది. ఏ నిర్ణయంలోనూ పరాధీనత ఉండదు. 


నవలలను ఆధారం చేసుకుని చాలా సినిమాలు వచ్చాయి. అందులో చాలా భాగం సక్సెస్ అయ్యాయి కూడా. అయితే ఓ పాపులర్ నవల్లోని ఓ పాత్ర ప్రభావంతో ఓ క్యారక్టర్ రాసుకుని దాన్ని జనాల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం మాత్రం అరుదు. ఎంతో మంది ఇష్టపడి ,ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టించి, రామ్ గోపాల్ వర్మ, రాజమౌళి వంటి వారు ఎప్పుడూ ప్రస్దావించే ఓ నవల ఫౌంటెన్ హెడ్. ఈ నవల రాసినప్పటినుంచి  ఇప్పటిదాకా అంటే దాదాపు 75 ఏళ్లుగా సెన్సేషన్ క్రియేట్ చేస్తూనే ఉంది. 

ఈ నవలను అమెరికన్ నవలారచయిత్రి అయిన్ రాండ్  రచించారు. మార్మికవాదం, మార్క్సిజం, కలెక్టివిజం వంటి భావనలను వ్యతిరేకిస్తూ ఆమె ఆబ్జెక్టివిజంని ఈ నవలలో ప్రతిపాదించారు.   ఇందులో ప్రధాన పాత్ర హోవార్డ్ రోర్క్. ఆ పాత్ర చాలా మందికి ప్రేరణగా నిలిచింది. పిక్షన్ పాత్రను ఆరాధించే వాళ్లు ప్రపంచ వ్యాప్తంగా ఉన్నారు.స్వార్థపరుడైన గొప్ప వ్యక్తి ఈ నవలలో హీరో. స్వార్థం అనేది తప్పు అని మనకు చెబుతూ వచ్చాయి మతాలు. అనేకమంది తత్వవేత్తలు కూడా స్వార్థ రాహిత్యం గొప్పదని బోధించారు. అయిన్‌ రాండ్‌ అదంతా తప్పు అంది. ఇంతవరకూ మనం స్వార్థమని భావిస్తున్నది ఎంత నిస్సా్వర్థమో అందువల్ల ఎంత నిస్సారమో చూపించింది.

Latest Videos

హోవార్డ్‌ రోర్క్‌ నిరుద్వేగి. దేనికీ కుంగిపోడు. దేనికీ ఉప్పొంగిపోడు. పోతపోసిన ఇనుము. అతని నిస్సందిగ్ధత మనల్ని ముగ్ధుల్ని చేస్తుంది. ఏ నిర్ణయంలోనూ పరాధీనత ఉండదు. అతనికి ప్రపంచంతో నిరంతర ఘర్షణ. కానీ తన లోలోపల పరిపూర్ణ శాంతి. ఘర్షణలో ఉంటూ అంతశ్శాంతిని నిలుపుకున్నవాళ్లు అరుదు. రోర్క్‌ ఎందరో మేధావులకి ప్రేరణగా నిలిచిన పాత్ర. అయిన్‌ రాండ్‌ తన ఫిలాసఫీని ఆబ్జెక్టివిజం పేరుతో ప్రకటించింది. విభేదించడానికి అయినా చదవాల్సిన రచయిత్రి.

 ఇప్పుడీ పాత్ర బేస్ చేసుకుని... అలాంటి ఓ వ్యక్తి ఇప్పటి మన తెలుగు సమాజంలో ఉంటే ..అతని ప్రొఫెషనల్,పర్శనల్ లైఫ్ ఎలా ఉంటుంది. అతని ప్రభావం మిగతా వాళ్ల మీద ఎలా ఉంటుందని అనేది చెప్తూ మిస్టర్ కింగ్ సినిమా రూపొందింది అని సమాచారం.   నాకు జీవితం పట్ల ఉన్న ప్రేమ మీద ఒట్టేసి చెప్తున్నాను.."నా కోసం జీవించమని ఎవర్నీ అడగను. నేను ఎవరి కోసం జీవించను"..అంటాడు హోవార్డ్ రోర్క్ అయానరాండ్ నవల ఫౌంటైన్ హెడ్ లో....ఇదే ఈ సినిమాలో ఉంటుందని వినిపిస్తోంది. ఇందులో నిజమెంత అనేది సినిమా రిలీజ్ అయ్యాక చూడాలి. 

దర్శకుడు శశిధర్ మాట్లాడుతూ.. ఆత్మాభిమానం వున్న ఓ అబ్బాయి కథ ఇది. ప్రేక్షకుడు తనని తాను హీరోగా చూసుకునే కథ ఇది. సినిమాలో చాలా అద్భుతమైన విషయాలు వున్నాయి. ఈ మధ్య స్క్రీన్ వేసినపుడు చివర్లో కన్నీళ్లు వచ్చాయని చూసిన వారు చెప్పారు. 24న ఇన్ని మంచి విషయాలు వున్న సినిమా చూస్తారు. థియేటర్ కి వచ్చి సినిమా చూడండి. ఖచ్చితంగా మిమ్మల్ని ఎంటర్ టైన్ చేస్తుంది. యూత్ విజల్స్ వేసే చాలా బ్లాక్స్ ఇందులో వున్నాయి. సినిమా థియేటర్ నుంచి బయటికి వెళ్ళినపుడు ఒక చిరునవ్వుతో వెళ్తారు. 24న అందరం థియేటర్లో కలుద్దాం’’ అన్నారు  

నిర్మాత మాట్లాడుతూ ‘ఓ విభిన్నమైన కథ ఇది. నేటి యూత్‌కు బాగా కనెక్ట్‌ అవుతుంది. లాక్‌డౌన్‌ టైమ్‌లో ఎన్నో సవాళ్లను ఎదుర్కొని చిత్రీకరణ పూర్తిచేశాం. మణిశర్మ చక్కటి స్వరాల్ని అందించారు. కొత్తవాడైనా శరణ్‌కుమార్‌ మంచి నటనను కనబరిచాడు’ అని చెప్పారు. 

విజయనిర్మల మనవడు శరణ్‌ కుమార్‌ (నరేశ్‌ కజిన్‌ రాజ్‌కుమార్‌ కొడుకు)  హీరోగా,  శశిధర్‌ చావలి దర్శకత్వంలో తెరకెక్కిన యూత్ ఫుల్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ ‘మిస్టర్‌ కింగ్‌’. హన్విక క్రియేషన్ బ్యానర్ బి.ఎన్‌.రావు నిర్మించారు. యశ్విక నిష్కల, ఊర్వీ సింగ్‌ హీరోయిన్స్ గా నటించారు. మణిశర్మ మ్యూజిక్ అందించిన ఈ చిత్రంలో పాటలు ఇప్పటికే సూపర్ హిట్ అయ్యాయి. అలాగే టీజర్ కు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. ఈ నెల 24న ‘మిస్టర్‌ కింగ్‌’ చిత్రం ప్రేక్షకుల ముందుకు వస్తోంది.

click me!