సినిమా టికెట్ ధర తగ్గనుందా..?

By AN TeluguFirst Published Jul 4, 2019, 11:58 AM IST
Highlights

ఒకప్పుడు వ్యాట్, సర్వీస్ ట్యాక్స్ వంటివి ఉండేవి. కానీ ఇప్పుడు వాటి స్థానంలో వస్తుసేవల పన్ను(జీఎస్టీ) వచ్చింది. 

ఒకప్పుడు వ్యాట్, సర్వీస్ ట్యాక్స్ వంటివి ఉండేవి. కానీ ఇప్పుడు వాటి స్థానంలో వస్తుసేవల పన్ను(జీఎస్టీ) వచ్చింది. మనం కొనే ప్రతీవస్తువుకి కేంద్రానికి జీఎస్టీ రూపంలో టాక్స్ చెల్లిస్తున్నాం. సినిమా టికెట్లకు సంబంధించి కూడా టాక్స్ కడుతున్నాం.

అయితే ఇప్పుడు ఎంటర్టైన్మెంట్ రంగం సినిమా టికెట్లపై ఒకే పన్ను విధించాలని కోరుకుంటోంది. ప్రస్తుతం రూ.100కి పైన ధర ఉన్న టికెట్లపై జీఎస్టీ స్లాబ్ 18 శాతంగా ఉంది. అదే రూ.100లోపు ధర ఉన్న మూవీ టికెట్లపై జీఎస్టీ స్లాబ్ 12శాతం. ఈ క్రమంలో మూవీ టికెట్లపై ఒకే పన్ను విధించాలని సినీ పరిశ్రమ ప్రభుత్వాన్ని కోరుతూ వస్తోంది. బడ్జెట్ లో దీనికి సంబంధించిన ప్రకటన చేయాలని కోరింది.

కేంద్ర ప్రభుత్వం జూలై 5న బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్న సంగతి తెలిసిందే. కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ కు ఇది తొలి బడ్జెట్. టికెట్ ధరలతో సంబంధం లేకుండా  ప్రతీ సినిమా టికెట్ పై 12 శాతం జీఎస్టీ రేటుని వర్తింపజేయాలని.. దీని కారణంగా సినిమా చూసేవారి సంఖ్యా పెరుగుతుందని హార్క్‌నెస్ స్క్రీన్స్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ (ఆసియా) ప్రీతమ్ డేనియల్ తెలిపారు.

కేంద్రం బడ్జెట్‌లో జీఎస్‌టీ తగ్గింపు ప్రకటన చేస్తే సినిమా టికెట్ ధరలు దిగివచ్చే అవకాశముంది. జీఎస్‌టీ తగ్గింపుతోపాటు మీడియా అండ్ ఎంటర్‌టైన్‌మెంట్ రంగంలో డిజిటల్ సంస్కరణలు కూడా తీసుకురావాలని పరిశ్రమకు చెందినవారు కోరుకుంటున్నారు. 

click me!