సమంత కటౌట్ పై క్రేజీ కామెంట్స్!

Published : Jul 04, 2019, 11:40 AM IST
సమంత కటౌట్ పై క్రేజీ కామెంట్స్!

సారాంశం

దక్షిణాది స్టార్ హీరోయిన్ సమంత ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం 'ఓ బేబీ'.

దక్షిణాది స్టార్ హీరోయిన్ సమంత ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం 'ఓ బేబీ'. కొరియన్ సినిమా 'మిస్ గ్రానీ'కి రీమేక్ గా ఈ సినిమాను రూపొందిస్తున్నారు. శుక్రవారం నాడు ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఈ క్రమంలో హైదరాబాద్ లో ఓ థియేటర్ దగ్గర సమంత భారీ కటౌట్ ని ఏర్పాటు చేశారు. అయితే ఈ కటౌట్ ఫోటోని ట్వీట్ చేస్తూ ఓ అభిమాని ఆసక్తికర కామెంట్ చేశాడు.

'మా స్నేహితుడు ఈ కటౌట్ ని కొద్దిగా గ్రాఫిక్స్ లో కండలు కనిపించేలా చేసి.. తన జిమ్ అడ్వర్టైజ్మెంట్ కటౌట్ గా వాడుకోవచ్చా.. మీ వీరాభిమాని అయిన అతను మా ఊళ్లో జిమ్ నడుపుతున్నాడు.. మీరేమంటారు' అంటూ కామెంట్ చేశాడు. వెంటనే స్పందించిన సమంత 'బేబీ ఆన్ స్టెరాయిడ్స్' అంటూ రిప్లై ఇచ్చింది.

నందిని రెడ్డి డైరెక్ట్ చేసిన ఈ  సినిమాలో  సమంతతో పాటు నాగశౌర్య, లక్షీ, రాజేంద్రప్రసాద్, రావు రమేష్ లు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. 

PREV
click me!

Recommended Stories

హీరోలంతా లైన్‌ వేయడానికే అప్రోచ్‌ అవుతారని ఏకంగా స్టార్‌ హీరోని అవాయిడ్‌ చేసిన అనసూయ
జైలర్ 2 లో తమన్నాకి నో ఛాన్స్.. రజినీకాంత్ తో ఐటెం సాంగ్ లో స్టెప్పులేయబోతున్న బ్యూటీ ఎవరో తెలుసా ?