ఇప్పుడు సంతోషంగా చచ్చిపోతా.. నటి కామెంట్స్!

Published : Nov 17, 2018, 10:50 AM IST
ఇప్పుడు సంతోషంగా చచ్చిపోతా.. నటి కామెంట్స్!

సారాంశం

'నాగిని' సీరియల్ తో బుల్లితెరపై పాపులారిటీ దక్కించుకున్న నటి మౌనీ రాయ్ కి ఇప్పుడు సినిమాలలో కూడా అవకాశాలు వస్తున్నాయి. అక్షయ్ కుమార్ నటించిన 'గోల్డ్' సినిమాతో బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ ప్రస్తుతం 'బ్రహ్మాస్త్ర' సినిమాలో నటిస్తోంది. 

ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందుతోన్న ఈ సినిమాలో మౌనీ రాయ్.. అమితాబ్ బచ్చన్ వంటి అగ్ర హీరోలతో కలిసి నటిస్తోంది. ఇటీవల మీడియా ముందుకొచ్చిన ఆమె.. అమితాబ్ గురించి నటించడం గురించి మాట్లాడుతూ.. బిగ్ బీతో కలిసి నటించాను.. తనతో నటించడం కంటే మంచి అవకాశం మరొకటి లేదు.

ఇప్పుడు నేను సంతోషంగా చనిపోతాను అంటూ ఎమోషనల్ అయింది. షూటింగ్ సమయంలో బిగ్ బీ ఏమైనా సలహాలు ఇచ్చారా అనే ప్రశ్నకి సమాధానంగా.. ప్రత్యేకంగా ఎలాంటి సలహాలు ఇవ్వలేదని.. ఆయనతో నటిస్తున్నప్పుడు నా ఫోకస్ మొత్తం చెదిరిపోయేదని, లెజండరీ యాక్టర్ తో స్క్రీన్ షేర్ చేసుకోవడం నిజంగా నా అదృష్టమని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఆమె 'బ్రహ్మాస్త్ర'తో పాటు.. రాజ్ కుమార్ రావు నటిస్తోన్న 'మేడ్ ఇన్ చైనా', జాన్ అబ్రహం నటిస్తోన్న 'రోమియో అక్బర్ వాల్తేర్' సినిమాలలో నటిస్తోంది. 
 
PREV
click me!

Recommended Stories

అడివి శేష్ గూఢచారి 2 తో పాటు బోల్డ్ హీరోయిన్ నుంచి రాబోతున్న 5 సినిమాలు ఇవే
అఖండ 2 లో బాలయ్య కంటే 48 ఏళ్లు చిన్న నటి ఎవరో తెలుసా? ఐదుగురు హీరోయిన్ల ఏజ్ గ్యాప్ ఎంత?