అనుష్క తల్లి కాబోతుందా..?

By Udayavani DhuliFirst Published Nov 17, 2018, 10:27 AM IST
Highlights

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క శర్మ గతేడాది టీం ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లిని పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ జంట తల్లితండ్రులు కాబోతున్నట్లు బాలీవుడ్ మీడియా వార్తలు ప్రచురిస్తోంది. 

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క శర్మ గతేడాది టీం ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లిని పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ జంట తల్లితండ్రులు కాబోతున్నట్లు బాలీవుడ్ మీడియా వార్తలు ప్రచురిస్తోంది. 

పిల్లల విషయంలో అనుష్క కొంత సమయం తీసుకుందామని అనుకున్నా.. విరాట్ కోహ్లికి పిల్లలంటే ఇష్టం ఉండడంతో ఆలస్యం చేయకూడదని నిర్ణయించుకున్నారట. తాజాగా అనుష్కకి సంబంధించి ఓ ఫోటో సోషల్మీడియాలో వైరల్ అయింది.

ఈ ఫోటోలో అనుష్కని చూసి చాలా మంది ఆమె గర్భవతి అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. బాలీవుడ్ వర్గాల నుండి కూడా ఈ విషయంపై అవుననే సమాధానాలు వినిపిస్తుండడంతో ఇప్పుడు ఈ విషయం వైరల్ అయింది.

అయితే ఇప్పటివరకు ఈ విషయంపై విరాట్ కానీ అనుష్క కానీ స్పందించలేదు. అయినప్పటికీ సోషల్ మీడియాలో విరుష్క దంపతులు తల్లితండ్రులు కాబోతున్నారంటూ ప్రచారం జరుగుతోంది. ఈ వార్త గనుక నిజమైతే విరుష్క అభిమానుల ఆనందానికి అవధులుండవు. 

click me!