Bigg boss telugu5:బిగ్ బాస్ కి షాకిచ్చిన కంటెస్టెంట్స్... విశ్వ ఎలిమినేషన్ పై ఓపెన్ గా అలాంటి కామెంట్స్

By team teluguFirst Published Nov 8, 2021, 9:33 AM IST
Highlights

విశ్వ ఎలిమినేషన్ ప్రేక్షకులతో పాటు, కంటెస్టెంట్స్ కి కూడా షాక్ ఇచ్చింది.ఎలిమినేషన్ జరిగిన తర్వాత వాళ్ళ మధ్య జరిగిన సంభాషణ ఇందుకు నిదర్శనం.

స్ట్రాంగ్ కంటెస్టెంట్... ఫైనల్ లో ఖచ్చితంగా ఉంటాడనుకున్న విశ్వ (Vishwa) ఆట, మధ్యలోనే ముగిసింది. ఈ కండల వీరుడు తొమ్మిదవ వారం హౌస్ నుండి ఎలిమినేట్ అయ్యాడు. హౌస్ లో విశ్వకు మంచి పేరుంది. దాదాపు అందరు కంటెస్టెంట్స్ తో అతనికి మంచి రిలేషన్ ఉంది. కష్టపడతాడన్న గుడ్ విల్ కూడా అతని సొంతం. ఇవేమీ పరిగణలోకి రాలేదు. బిగ్ బాస్ లెక్క ప్రకారం నామినేషన్స్ లో ఉన్నవారిలో అతి తక్కువ ఓట్లు రావడంతో విశ్వ ఎలిమినేట్ అయ్యారు. 


విశ్వ ఎలిమినేషన్ ప్రేక్షకులతో పాటు, కంటెస్టెంట్స్ కి కూడా షాక్ ఇచ్చింది.ఎలిమినేషన్ జరిగిన తర్వాత వాళ్ళ మధ్య జరిగిన సంభాషణ ఇందుకు నిదర్శనం. విశ్వ ఎలిమినేషన్ కన్ఫర్మ్ అయ్యి, ఇంటి నుండి బయటికి వెళ్ళాక, హౌస్ మేట్స్ మధ్య చర్చ నడిచింది. విశ్వ టాస్క్ లలలో నంబర్ వన్. ఇంటి పనులు అన్నీ చూసుకుంటాడు. రెండు సార్లు కెప్టెన్ అయ్యాడు. రేషన్ మేనేజర్ గా పర్ఫెక్ట్ గా బాధ్యతలు నెరవేర్చాడు. ప్రతి విషయంలో ఇంత పర్ఫెక్ట్ గా ఉన్న విశ్వ ఎలిమినేట్ కావడం ఏమిటని, వాళ్ళు అనుమానం వ్యక్తం చేశారు.

 
అదే సమయంలో Bigg boss హౌస్ లో పర్ఫెక్ట్ గా ఉండి, టాస్క్ లలో కష్టపడి ఆడితే హౌస్ లో ఉంటాం అనేది అపోహ మాత్రమే, ఇంకా ఏదో ఉంది... అంటూ కంటెస్టెంట్స్ అనుమానాలు వ్యక్తం చేశారు. వీరి డిస్కషన్ మరో అనుమానానికి కూడా తావిచ్చింది. బిగ్ బాస్ ఎలిమినేషన్ పై అనేక అనుమానాలు ఉన్నాయి. జనాలు వేసే ఓట్లకు పారదర్శకత లేదు. గత సీజన్ లో ఇదే విషయమై సోషల్ మీడియా వేదికగా పూర్తి వ్యతిరేకత వ్యక్తం అయ్యింది. నాగార్జున (Nagarjuna) స్వయంగా వివరణ కూడా ఇచ్చారు. అయినప్పటికీ ఓట్ల ఆధారంగా కాకుండా, నిర్వాహకులు నిర్ణయంపై కంటెస్టెంట్స్ ని ఎలిమినేట్ చేస్తున్నారని చాలా మంది భావిస్తున్నారు. 

Also read Sunil: నడ్డివిరిగితే గానీ తత్త్వం బోధపడలేదు అయ్యగారికి!
విశ్వ విషయానికి వస్తే.. ప్రతి విషయంలో పర్ఫెక్ట్ గా ఉంటున్న అతనికి జనాలు ఓట్లు ఎందుకు వేయరు. కాదు... ప్రియ, సన్నీ మాదిరి పూర్తి కాంట్రవర్షియల్ పర్సన్ అయితే, ఆ రీజన్ తో ప్రేక్షకులలో వ్యతిరేకత వ్యక్తం అయ్యే అవకాశం ఉంటుంది. ఏది ఏమైనా విశ్వ ఎలిమినేషన్ మరోమారు బిగ్ బాస్ హౌస్ పై నీలినీడలు కమ్మేలా చేసింది. ఇక హౌస్ నుండి మొత్తం తొమ్మిది మంది ఎలిమినేట్ కాగా... పది మంది మిగిలారు. శ్రీరామ్, రవి, సన్నీ, జస్వంత్, షణ్ముఖ్, సిరి, అన్నీ, కాజల్, మానస్, ప్రియాంక హౌస్ లో ఉన్నారు. 

Also read Viswa Eliminated: బిగ్‌ బాస్ ‌5లో బిగ్‌ షాక్‌.. షణ్ముఖ్‌, రవి, ప్రియాంక, శ్రీరామ్‌లపై విశ్వ హాట్‌ కామెంట్‌
 

click me!