అమ్మను కలవలేకపోయిన మోనాల్, ఆమె బాధను చూడలేక ఆవేదనకు గురైన అఖిల్

Published : Nov 19, 2020, 05:34 PM ISTUpdated : Nov 19, 2020, 05:36 PM IST
అమ్మను కలవలేకపోయిన మోనాల్, ఆమె బాధను చూడలేక ఆవేదనకు గురైన అఖిల్

సారాంశం

మోనాల్ ని కలవడానికి ఎవరూ రాలేదు. మోనాల్ నేటివ్ ప్లేస్ గుజరాత్ కావడంతో హైదరాబాద్ రాలేకపోయారు. మోనాల్ కి తండ్రి లేదు, తల్లి ఒక్కతే కావడం వలన ఆమె బిగ్ బాస్ హౌస్ కి రావడం కుదరలేదు. ఇదే విషయాన్ని ఆడియో ద్వారా మోనాల్ తల్లి ఆమెకు తెలియజేసింది. తల్లి వాయిస్ విని ఆమె వచ్చిందని ఆనందపడిన మోనాల్ కి నిరాశే మిగిలింది.   

బిగ్ బాస్ హౌస్ లో ఎమోషనల్ ఎపిసోడ్స్ నడుస్తున్నాయి. హౌస్ ని కమాండర్ ఇన్స్టిట్యూట్ గా మార్చి ఇంటి సభ్యులను ఇబ్బంది పెడుతూనే, పేరెంట్స్ ని కలిసే అవకాశం ఇచ్చాడు బిగ్ బాస్. అఖిల్, అభిజిత్, అవినాష్ వాళ్ళ తల్లులను కలవడం జరిగింది. అలాగే హారిక కూడా వాళ్ళ అమ్మను కలిశారు. 

కాగా నేడు బిగ్ బాస్ హౌస్ లో మిగిలిన సోహైల్, లాస్య మరియు ఆరియానా కుటుంబ సభ్యులను కలిశారు. సోహైల్ ఫాథర్ రాగా, లాస్యను కలవడానికి బాబుతో భర్త వచ్చారు. అలాగే ఆరియానా కోసం బ్రదర్ రావడం జరిగింది. చాలా కాలంగా అమ్మానాన్నలను, అయినవాళ్ళను మిస్సైన కంటెస్టెంట్స్ చాలా హ్యాపీగా ఫీలయ్యారు. కుటుంబ సభ్యుల యోగ క్షేమాలతో పాటు, బయట వాళ్ళు తమ గేమ్ గురించి ఏమనుకుంటున్నారో అడిగి తెలుసుకున్నారు. 

ఐతే మోనాల్ ని కలవడానికి ఎవరూ రాలేదు. మోనాల్ నేటివ్ ప్లేస్ గుజరాత్ కావడంతో హైదరాబాద్ రాలేకపోయారు. మోనాల్ కి తండ్రి లేదు, తల్లి ఒక్కతే కావడం వలన ఆమె బిగ్ బాస్ హౌస్ కి రావడం కుదరలేదు. ఇదే విషయాన్ని ఆడియో ద్వారా మోనాల్ తల్లి ఆమెకు తెలియజేసింది. తల్లి వాయిస్ విని ఆమె వచ్చిందని ఆనందపడిన మోనాల్ కి నిరాశే మిగిలింది. 

'నిన్ను కలవడానికి హైదరాబాద్ రావలసింది...కానీ నన్ను ఇక్కడకు తీసుకురావడానికి ఎవరూ లేరని, అందుకే రాలేకపోయాను' అని మోనాల్ తల్లి ఆడియో సందేశంలో చెప్పారు. అందరూ తమ తల్లిదండ్రులను కలుసుకోగా మోనాల్ మాత్రం ఆ అవకాశం కోల్పోయారు. దీనితో ఆమె బాత్ రూమ్ లోకి వెళ్లి గట్టిగా ఏడ్చేశారు. 

ఇక మోనాల్ బాధను చూసిన అఖిల్ చాలా ఎమోషనల్ అయ్యాడు. అఖిల్ కూడా ఏడ్చినంత  పనిచేశారు. చిన్న చిన్న విషయాలకే ఏడ్చేసే మోనాల్, ఈ సంఘటనతో మరింత ఆవేదనకు గురయ్యారు. 

PREV
click me!

Recommended Stories

Nagarjuna: కోడలు శోభితా ప్రెగ్నెన్సీపై నాగార్జున రియాక్షన్‌ ఇదే, తాత కావడంపై హింట్‌.. రూ.2కోట్ల విరాళం
Karthika Deepam 2 Today Episode: వైరాతో చేతులు కలిపిన జ్యోత్స్న- శ్రీధర్ ని కార్తీక్ కాపాడుతాడా?