థ్రిల్‌ కోసం రైడ్‌ చేసింది.. అడ్డంగా బుక్కైంది.. తాప్సీకి షాక్‌

Published : Nov 19, 2020, 03:37 PM IST
థ్రిల్‌ కోసం రైడ్‌ చేసింది.. అడ్డంగా బుక్కైంది.. తాప్సీకి షాక్‌

సారాంశం

బైక్‌ రైడ్‌ చేయడం తప్పు కాకపోయినప్పటికీ, హెల్మెట్‌ ధరించకపోవడం తప్పుడు. అన్నీ తెలిసిన తాప్సీ అదే తప్పు చేసింది. థ్రిల్‌ కోసం హెల్మెట్‌ లేకుండా బైక్‌ డ్రైవ్‌ చేసి పోలీసులకు దొరికిపోయింది.

ఇటీవల ఓ హీరోయిన్‌ భార్యకి నచ్చలేదని, తనని సినిమాలోనుంచి తీసేశారని సంచలన వ్యాఖ్యలు చేసిన తాప్సీ ఇప్పుడు పోలీసులకు అడ్డంగా దొరికిపోయింది. బైక్‌ రైడింగ్‌ చేస్తూ బుక్కైపోయింది. ఇంతకి ఏం జరిగిందనేది చూస్తే, బోల్డ్ కామెంట్లతో అప్పుడప్పుడు వార్తల్లో నిలుస్తున్న తాప్సీ తనకిష్టమైన బైక్‌ రైడింగ్‌ చేసింది. 

బైక్‌ రైడ్‌ చేయడం తప్పు కాకపోయినప్పటికీ, హెల్మెట్‌ ధరించకపోవడం తప్పుడు. అన్నీ తెలిసిన తాప్సీ అదే తప్పు చేసింది. థ్రిల్‌ కోసం హెల్మెట్‌ లేకుండా బైక్‌ డ్రైవ్‌ చేసి పోలీసులకు దొరికిపోయింది. ట్రాఫిక్‌ పోలీసులు ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకున్నారు. ఫైన్‌ కట్టాలని చెప్పారు. తనకు ట్రాఫిక్‌ పోలీసులు చలానా విధించిన విషయం చెబుతూ, తాప్సీ బైక్‌ రైడ్‌ ఫోటోని తన ఇన్‌ స్టాగ్రామ్‌ ద్వారా పంచుకుంది. అయితే ప్రతి ఒక్కరు హెల్మెట్‌ ధరించి బైక్‌ డ్రైవ్‌ చేయాలని పేర్కొంది. 

ఇదంతా తాను నటిస్తున్న `రష్మీ రాకెట్‌` సెట్‌లో చోటు చేసుకుంది. అంతేకాదు మరో ఫోటోని పంచుకుంటూ `నా దివాళి గిఫ్ట్స్ తో నేను` అని పేర్కొంది. ఇందులో మమ్మీ అండ్‌ పుచి అనే యాష్‌ ట్యాగ్‌ని పంచుకుంది. రష్మీ రాకెట్‌ సెట్‌లో అని పేర్కొంది. ఇందులో వాళ్ల మమ్మీపై కూర్చొని ఉంది తాప్సీ. దీంతోపాటు `శెభాష్‌ మిత్తు` చిత్రంలో కూడా తాప్సీ నటిస్తుంది. 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

800 కోట్లతో బాలీవుడ్ లో దుమ్మురేపిన తెలుగు సినిమా, అత్యధిక వసూళ్లు సాధించిన టాప్ 10 మూవీస్ ?
Avatar 3 Review: 'అవతార్ ఫైర్ అండ్ యాష్' ఫస్ట్ రివ్యూ.. జేమ్స్ కామెరూన్ ఇలా చేశారు ఏంటి, ఇది పెద్ద చీటింగ్