శ్రీ విష్ణు ‘భళా తందనాన’ ఓటీటీ రిలీజ్ కు ముహూర్తం.. ఎప్పుడు? ఎక్కడ?

Published : May 13, 2022, 02:15 PM ISTUpdated : May 13, 2022, 02:18 PM IST
శ్రీ విష్ణు ‘భళా తందనాన’ ఓటీటీ రిలీజ్ కు ముహూర్తం.. ఎప్పుడు? ఎక్కడ?

సారాంశం

టాలీవుడ్ హీరో శ్రీవిష్ణు (Sri Vishnu), హీరోయిన్ కేథరిన్ థ్రెస్సా జంటగా నటించిన చిత్రం ‘భళా తందనాన’. ఈ చిత్రం మే6న థియేటర్లలో రిలీజ్ అయ్యింది. తాజాగా ఓటీటీ రిలీజ్ డేట్  కూడా వచ్చేసింది. 

టాలీవుడ్ హీరో శ్రీవిష్ణు (Sri Vishnu) విభిన్న కథలతో ప్రేక్షకులను అలరిస్తున్నాడు. మినిమమ్‌ గ్యారంటీ సినిమాలు చేస్తూ కేరీర్ లో ముందుకు వెళ్తున్నాడు. జయాపజయాలతో సంబంధం లేకుండా విభిన్న కథా చిత్రాలతో అలరిస్తున్నారు. ఇటీవల `భళా తందనాన’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు శ్రీవిష్ణు. హీరోయిన్ కేథరిన్‌ థ్రెస్సా (catherine tresa) కథానాయికగా నటించగా, `బాణం` చిత్ర దర్శకుడు చైతన్య దంతులూరి దర్శకత్వంలో రూపొందిందీ చిత్రం. ఈనెల 6న థియేటర్లలో విడుదలైంది. ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందను పొందింది.

అయితే తాజాగా ఈ సినిమా ఓటీటీ రిలీజ్ కు ముహూర్తం ఫిక్స్ చేశారు. థియేట్రికల్ గా రిలీజ్ అయిన 14 రోజులు తర్వాత ఓటీటీలోకి రిలీజ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా మే 20 నుంచి ఓటీటీ ఫ్లాట్ ఫాం డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ షురూ కానున్నట్టు అధికారికంగా  ప్రకటించారు. వారాహి చలన చిత్రం బ్యానర్ పై తెరకెక్కిన ఈ చిత్రాన్ని మణిశర్మ సంగీతం అందించారు. హీరోహీరోయిన్లుగా శ్రీవిష్ణు, కేథరిన్ థ్రెసా నటించారు. పలు కీలక పాత్రలను గరుడ రామ్, పోసాని కృష్ణ మురళి, శ్రీనివాస రెడ్డి, సత్య, అయ్యప్ప పి. శర్మ, చైతన్య కృష్ణ, రవివర్మ, శ్రీకాంత్ అయ్యంగార్, ఆదర్శ్ బాలకృష్ణ, భూపాల్ రాజు పోషించారు. 

 

PREV
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9 title Winner: నాగార్జున డైలాగ్‌తో చెప్పి మరీ కప్‌ కొట్టిన కళ్యాణ్‌, ఎమోషనల్‌ కామెంట్‌.. తనూజకే క్రెడిట్‌
Bigg Boss Telugu 9: రమ్య మోక్ష చేత అందరి ముందు క్షమాపణలు చెప్పించిన కళ్యాణ్‌.. పరువు పోయిందిగా