‘మెగా 154’ విడుదలకు ముహుర్తం ఫిక్స్.. గ్రాండ్ రిలీజ్ కు ప్లాన్ చేస్తున్న మేకర్స్..

Published : Jun 24, 2022, 12:53 PM IST
‘మెగా 154’ విడుదలకు ముహుర్తం ఫిక్స్.. గ్రాండ్ రిలీజ్ కు ప్లాన్ చేస్తున్న మేకర్స్..

సారాంశం

మెగా స్టార్ చిరంజీవి వరుస చిత్రాల్లో నటిస్తూ మెగా అభిమానులను ఖుషీ చేస్తున్నారు. ఇప్పటికే ‘ఆచార్య’ రిలీజ్ కాగా.. మిగితా చిత్రాలను శరవేగంగా పూర్తి చేస్తున్నారు. తాజాగా బాబీ డైరెక్షన్ లో నటిస్తున్న ‘మెగా 154’ నుంచి క్రేజీ అనౌన్స్ మెంట్ వచ్చింది. 

చివరిగా మెగా స్టార్ చిరంజీవి (Chiranjeevi) ‘ఆచార్య’తో  ప్రేక్షకులను అలరించారు. ఈ మూవీపై భారీ అంచనాలు పెట్టుకున్న ఫ్యాన్స్ మిశ్రమ స్పందనతో కొంత అప్సెట్ అయ్యారు. గమనించిన చిరు తన తర్వాతి చిత్రాలతో అభిమానులు ఖుషీ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ మేరకు ‘గాడ్ ఫాదర్’, ‘భోళా శంకర్’, ‘మెగా 154’ చిత్రాలను శరవేగంగా పూర్తి చేస్తున్నారు. అయితే బాబీ దర్శకత్వంలో  తెరకెక్కుతున్న చిత్రం ‘మెగా 154’ నుంచి  మేకర్స్ తాజాగా అదిరిపోయే అనౌన్స్ మెంట్ చేశారు. 

ఇప్పటికే మెగా అభిమానులు ఖుషీ అయ్యే మాటను చిరంజీవి నోటనే చెప్పారు. బాబీ డైరెక్ట్ చేస్తున్న ‘మెగా 154’కి ‘వాల్తేరు వీరయ్య’గా ఖరారు చేసినట్టు ప్రకటించారు. కానీ అఫిషియల్ అనౌన్స్ మెంట్ మాత్రం చేయలేదు. త్వరలో అధికారికంగా ప్రకటించనున్నారు. తాజాగా మరో  క్రేజీ అనౌన్స్ మెంట్ అందించారు మేకర్స్.  వాల్తేరు వీరయ్య చిత్రాన్ని వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేయనున్నట్టు  తెలిపారు. బాబీ ట్వీట్ చేస్తూ.. ‘ఈసారి మెగా ఫెస్టివల్ జరగబోతోంది! ఈ సంక్రాంతి 2023కి మాస్ మూల విరాట్‌కు దారి పడింది. నా హీరో చిరు మాస్ యుఫోరియాను చూడాలనే నా ఆత్రుతను ఆపుకోలేకపోతున్నాను. నా సినిమా #మెగా154తో పెద్ద స్క్రీన్స్‌పైకి సంక్రాంతికి కలుస్తాం’ అని ప్రకటించాడు.  దీంతో అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు.  
 
ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నిర్మిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే మెగా 154 నుంచి ఫస్ట్ లుక్‌ని విడుదల చేయగా ఆడియెన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. పోస్టర్ చూస్తే సినిమా ఫుల్‌ మాస్‌ అండ్ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా ఉండబోతుందని అర్థమవుతోంది. బాబీ దర్శకత్వంలో వస్తున్న మెగా 154 చిత్రంలో చిరంజీవి సరసన హీరోయిన్ శృతి హాసన్ (Shruti Haasan) నటిస్తోంది.

అలాగే చిరు నటిస్తున్న `గాఢ్‌ ఫాదర్‌` చిత్రాన్ని మోహన్‌రాజా డైరెక్ట్ చేస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్ ను పూర్తి చేసుకున్నారు. ఈ మూవీలో నయనతార కథానాయికగా నటిస్తుంది. ఇప్పటికే ఆమె షూటింగ్‌లో జాయిన్‌ అయ్యింది. ప్రస్తుతం చిరు మెహర్‌ రమేష్‌తో `భోళాశంకర్‌` సినిమాలో నటిస్తున్నారు. ఇందులో ఆయనకు చెల్లిగా కీర్తిసురేష్‌, హీరోయిన్‌గా తమన్నా నటిస్తున్నట్టు సమాచారం.

 

PREV
click me!

Recommended Stories

Illu Illalu Pillalu Today Episode Dec 10: అమూల్యకు విశ్వ ఉత్తరం.. నర్మద, ప్రేమ చేతికి చేరిన లెటర్
Aishwarya Rai: రెండు కోలుకోలేని తప్పులు చేసిన ఐశ్వర్యా రాయ్‌.. సౌత్‌లో రెండు ఇండస్ట్రీ హిట్లు మిస్‌