10th ఎగ్జామ్స్ లో రికార్డ్ మార్స్ సాధించి హీరో సూర్య కూతురు, ఆ సబ్జెక్ట్ లో వందకు వంద మార్కులు

Published : Jun 24, 2022, 12:36 PM IST
10th ఎగ్జామ్స్ లో రికార్డ్ మార్స్ సాధించి హీరో సూర్య కూతురు, ఆ సబ్జెక్ట్ లో వందకు వంద మార్కులు

సారాంశం

తమిళ స్టార్ హీరో సూర్య, జ్యోతిక దంపతులు .. పుత్రికోత్సాహంలో మునిగితేలుతున్నారు. ఆనందం తట్టుకోలేకపోతున్నారు. తమ కూతురు చేసిన పనికి.. అంతట బెస్ట్ పేరెంట్స్ అని అనిపించుకుంటూ.. పండగ చేసుకుంటున్నారు. ఇంతకీ సూర్య పుత్రికోత్సాహానికి కారణం ఏంటీ..? 

తమిళ స్టార్‌ హీరో సూర్య గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వైవిధ్యమైన పాత్రలు, కథలను ఎంచుకుంటూ అగ్ర నటుడిగా గుర్తింపు పొందాడు. కోలీవుడ్‌ స్టార్‌ హీరో అయిన సూర్యకు తెలుగులోనూ మంచి ఫ్యాన్స్‌ ఫాలోయింగ్‌ ఉంది. ఇదిలా ఉంటే సూర్య హీరోగా ఎంత బిజీ ఉన్న కుటుంబానికి మాత్రం ప్రత్యేకంగా సమయాన్ని కెటాయిస్తాడు. తన ఇద్దరు పిల్లలు దియా, దేవ్‌లతో కలిసి విరామ సమయాన్ని ఎంజాయ్‌ చేస్తాడు.

ఇప్పుడు సూర్య పుత్రికోత్సాహంతో సందడి చేస్తున్నాడు.  కూతురు దియా సాధించిన ఘనత గురించి ఇటూ తమిళ రాష్ట్రంతో పాటు తెలుగు రాష్ట్రాలు చర్చించుకుంటున్నాయి. అయితే దియా చదువులో ఫస్ట్‌ అని, క్లాస్‌ ఫస్ట్‌ వస్తుందని సూర్య పలు ఇంటర్య్వూలో చెబుతూ ఉంటాడు. తాజాగా ఆమె పదోవ తరగతి పూర్తి చేసింది. ఇటీవల తమిళనాడు పదో తరగతి పరీక్ష ఫిలితాలు వెల్లడైన సంగతి తెలిసిందే. ఈ ఫలితాల్లో దియా అత్యథిక మార్కులు సాధించి ప్రతిభను కనబరించింది. అన్ని సబ్జెక్టుల్లోనూ తొంభైకి పైగా మార్కులతో మెరిట్‌ జాబితాలో నిలిచింది.

ముఖ్యంగా ఎంతో కష్టమైన సబ్జెక్ట్‌ గణితంలో ఆమె వందకు వందశాతం మార్కులు సాధించి అందరిని ఆశ్చర్యపరుస్తోంది. ఇక కూతురు సాధించిన ఘనతను చూసి సూర్య-జ్యోతికలు మురిసిపోతున్నారు. కాగా ప్రస్తుతం దియా మార్కుల జాబితా సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. అన్ని సబ్జెక్ట్స్‌లో దియా సాధించిన మార్కులు ఇలా ఉన్నాయి. తమిళం, సోషల్‌ సైన్స్‌లో 95 మార్కులు, సైన్స్‌లో98, ఇంగ్లిష్‌లో99, మ్యాథ్స్‌లో100 మార్కులు తెచ్చుకుంది దియా. 

PREV
click me!

Recommended Stories

Bigg Boss telugu 9 బోరుమని ఏడ్చిన రీతూ, బయటకు వెళ్తూ బాంబ్ పేల్చిన కంటెస్టెంట్
ఆలియా భట్ అదిరిపోయే హెయిర్ స్టైల్స్ , ఈ 5 లుక్స్ ట్రై చేశారా ?