
ఏడాది క్రితం వచ్చిన వీరసింహారెడ్డి సినిమా సూపర్ హిట్ అయ్యింది. ఈసినిమాలో నటించి మెప్పించింది హనీ రోజ్. ఈ ఒక్క సినిమాతో టాలీవుడ్ కుర్ర కారును తన అందంతో తన చుట్టూ తిప్పుకుంది బ్యూటీ. వీరసింహారెడ్డి సినిమా తరువాత హనీరోజ్ ఫ్యాన్స్ తో పాటు..సోపల్ మీడియా ఫాలోయింగ్ కూడా అమాంతం పెరిగిపోయింది.ఈ అమ్మడుకు ఇన్ స్టా గ్రామ్ లో ఏకంగా 4 మిలియన్ కు పైగా ఫాలోవర్స్ ఉన్నారు. ఆమె చుట్టు అభిమానుల హంగామా కూడా పెరిగింది. అయితే టాలీవుడ్ నుంచి ఆమెకు చాలా అవకాశాలు వస్తాయి అనుకున్నారు కాని.. సినిమా అవకాశాలు మాత్రం రాలేదు హనీకి .. కాని వ్యాపార సంస్థల ఓపెనింగ్ లు మాత్రం బాగా వర్కౌట్ అయ్యాయి హనీరోజ్ కు.
ఇక తాజాగా హనీరోజ్ కు లక్కీ ఛాన్స్ వరించినట్టు తెలుస్తోంది. అయితే హనీ మరో టాలీవుడ్ సినిమాలో నటించబోతుందని టాక్ వినిపిస్తోంది. అంతేకాదు మరోసారి కూడా సీనియర్ హీరోతోనే జతకట్టనుందని తెలుస్తోంది. అంటే గతంలో బాలయ్యతో నటించిన ఈ బ్యూటీ ప్రస్తుతం చిరంజీవితో నటించే అవకాశం సాధించిదట. ప్రస్తుతం మెగాస్టార్ నటిస్తున్న సినిమా విశ్వంభర. ఈసినిమాను బింబిసార ఫేమ్ వశిష్ట డైరెక్ట్ చేస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ కూడా స్టార్ట్ అయ్యింది. మెగాస్టార్ తో విజ్యువల్ వండర్ చేయబోతున్నాడు యంగ్ డైరెక్టర్. తాజాగా వచ్చిన ప్రీ లుక్ పోస్టర్స్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి.
ఇక ఈసినిమాలో హనీరోజ్ స్పెషల్ రోల్ చేస్తుందా..? లేక స్పెషల్ సాంగ్ చేస్తుందా తెలియదు కాని.. హనీమాత్రం ఈసినిమాలో చేయడం ఖాయం అంటున్నారు. కాని ఈ విషయంలో అఫీషియల్ అనౌన్స్ మెంట్ రావల్సి ఉంది. మరి మెగాస్టార్ తో ఎలాంటి పాత్రలో హనీ కనిపిస్తుందో చూడాలి. ఈసినిమాతో అన్నా టాలీవుడ్ లో వరుస సినిమాలు సాధిస్తుందా లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది.