బాహుబలి, ఆర్ఆర్ఆర్ రికార్డ్ లకు చేరువలో యానిమల్ మూవీ..

By Mahesh JujjuriFirst Published Jan 30, 2024, 6:39 AM IST
Highlights

రేర్ రికార్డ్ కు చేరువలో ఉంది యానిమల్ సినిమా. అది సాదాసీదా రికార్డ్ కాదు.. బాహుబలి, ఆర్ఆర్ఆర్ లకు సమానమైన రికార్డ్ ను అందుకోవడానివకి రెడీ అయ్యింది. 

రిలీజ్ అయ్యే అవ్వడంతో బ్లాస్ట్ అయ్యింది యానిమల్ సినిమా.. బాక్సాఫీస్ ను షేక్ చేసేసింది. యానిమల్ మూవీ  రిలీజైన ఫస్ట్ డే నుంచే  బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లతో దూసుకు పోతుంది. తెలుగులో ఒక్క సినిమాతో సంచలనం సృష్టించిన  దర్శకుడు  సందీప్ రెడ్డి వంగా  డైరెక్ట్ చేసిన ఈసినిమా థియేటర్లను దడదడలాడించి.. ప్రస్తుతం ఓటీటీలో కూడా దూసుకుపోతోంది.  ఈ యాక్షన్ డ్రామా ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ లో ఉంది. ఈసినిమా చాలా మందికి బాగా ఎక్కేసింది.. కిక్క్ ఇచ్చింది. 

కాని అదే టైమ్ లో ఈమూవీపై విమర్శలు కూడా అదే రేంజ్ లో వచ్చాయి. కాని ఇష్టం లేదంటూనే సినిమాను విపరీతంగా చూస్తున్నారు జనాలు. కొన్ని రివ్యూస్ అయితే ధారుణంగా ఇచ్చేస్తున్నారు. ఇక ఓటీటీలో కూడా భారీ వ్యూస్ తో కొనసాగుతున్న యానిమల్ సినిమా  బయట థియేటర్లలో కూడా ఇంకా నడుస్తూనే ఉంది. ఇక అసలు విషయం ఏంటంటే.. యానిమల్ సినిమా బాక్సాఫీస్ దగ్గర  సెన్సేషన్ రికార్డ్ కి చేరువలో ఉంది. అది కూడా ఇక్కడ కాదు యూఎస్ లో. అవును ఇండియాలో దూసుకుపోతున్న ఈసినిమా.. యూఎస్ మార్కెట్ లో అంతకు మించి దూసుకుపోతోంది.  

Latest Videos

ఇప్పటి వరకు బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ హీరోగా నటించిన  పఠాన్ మరియు జవాన్  సినిమాలుమాత్రమే మాత్రమే USA బాక్సాఫీస్ వద్ద 15 మిలియన్ డాలర్లకు పైగా వసూలు చేసిన హిందీ సినిమాలుగా రికార్డు కెక్కాయి. ఇక తాజాగా ఈ అద్భుతమైన ఫీట్‌ని సాధించడానికి యానిమల్ కేవలం కొన్ని డాలర్ల దూరంలో ఉంది. అయితే  ఈ ఫీట్ ను సాధించిన ఇండియాన్ సినిమాల లిస్ట్ లో.. ముందు బాహుబలి ఉండగా..ఆతరువాత ఆర్ఆర్ఆర్ ఉంది. ఆతరువాతే  పఠాన్ మరియు జవాన్  సినిమాలు ఉన్నాయి. ఇక ఇప్పుడు తాజాగా యానిమల్ యాడ్ అవ్వబోతున్నట్టు తెలుస్తోంది. 

ఇక  ఈ సంఖ్యను చేరుకోబోతున్న 5వ సినిమాగా యానిమల్ చేరింది. అయితే ఫారెన్ లో.. ముఖ్యంగా  పంజాబీ జనాభా ఎక్కువగా ఉండే కెనడా నుండి యానిమల్ సినిమా ఎక్కువగా ఆదరణ పొందినట్టు తెలుస్తోంది. రష్మిక మందన్న హీరోయిన్ గా నటించిన ఈమూవీలో రణబీర్ తండ్రి పాత్రలో అనిల్ కపూర్ నటించగా..  బాబీ డియోల్, త్రిప్తి దిమ్రీ, చారు శంకర్, బబ్లూ పృథ్వీరాజ్, శక్తి కపూర్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. టి-సిరీస్ మరియు భద్రకాళి పిక్చర్స్ సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాకు  హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీతం అందించారు.

click me!