జర్మనీలో మహేష్ బాబు, విరహవేదనలో నమ్రత, ఏమని పోస్ట్ పెట్టిందంటే...?

By Mahesh Jujjuri  |  First Published Jan 30, 2024, 7:23 AM IST

మహేష్ బాబు తన ఫ్యామిలీని వదిలి  ఇన్నిరోజులు ఎప్పుడు ఉండలేదు. ఎటు వెళ్ళినా వెంట తీసుకెళ్ళేవాడు.. కానిప్రస్తుతంసోలో ట్రిప్ లో ఉన్నాడు సూపర్ స్టార్. 



సింగిల్ గా జర్మనీ వెళ్ళిన సూపర్ స్టార్ మహేష్ బాబు అక్కడేం చేస్తున్నాడో తెలియదు.. దేని కోసం వెళ్ళాడో క్లారిటీ లేదు. రాజమౌళి సినిమా కోసమే ఆయన జర్మనీ వెళ్ళాడంటున్నారు సోషల్ మీడియా జనాలు. కాని షూటింగ్ అయినా.. పర్సనల్ ట్రిప్ అయినా.. ఎప్పుడూ ఫ్యామిలీని వదిలి దూరంగా ఉండడు మహేష్. అటువంటిది ఒక్కడే జర్మనీ వెల్ళడం.. అంతే కాకుండా   ఈసారి నమ్రత బర్త్ డే  కూడా మహేష్.. మిస్ అయ్యాడు. అక్కడ నుంచే విష్ చేశాడు. దాంతో మహేష్ బాబుకు అంత ఇంపార్టెంట్ పని ఏంటబ్బ అని అంతా ఆలోచనలో పడ్డారు. 

ఇక సూపర్ స్టార్ మహేష్ బాబు జర్మనీ వెళ్ళి దాదాపు 10 రోజులు అవుతోంది. ఒంటరిగా జెర్మనీకి వెళ్లిన మహేష్.. అక్కడ ఒక డాక్టర్‌ని కవడం.. ఏదో స్పెషల్ ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడు అని టాక్. అయితే   ఆ డాక్టర్ బాడీ ఫిట్‌నెస్ పై సూచనలు ఇస్తూ ఉంటారని.. ఆయన ఇన్‌స్టాగ్రామ్ చూస్తుంటే అర్ధమవుతుంది. గత రెండేళ్లుగా మహేష్ ఆయన దగ్గర ట్రైన్ అవుతూ వస్తున్నారు. ఇక తాజాగా ఆయన వెళ్ళింది. రాజమౌళి సినిమా కోసం ఫిట్ నెస్ తో పాటు... తనను తాను మార్చుకోవడం కోసం అంటున్నారు. 

Latest Videos

 

పాన్ వరల్డ్ సినిమాను ప్లాన్ చేశాడు రాజమౌళి. మహేష్ ను సూపర్ స్టార్ నుంచి సూపర్ హీరోగా మార్చబోతున్నాట. దాంతో దానికి తగ్గట్టు తనను తాను మార్చుకోవడం కోసం..బాడీ ఫిట్ నెస్.. ఫిజికల్, మెంటల్ స్ట్రెంత్ కోసం మహేష్ గట్టిగా కష్టపడుతున్నాట. ఇక ఇక్కడ ఇంటిబాధ్యతలు, పిల్లల బాద్యతలు నమ్రత చూసుకుంటోంది. అయితే మహేష్ ను వదిలి ఇన్ని రోజులు ఎప్పుడూ ఉండలేదు ఫ్యామిలీ..ముఖ్యంగా నమ్రత  మహేష్ ను అనుక్షణం కనిపెట్టుకుని ఉంటుంది.అటువంటిది పదిరోజుల  నుంచి మహేష్ కనిపించకపోవడంతో.. విరహవేదనలో ఉంది నమ్ర, 

 

మహేష్ బాబు పై స్పెషల్ పోస్ట్ కూడా పెట్టింది. ఈనేపథ్యంలోనే తాజాగా మహేష్ బాబు జర్మనీకి సబంధించిన  కొన్ని కొత్త ఫోటోలను షేర్ చేశారు. జర్మనీలోని బ్లాక్ ఫారెస్ట్ లో మహేష్ బాబు, డాక్టర్‌తో కలిసి ట్రెక్కింగ్ వెళ్లారు.ఇక ఇన్‌స్టాగ్రామ్ లో మహేష్ బాబు పోస్ట్ చేసిన ఈ ఫోటోలను చూసిన నమ్రత.. ‘మిస్ యూ’ అంటూ లవ్ ఎమోజిస్ తో ఎమోషనల్ గా కామెంట్ చేశారు. నమ్రత చేసిన ఈ కామెంట్ ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. ఇక సూపర్ స్టార్ జర్మనీ పర్యటన ముగించుకుని ఎప్పుడు వస్తాడో చూడాలి. 

click me!