ఎన్టీఆర్ బయోపిక్ దెబ్బ.. మోక్షజ్ఞ లాంచింగ్ పై పడిందా?

By Udaya DFirst Published 16, Feb 2019, 4:20 PM IST
Highlights

నందమూరి నటవారసుడు మోక్షజ్ఞ తెరంగేట్రం కోసం అభిమానులు చాలా రోజులుగా ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. కొద్ది కాలం క్రితం తన తండ్రి  బాలకృష్ణ వందో సినిమా గౌతమి పుత్ర శాతకర్ణిలోనే మోక్షజ్ఞ ఎంట్రీ ఇస్తారని భావించారు. 

నందమూరి నటవారసుడు మోక్షజ్ఞ తెరంగేట్రం కోసం అభిమానులు చాలా రోజులుగా ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. కొద్ది కాలం క్రితం తన తండ్రి  బాలకృష్ణ వందో సినిమా గౌతమి పుత్ర శాతకర్ణిలోనే మోక్షజ్ఞ ఎంట్రీ ఇస్తారని భావించారు. అయితే అది జరగలేదు.  గౌతమిపుత్ర శాతకర్ణి సినిమా సమయంలో నందమూరి వారసుడ్ని పరిచయం చేసే అవకాశాన్ని మిస్‌ అయిన దర్శకుడు క్రిష్‌, ఎన్టీఆర్‌ బయోపిక్‌తో మోక్షజ్ఞను పరిచయం చేయాలని భావిస్తున్నారనుకున్నారు.

ఈ సినిమాలో ఎన్టీఆర్‌ చిన్నతనానికి సంబంధించిన సన్నివేశాల్లో మోక్షజ్ఞ, ఎన్టీఆర్‌గా కనిపించే అవకాశం ఉందని వార్తలు వచ్చాయి. అదీ వాస్తవ రూపం ధరించలేదు.   బాలయ్య మాత్రం వారసుడ్ని పరిచయం చేసేందుకు మరింత సమయం తీసుకోవాలనే ఫిక్స్ అయ్యారని అర్దమైంది. అయితే అతి త‍్వరలోనే మోక్షజ్ఞ ఎంట్రీ ఉంటుందని ఇప్పటికే చాలా సార్లు  బాలకృష్ణ స్వయంగా ప్రకటించారు. దాంతో అభిమానులు ఈ  సంవత్సరమైనా బాలయ్య మాట నిజం అవుతుందని ఎదురుచూపులు చూస్తున్నారు.

అందులోనూ ఆయన సొంత బ్యానర్ పెట్టడంతో ...మోక్షజ్ఞ  ని ఆ బ్యానర్ లోనే పరిచయం చేస్తారని ఊహించారు. కానీ అంచనాలు తలక్రిందులు చేస్తూ  ఎన్టీఆర్ కథనాయకుడు చిత్రం డిజాస్టర్ కావటం బాలయ్యకు షాక్ ఇచ్చింది. దాంతో ఆ ప్రపోజల్ ని మళ్లీ వాయిదా వేసుకున్నారట.

ప్రస్తుతం అమెరికాలో ఉంటున్న మోక్షజ్ఞ అక్కడే 24 క్రాఫ్ట్ లలో ట్రైనింగ్ తీసుకుంటున్నారని సమాచారం. బోయపాటి,క్రిష్ లు కథలతో మోక్షజ్ఞ ఎంట్రీ కోసం కలిసినా సున్నితంగా బాలయ్య తర్వాత చూద్దాం అన్నారని వినికిడి. వచ్చే సంవత్సరం మోక్షజ్ఞ ని ఘనంగా లాంచ్ చేద్దామని బాలయ్య భావించి ఆ మేరకు ఆగస్టు నుంచి పనులు ప్రారంభిస్తారట. 

Last Updated 16, Feb 2019, 5:06 PM IST