రూ.1000 కోట్ల భారీ బడ్జెట్.. నిర్మాత షాకింగ్ డెసిషన్!

Published : Apr 04, 2019, 02:10 PM IST
రూ.1000  కోట్ల భారీ బడ్జెట్.. నిర్మాత షాకింగ్ డెసిషన్!

సారాంశం

అమెరికాకు చెందిన వ్యాపారవేత్త బీఆర్ శెట్టి మూడేళ్ల క్రితం ఓ సంచలన ప్రకటన చేశాడు. 

అమెరికాకు చెందిన వ్యాపారవేత్త బీఆర్ శెట్టి మూడేళ్ల క్రితం ఓ సంచలన ప్రకటన చేశాడు. ఇప్పటివరకు ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఎవరూ నిర్మించని విధంగా రూ.1000 కోట్ల బడ్జెట్ తో మహాభారతంపై భారీ చిత్రాన్ని నిర్మించనున్నట్లు ప్రకటించారు.

వాసుదేవన్ నాయర్ నవల 'రందమూజం' ఆధారంగా సినిమాను తెరకెక్కించాలని భావించారు. మోహన్ లాల్ ప్రధాన పాత్రలో సినిమా తీయాలని అనుకున్నారు. అయితే ఇప్పటివరకు ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లలేదు. తాజాగా సినిమాకు సంబంధించిన సంచలన ప్రకటన చేశాడు నిర్మాత బీఆర్ శెట్టి.

సినిమా తీయాలనే ఆలోచనను విరమించుకున్నట్లు ప్రకటించారు. రచయిత వాసుదేవన్ కి, డైరెక్టర్ శ్రీకుమార్ మీనన్ కి మధ్య సినిమాకు సంబంధించి ఏకాభిప్రాయం కుదరలేదని వారి మధ్య ఏర్పడ్డ వివాదాల కారణంగా తాను గొప్ప సినిమా తీయాలనే ఆలోచనను విరమించుకున్నట్లు వెల్లడించారు. 

రెండు భాగాలుగా ఈ సినిమాను తెరకెక్కించాలని భావించారు. కానీ ఇప్పుడు అది సాధ్యం కావడం లేదు. సరైన దర్శకుడు, రైటర్ దొరికితే తన కల నిజమవుతుందని అన్నారు. 

PREV
click me!

Recommended Stories

తనూజతో రొమాంటిక్ మూమెంట్స్, సంతోషంతో పొంగిపోయిన కళ్యాణ్.. సంజనకి ఓజీ రేంజ్ ఎలివేషన్
ఆ స్టార్ హీరో వల్ల కెరీర్ నాశనం చేసుకున్న భూమిక, నగ్మా, స్నేహ ఉల్లాల్.. లిస్టులో మొత్తం ఏడుగురు బాధితులు