మోహన్ లాల్ ‘లూసిఫర్’ మినీ రివ్యూ

By Udaya DFirst Published Apr 13, 2019, 6:35 PM IST
Highlights

‘జనతా గ్యారేజ్, మనమంతా, మన్యం పులి’ చిత్రాలతో తెలుగులో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు  మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్. 

‘జనతా గ్యారేజ్, మనమంతా, మన్యం పులి’ చిత్రాలతో తెలుగులో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు  మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్. ఆయన  హీరోగా నటించిన తాజా పొలిటికల్ థ్రిల్లర్ ‘లూసిఫర్’. ఇప్పటికే మలయాళంలో విడుదలై ఘన విజయం సాధించిన ఈ సినిమాని ప్రముఖ నిర్మాణ సంస్థ సురేష్ ప్రొడక్షన్స్ వారు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏప్రిల్ 12న విడుదల చేసారు. అయితే సినిమా అనుకున్నంతగా ప్రేక్షకులను అకట్టుకోలేకపోయింది. 

చిత్రం కథేమిటంటే...  రాష్ట్ర ముఖ్యమంత్రి పి.కె.అర్ (సచిన్ ఖేడేకర్) హఠాత్తు మరణం తరువాత ఆయన వారసుడు ఎవరనే చర్చ మొదలు అవుతుంది. రాష్ట్రం అంతా  కాబోయే ముఖ్యమంత్రి ఎవరు ? అని చర్చించుకుంటున్న  నేపధ్యంలో ఈ సినిమా మొదలవుతుంది. అప్పుడు పి.కె.అర్ కి అత్యంత సన్నిహితుడు స్టీఫెన్ గట్టు పల్లి (మోహన్ లాల్)సీన్ లోకి వస్తారు.  పి.కె.అర్ కి తను ఇచ్చిన మాట ప్రకారం ఆయన  కుమార్తె ప్రియ (మంజు వారియర్)అండగా నిలబడి ఆమెను సమస్యల నుండి బయట పడేస్తాడు.

ఈ క్రమంలో ప్రియ రెండో భర్త బాబీ (వివేక్ ఒబెరాయ్) వల్ల స్టీఫెన్ కు రకరకాల సమస్యలు వస్తాయి.  అంతే కాదు కొంతమంది స్వార్ధపూరిత ఆలోచనల కారణంగా స్టీఫెన్ పై కొన్ని నిందలు పడతాయి.  ఈ క్రమంలో జరిగే కొన్ని నాటకీయ పరిణామాల మధ్యన  ప్రియ (మంజు వారియర్)ను సేవ్ చేయటం ప్రధానాంశంగా కథ నడుస్తుంది. అందుకోసం స్టీఫెన్ ఎలాంటి పరిస్ధితులను ఎదురుకున్నాడు? లాంటి విషయాలు చుట్టూ సినిమా తిరుగుతుంది. 

ఇక స్టీఫెన్ గట్టుపల్లి అనే పాత్రలో మోహన్ లాల్ ఎప్పటిలాగే తన నటనతో ఈ సినిమాలో ఉత్తమమైన నటనను కనబర్చి సినిమాని నిలబెట్టే ప్రయత్నం చేసారు.  అయితే సినిమా కంటెంట్ లో ఇంట్రస్టింగ్ ఎలిమెంట్స్ లేకపోవటంతో ... పూర్తి ఆసక్తికరంగా సాగదు.  దర్శకుడు పొలిటికల్ డ్రామాతో సినిమాను ఆకట్టుకునే విధంగా మలచలేకపోయారు. అయితే కొన్ని ఎమోషనల్‌ సీన్స్ తో దర్శకుడు ఆకట్టకునే ప్రయత్నం చేసినప్పటికీ.. సినిమా స్లోగా సాగుతూ చాలా చోట్ల బోర్ కొట్టడం మైనస్ గా నిలిచింది. 

మంజు వారియర్, వివేక్ ఒబెరాయ్, టివినో థామస్, సానియా ఐయప్పన్, సాయి కుమార్, నీల ఉషా, కళాభవన్ షాజోన్ నటించిన ఈ సినిమాకి మలయాళ అగ్రనటుడు, కథానాయకుడు పృధ్వీరాజ్ సుకుమారన్ దర్శకత్వం వహించారు. దీపక్ దేవ్ సంగీతం సమకూర్చగా సుజిత్ వాసు దేవ్ సినిమాటోగ్రఫీ అందించారు. ఆశీర్వాద్ సినిమాస్ బ్యానర్‌పై ఆంటోనీ పెరుంబవూర్ ఈ చిత్రాన్ని నిర్మించారు.  

click me!