'నాలుగో సింహం'గా వస్తున్నషకలక శంకర్

Published : Apr 13, 2019, 05:09 PM IST
'నాలుగో సింహం'గా వస్తున్నషకలక శంకర్

సారాంశం

ఆర్.ఏ.ఆర్ట్స్ ప్రొడక్షన్స్ పతాకంపై స్వీయ దర్శకత్వంలో జానీ నిర్మిస్తున్న చిత్రం 'నాలుగో సింహం'.

ఆర్.ఏ.ఆర్ట్స్ ప్రొడక్షన్స్ పతాకంపై స్వీయ దర్శకత్వంలో జానీ నిర్మిస్తున్న చిత్రం 'నాలుగో సింహం'. సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ గా షకలక శంకర్ టైటిల్ రోల్ పోషిస్తున్న ఈ చిత్రం షూటింగ్ దాదాపుగా పూర్తి కావచ్చింది.

షకలక శంకర్ సరసన ముంబై ముద్దుగుమ్మ అక్షయ్ శెట్టి నటిస్తోంది. మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలు, అమానుషాలు.. వాటిని చూసీ చూడనట్లుగా ఉండే అవినీతి అధికారుల నిర్వాకాలపై నిప్పులు చెరుగుతూ అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా రూపొందుతున్న ఈ చిత్రంలో 'ముద్దమందారం' పూర్ణిమ, ఆర్.కె, సత్య ప్రకాష్, గుర్లిన్ చోప్రా, గబ్బర్ సింగ్ బ్యాచ్ ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.

ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: శ్రవణ్ కుమార్, సంగీతం: అజయ్ పట్నాయక్, ఫైట్స్: దేవరాజ్, ఎడిటింగ్: శ్రీ, కథ-స్క్రీన్ ప్లే-నిర్మాణం-దర్శకత్వం: జానీ!!

PREV
click me!

Recommended Stories

భార్యతో పదేళ్ల ప్రేమను సెలబ్రేట్ చేసుకున్న రిషబ్ శెట్టి..బ్యూటిఫుల్ ఫోటోస్ వైరల్
Medha Rana: బోర్డర్ 2తో ప్రేక్షకుల మనసు గెలిచిన నటి ? ఆమె కుటుంబ సభ్యులంతా..