L2E: ఎంపురాన్ ట్రైలర్: మోహన్‌లాల్ మాస్ అవతార్!

మోహన్‌లాల్ నటించిన 'L2E: ఎంపురాన్' ట్రైలర్ విడుదలైంది. ఇది 2019లో బ్లాక్ బస్టర్ అయిన ‘లూసిఫర్’ సినిమాకు సీక్వెల్. రాజకీయ వ్యూహాలు, హీరోయిజంతో ఈ సినిమా మార్చి 27న విడుదల కానుంది.

Mohanlal  L2E Empuraan trailer released  in telugu jsp


 ప‌వ‌ర్‌ఫుల్ డైలాగ్స్‌తో ‘L2E: ఎంపురాన్’ ట్రైల‌ర్ వ‌చ్చేసింది. 2019లో విడుద‌లై బ్లాక్ బ‌స్ట‌ర్ అయిన ‘లూసిఫ‌ర్‌’ సినిమాకు ఇది సీక్వెల్‌. మూడు భాగాలుగా రాబోతున్న ఈ చిత్రంలో ఇది రెండో భాగం. తొలి భాగాన్ని మించిన ట్విస్టులు, ట‌ర్నులు, రాజకీయ వ్యూహాలు, ప‌న్నాగాలు, వాటిని తిప్పి కొట్టే ప్ర‌తి వ్యూహాలు, ధీటైన హీరోయిజం.. వావ్ అనిపించే స‌న్నివేశాలు, నిర్మాణాత్మ‌క విలువ‌లతో ‘L2E: ఎంపురాన్’ ప్ర‌పంచ వ్యాప్తంగా ఉన్న‌ ప్రేక్ష‌కుల‌కు ఓ అద్భుత‌మైన సినిమాటిక్ ఎక్స్‌పీరియెన్స్‌ను మార్చి 27న అందించ‌నుంద‌ని ట్రైల‌ర్‌తో మేక‌ర్స్ క్లియ‌ర్ క‌ట్‌గా చెప్పేశారు. 

తొలి భాగాన్ని మించే పాత్ర‌ల‌ను ఇందులో ప‌రిచ‌యం చేయ‌బోతున్నారు.  హీరో కాపాడుతున్న రాజ్యాన్ని క‌బ‌లించ‌టానికి బ‌ల‌వంతులైన శ‌త్రువులంద‌రూ ఏక‌మై యుద్ధం చేయ‌టానికి సిద్ధ‌మైతే ఏం జ‌రుగుతుంది.. హీరో దాన్నెలా తిప్పి కొట్టి త‌న రాజ్యాన్ని, ప్ర‌జ‌ల‌ను కాపాడుకున్నాడ‌నేదే క‌థాంశం అని ట్రైల‌ర్‌లో తెలుస్తుంది. 

Latest Videos

మలయాళ సూపర్‌స్టార్‌, కంప్లీట్ యాక్ట‌ర్ మోహన్‌లాల్, పృథ్వీరాజ్ సుకుమార్ కాంబోలో తెర‌కెక్కిన భారీ చిత్రం ‘L2E: ఎంపురాన్’.  సినిమా రిలీజ్ కౌంట్ డౌన్ స్టార్ట్ అయినప్పటినుంచి అభిమానులు, ప్రేక్ష‌కులు సినిమాను చూడటానికి ఎంతో ఎగ్జ‌యిట్‌మెంట్‌తో ఎదురు చూస్తున్నారు. ఈ ఎక్స్‌పెక్టేష‌న్స్‌ను L2E: ఎంపురాన్ ట్రైల‌ర్ నెక్ట్స్ లెవ‌ల్‌కు తీసుకెళుతుంది.   

మోహన్ లాల్ ఖురేషి-అబ్రామ్ అలియా స్టీఫెన్ నెడుంపల్లిగా మ‌రోసారి మాస్ అవ‌తార్‌లో మెప్పించ‌బోతున్నారు. ఈ క్రేజీ ప్రాజెక్ట్‌లో పృథ్వీరాజ్ సుకుమారన్, టోవినో థామస్, గేమ్ ఆఫ్ థ్రోన్స్ ఫేమ్ జెరోమ్ ఫ్లిన్, అభిమన్యు సింగ్, ఆండ్రియా తివాదర్, సూరజ్ వెంజరమూడు, ఇంద్రజిత్ సుకుమారన్, మంజు వారియర్, సానియా అయ్యప్పన్, సాయికుమార్, బైజు సంతోష్, ఫాజిల్, సచిన్ ఖేదేకర్, నైలా ఉష, గిజు జాన్, నందు, శివాజీ గురువాయూర్, ఎస్ మణికుట్టన్, మణికుట్టన్, మణికుట్టన్ ఉన్నారు. ఓ'నెల్, ఎరిక్ ఎబౌనీ, మిఖాయిల్ నోవికోవ్, కార్తికేయ దేవ్ త‌దిత‌రులు ఇత‌ర‌ ముఖ్య పాత్రలను పోషించారు. గేమ్ ఆఫ్  థ్రోన్స్ ఫేమ్ జెరోమ్ ఫ్లిన్ ఈ మూవీతో ఇండియ‌న్ సినీ ఇండ‌స్ట్రీలోకి అడుగుపెడుతున్నారు. 
 
‘L2E: ఎంపురాన్‌’ చిత్రాన్ని మ‌ల‌యాళంతో పాటు తెలుగు, హిందీ, క‌న్న‌డ‌, త‌మిళ భాష‌ల్లో మార్చి 27న రిలీజ్ చేస్తున్నారు.  ఐమ్యాక్స్ ఫార్మేట్‌లో ట్రైల‌ర్ విడుద‌ల చేయ‌ట‌మే కాదు, మీడియాకు కూడా ఇదే త‌ర‌హాలో ప్ర‌త్యేక‌మైన షోను ప్ర‌ద‌ర్శించ‌నుండ‌టం విశేషం.

vuukle one pixel image
click me!