ఫిబ్ర‌వ‌రి 3న ల‌వ్ లీ క్రైమ్ థ్రిల్ల‌ర్ క‌నుపాప  విడుద‌ల‌

Published : Jan 30, 2017, 11:11 AM ISTUpdated : Mar 25, 2018, 11:53 PM IST
ఫిబ్ర‌వ‌రి 3న ల‌వ్ లీ క్రైమ్ థ్రిల్ల‌ర్ క‌నుపాప  విడుద‌ల‌

సారాంశం

కనుపాప టైటిల్ తో తెలుగులో రిలీజ్ కానున్న మళయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ ఒప్పం ఫిబ్రవరి 3న రిలీజ్ కానున్న లవ్ లీ క్రైమ్ థ్రిల్లర్ కనుపాప జనతా గ్యారేజ్, మ‌న్యం పులి త‌ర్వాత తెలుగులో వ‌స్తున్న మరో మోహ‌న్ లాల్ చిత్ర‌ం

మ‌ల‌యాళ అగ్ర‌హీరో మోహ‌న్ లాల్ - ప్రియ‌ద‌ర్శ‌న్ కాంబినేష‌న్లో రూపొందిన క్రైమ్ థ్రిల్ల‌ర్ ఒప్ప‌మ్. ఈ చిత్రం మ‌ల‌యాళంలో అన్నివ‌ర్గాల ప్రేక్ష‌కులను ఆక‌ట్టుకుని సెన్సేష‌న్ క్రియేట్ చేసింది. ఈ చిత్రాన్ని క‌నుపాప టైటిల్ తో ఓవ‌ర్ సీస్ నెట్ వ‌ర్క్ ఎంట‌ర్ టైన్మెంట్ తెలుగులో రిలీజ్ చేస్తుంది. దిలీప్ కుమార్ బొలుగోటి స‌మ‌ర్ప‌ణ‌లో మోహ‌న్ లాల్ ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్ష‌కుల‌కు అందిస్తున్నారు. ఈ క్రైమ్ థ్రిల్ల‌ర్ క‌నుపాప చిత్రం ఫిబ్ర‌వ‌రి 3న తెలుగు ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తుంది. 

 

ఈ సంద‌ర్భంగా  ప్ర‌సాద్ ల్యాబ్స్ లో ఏర్పాటు చేసిన మీడియా మీట్ లో ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్ శ్రీనివాస‌మూర్తి మాట్లాడుతూ...మ‌న్యం పులి త‌ర్వాత తెలుగులో వ‌స్తున్న మోహ‌న్ లాల్ చిత్ర‌మిది. ప‌సివాడి ప్రాణం త‌ర‌హాలో ఉండే విభిన్న క‌థా చిత్ర‌మిది. ఈ చిత్రంలో మోహ‌న్ లాల్ గుడ్డివాడుగా న‌టించారు. హ్యుమ‌న్ వాల్యూస్ ఉన్న క‌నుపాప మూవీ మంచి సినిమాగా తెలుగు ప్రేక్ష‌కుల ఆద‌ర‌ణ‌ను కూడా పొందుతుంది అని నా న‌మ్మ‌కం. ఫిబ్ర‌వ‌రి 3న ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నాం అన్నారు.

 

 చిత్ర స‌మ‌ర్ప‌కుడు దిలీప్ కుమార్ మాట్లాడుతూ...మాది వ‌రంగ‌ల్. ఇండ‌స్ట్రీలోకి రావాలి...మంచి సినిమాలు నిర్మించాలి అనేది నా కోరిక‌. సింధూర‌పువ్వు కృష్ణారెడ్డి గారి ద్వారా ఈ చిత్రం రైట్స్ తీసుకుని తెలుగు ప్రేక్ష‌కుల‌కు అందిస్తున్నాను. ఈ చిత్రాన్ని ఆద‌రించి నా తొలి ప్ర‌య‌త్నానికి విజ‌యం అందిస్తార‌ని ఆశిస్తున్నాను అన్నారు.

 

నిర్మాత సింధూర‌పువ్వు కృష్ణారెడ్డి మాట్లాడుతూ....ప‌సివాడి ప్రాణం సినిమాలో చిన్న‌పిల్లాడిని ర‌క్షించే పాత్ర‌లో చిరంజీవి గారు ఎలా న‌టించారో ...ఆ సినిమా ఎంత‌టి విజ‌యాన్ని సాధించిందో తెలిసిందే. అదే క్యారెక్ట‌ర్ ను గుడ్డివాడు చేస్తే ఎలా ఉంటుంది అనేదే ఈ క‌నుపాప‌ క‌థాంశం. ఈ చిత్రంలో మోహ‌న్ లాల్ గారు గుడ్డివాడుగా అద్భుతంగా న‌టించారు. ఇది జెన్యూన్ & ఫ్రెష్ ఫిల్మ్. ల‌వ్ లీ క్రైమ్ థ్రిల్ల‌ర్ ఇది. ఈ సినిమాకి వ‌చ్చిన ఆడియోన్స్ ను ఏమాత్రం నిరాశప‌ర‌చ‌దు. మ‌ల‌యాళంలో విజ‌యం సాధించిన‌ట్టుగానే ఖ‌చ్చితంగా తెలుగులో కూడా విజ‌యం సాధిస్తుంది అన్నారు.

 

మోహ‌న్ లాల్, బేబీ మీనాక్షి, విమ‌లా రామ‌న్, అనుశ్రీ, స‌ముద్ర‌ఖ‌ని, నేడుముడి వేణు, రేన్జి ప‌ణిక్క‌ర్, చెంబ‌న్ వినోద్ జోష్ త‌దిత‌రులు న‌టించిన ఈ చిత్రానికి స్టోరీ - గోవింద్ విజ‌య‌న్, మ్యూజిక్ - 4 మ్యూజిక్ ( ఎల్దోస్, జిమ్, బిబీ, జ‌స్టిన్) లిరిక్స్ - వెన్నెల‌కంటి, వ‌న‌మాలి, అనంత శ్రీరామ్, డైలాగ్స్ - ఎం.రాజ‌శేఖ‌ర్ రెడ్డి, సినిమాటోగ్రాఫ‌ర్ - ఎన్.కె.ఏకాంబ‌రం, ఎడిటింగ్ - ఎం.ఎస్.అయ్య‌ప్ప‌న్ నాయ‌ర్, నిర్మాత - మోహ‌న్ లాల్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్ - శ్రీనివాస మూర్తి నిడ‌ద‌వోలు, స్ర్కీన్ ప్లే - డైరెక్ష‌న్ - ప్రియ‌ద‌ర్శ‌న్.

PREV
click me!

Recommended Stories

Jr Ntr కి రెండో సారి హ్యాండిచ్చిన త్రివిక్రమ్‌.. తారక్‌కే ఎందుకిలా జరుగుతుంది?
తెలుగులో నా ఫేవరెట్ హీరో అతడే.. ఒక్కసారైనా కలిసి నటించాలి.. క్రేజీ హీరోయిన్ కామెంట్స్