మోహన్ లాల్ కు ఇది ఊహించని పరాభవమే...

By Surya PrakashFirst Published Jan 29, 2023, 11:19 AM IST
Highlights

 మాలీవుడ్‌లో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. గతంలో మోహన్ లాల్, షాజీ కైలాస్ కాంబినేషన్ లో వచ్చిన సినిమాలన్నీ సూపర్ హిట్టయ్యాయి. ఈ నేపథ్యంలో ‘ఎలోన్’ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి.   


మోహన్‌లాల్ నిస్సందేహంగా కేరళ సినిమాలో అతిపెద్ద సూపర్ స్టార్. కేరళ ఫిల్మ్ ఇండస్ట్రీ నుండి 100 కోట్ల+ గ్రాసర్స్ సాధించిన ఏకైక హీరో ఆయనే. అతని సినిమాలు పులి మురుగన్ , లూసిఫర్ ఇప్పటికీ మళయాళ సినిమాలలో అత్యధిక వసూళ్లు రాబట్టాయి, అయితే ఆశ్చర్యకరంగా ఈ మళయాళ మెగాస్టార్  తాజా చిత్రం  ‘ఎలోన్’ (Alone) ప్రింట్‌లు, ప్రచార ఖర్చులను కూడా వసూలు చేయడంలో విఫలమైంది. ఈ సినిమాకు థియేట్రికల్ షేర్ కూడా  రాకపోవడంతో ఈ చిత్రాన్ని ప్రేక్షకులు నిర్మొహమాటంగా తిరస్కరించారని అర్దమైంది. మోహన్‌లాల్‌ సూపర్‌స్టార్‌ కావడం వల్ల సినిమాకు సంతకం చేసే ముందు చాలాసార్లు ఆలోచించాలని మీడియా అంటోంది. ఈ రకమైన ప్రయోగాత్మక చిత్రాలను థియేటర్లలో కాకుండా నేరుగా OTTలో విడుదల చేస్తే బాగుండేది అంటున్నారు. ఖచ్చితంగా రిజల్ట్ లో  చాలా తేడాను కలిగిస్తుంది.

కంప్లీట్ యాక్టర్ మోహన్‌లాల్ (Mohanlal) ఈ ఏడాది వరుసగా ‘బ్రోడాడీ (Bro daddy), ఆరాట్టు (Araattu), 12th మేన్’ (12th Man) చిత్రాలతో వరుసగా హిట్స్ అందుకున్నారు. వీటిలో ‘బ్రోడాడీ, 12th మేన్’ చిత్రాలు రెండూ ఓటీటీలో విడుదలై ప్రేక్షకుల్ని అలరించాయి. తదుపరిగా మోహన్ లాల్ నటించిన మరో థ్రిల్లర్ మూవీ ‘ఎలోన్’ (Alone). ఆశీర్వాద్ ఫిల్మ్స్ బ్యానర్ పై ఆంటోనీ పెరుంబావూర్ (Antony Perumbavoor) నిర్మాణంలో, షాజీ కైలాస్ (Shaji Kailas) దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కించారు. ఈ సినిమాతో పంజాబీ బ్యూటీ కృతి ఖర్బందా (Kriti Kharbanda) .. మాలీవుడ్‌లో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. గతంలో మోహన్ లాల్, షాజీ కైలాస్ కాంబినేషన్ లో వచ్చిన సినిమాలన్నీ సూపర్ హిట్టయ్యాయి. ఈ నేపథ్యంలో ‘ఎలోన్’ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి.  తాజాగా మోహన్ లాల్  ‘ఎలోన్’ చిత్రంరిలీజైంది. మరి కలెక్షన్స్ పరిస్దితి ఏమిటి..అంటే షాక్ ఇచ్చిందనే చెప్పాలి.
 
పఠాన్ 25న రిలీజైతే మలయాళంలో మోహన్ లాల్ కొత్త మూవీ అలోన్ ఒక రోజు ఆలస్యంగా విడుదల చేశారు. దీనికి ఫస్ట్ డే వచ్చిన కలెక్షన్ అక్షరాల నలభై అయిదు లక్షలు. అది కూడా వరల్డ్ వైడ్ మొత్తం కలిపి. రెండో రోజు పరిస్థితి ఇంకా దిగజారిపోయింది. లాలెట్టన్ కెరీర్ లోనే వరస్ట్ సంఖ్యలు కనిపిస్తున్నాయని అంటున్నారు. అసలు ఈ అలోన్ మీద జనాలకు ఏ మాత్రం ఆసక్తి లేదని తేల్చేసారు.   గత ఏడాది అచ్చం ఆచార్యకు ఎదురైన పరిస్థితే ఆ అలోన్ కు వచ్చిందని చెప్తున్నారు.  దాంతో  డిజాస్టర్ల నుంచి బయటపడి షారుఖ్ సింహాసనం అందుకుంటే దృశ్యం, లూసిఫర్ లాంటి ఇండస్ట్రీ హిట్స్ నుంచి మోహన్ లాల్ ఇలా మాన్స్ టర్, అలోన్ అంటూ వరసగా పరాభవం పొందుతున్నారు.   

‘ది రియల్ హీరోస్ ఆర్ ఆల్వేస్ ఎలోన్’ (The real heroes are always alone) అంటూ వచ్చిన ఈ సినిమా అభిమానులకు కూడా ఎక్కటం లేదు.  ఇందులో మోహన్ లాల్ ఒంటరి యోధుడుగా కనిపించారు. ఆసక్తికరమైన కథాకథనాలతో, థ్రిల్లింగ్ సీన్స్ తో ఈ సినిమా అభిమానుల్ని ఆకట్టుకోబోతోందనుకుంటే బాగా నీరసంగా సాగింది. జెక్స్ బిజాయ్ సంగీతం అందించగా.. అభినందన్ రామానుజన్ ఛాయాగ్రహణం నిర్వహించారు. 

మరో ప్రక్క దేశవ్యాప్తంగా పఠాన్ వీరవిహారం చేస్తున్న సమయం ఇది. మొదటి రోజే వంద కోట్లకు పైగా గ్రాస్ రాబట్టి షాక్ ఇస్తే సెకండ్ డే సైతం డెబ్భై రెండు కోట్లకు పైగానే వసూలయ్యాయి. ఈ వీకెండ్ అయ్యాక బాలీవుడ్ చరిత్రలో ఇప్పటిదాకా నమోదు కానీ బిగ్గెస్ట్ ఫిగర్స్ ని చూస్తామని ట్రేడ్ పండితులు  చెబుతున్నారు. 
 

click me!