విక్టరీ వెంకటేశ్ సరసన ‘కేజీఎఫ్’ భామ? ‘సైంధవ్’ హీరోయిన్ గా కన్ఫమేనా?

By team telugu  |  First Published Jan 29, 2023, 10:59 AM IST

టాలీవుడ్ సీనియర్ నటుడు, విక్టరీ వెంకటేశ్ రీసెంట్ గా కొత్త చిత్రాన్ని ప్రకటించిన విషయం తెలిసిందే. సినిమాను పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కించబోతున్నారు. అయితే తాజాగా హీరోయిన్ పై క్రేజీ అప్డేట్ అందింది.
 


యంగ్ హీరోయిన్ శ్రీనిధి శెట్టి (Srinidhi Shetty)కి క్రేజీ ఆఫర్ దక్కినట్టు తెలుస్తోంది. టాలీవుడ్ సినీయర్ హీరో వెంకటేశ్ సరసన నటించే ఛాన్స్ వచ్చినట్టు సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఇదే నిజమైతే యంగ్ బ్యూటీకి మళ్లీ మంచి రోజులు వచ్చాయనే చెప్పాలి. కన్నడ బ్యూటీ శ్రీనిధి శెట్టి కేవలం మూడు చిత్రాల్లోనే నటించింది. ప్రశాంత్ నీల్ - యష్ కాంబినేషన్ లో వచ్చిన ‘కేజీఎఫ్ ఛాప్టర్ 1’ దానికి సీక్వెల్ గా వచ్చిన ‘కేజీఎఫ్ ఛాప్టర్ 2’లో నటించి మెప్పించింది. ఈ చిత్రం పాన్ ఇండియా స్థాయిలో విడుదలై  సెన్సేషన్ క్రియేట్ చేసిన విషయం తెలిసిందే. 

దీంతో శ్రీనిధికి దేశ వ్యాప్తంగా ఆడియెన్స్ లో గుర్తింపు దక్కింది. కానీ ఆ తర్వాత వచ్చిన ‘కోబ్రా’ చిత్రం పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. చియాన్ విక్రమ్ సరసన నటించినప్పటికీ పెద్ద ఓరిగిందేమీ లేదంటున్నారు. అప్పటి నుంచి శ్రీనిధికి పెద్దగా ఆఫర్లు కూడా లేవు. ఈ క్రమంలో టాలీవుడ్ సీనియర్ నటుడు, విక్టరీ వెంకటేశ్ (Venkatesh) తాజాగా అనౌన్స్ చేసిన నెక్ట్స్ ఫిల్మ్ లో అవకాశం అందినట్టు తెలుస్తోంది. ‘సైంధవ్’ అనే టైటిల్ తో ప్రేక్షకుల ముందుకు రానుంది. 

Latest Videos

చివరిగా ‘ఎఫ్2’తో ఫ్యామిలీ కంటెంట్ తో అలరించిన విషయం తెలిసిందే. కానీ ప్రస్తుతం రూట్ మార్చారు. కుటుంబ నేపథ్య సినిమాలతో అలరించే వెంకటేశ్ కూడా యాక్షన్ వైపు అడుగేశారు. రీసెంట్ గా ఆ సినిమాకు సంబంధించిన టైటిల్ ను కూడా అనౌన్స్ చేశారు. రా అండ్ రాస్టిక్ లుక్ లో ఆకట్టుకుంటున్నారు. ‘హిట్ వెర్స్’ దర్శకుడు శైలేష్ కొలను దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా వెంకటేశ్ కేరీర్ లో మొట్టమొదటి పాన్ ఇండియా ఫిల్మ్ గా విడుదల కాబోతోంది. అందుకు తగ్గట్టుగానే పాన్ ఇండియా హీరోయిన్ గా గుర్తింపు ఉన్న శ్రీనిధిని హీరోయిన్ గా కన్ఫమ్ చేసినట్టు సమచారం అందుతోంది. 

మరోవైపు శైలేష్ కొలను కూడా హీరోయిన్లను తన చిత్రాల్లో స్ట్రాంగ్ గా చూపిస్తుండటం విశేషం. ఇక శ్రీనిధిని కూడా పవర్ ఫుల్ గా చూపిస్తాడనేది తెలుస్తోంది. వెంకటేశ్ సరసన శ్రీనిధి కన్ఫమ్ అయితే కన్నడ బ్యూటీ కేరీర్ మరింత స్పీడ్ కానుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు. నిహారికా ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై వెంకటేష్‌ బోయనపల్లి నిర్మిస్తున్నారు. రీసెంట్ గా పూజా కార్యక్రమాలను పూర్తి చేసుకుని ఈ చిత్ర షూటింగ్‌ ప్రారంభించారు. చాలా రోజుల తర్వాత వెంకటేశ్ యాక్షన్ చిత్రంలో నటిస్తుండటం.. ఇది వెంకటేశ్ 75వ చిత్రం కావడంతో అభిమానుల్లో ఆసక్తి నెలకొంది.

click me!