Taraka Ratna: తారకరత్నకు మెలెనా వ్యాధి, అత్యంత విషమంగా ఆరోగ్యం

Published : Jan 29, 2023, 08:10 AM ISTUpdated : Jan 29, 2023, 08:36 AM IST
Taraka Ratna: తారకరత్నకు మెలెనా వ్యాధి, అత్యంత విషమంగా ఆరోగ్యం

సారాంశం

తారకరత్న ఆరోగ్యం అత్యంత విషమంగానే ఉందని వైద్యులు తెలిపారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు హీరోలు ఎన్టీఆర్, కళ్యాణ్‌ రామ్‌లు కూడా అక్కడికి చేరుకోబోతున్నారట. 

నందమూరి హీరో తారకరత్న ఆరోగ్యం అత్యంత విషమంగానే ఉందని వైద్యులు తెలిపారు. ఆరోగ్యం ఏమాత్రం బెటర్‌ కావడం లేదని, మరింత ఆందోళనకరంగా మారుతుందని వైద్యులు, మేనత్త, బీజీపీ నాయకురాలు పురందేశ్వరి చెప్పిన విషయం తెలిసిందే. ఆయితే ఆయన బాడీలో మల్టీఫుల్ గా ఇంటర్నల్‌ బ్లీడింగ్‌ జరుగుతుందని, అది కంట్రోల్ కావడం లేదని తెలుస్తుంది. దీంతో ఆయన ఆరోగ్యం మరింత క్రిటికల్ గా మారిందని, వైద్యులు అవిశ్రాంతంగా పోరాడుతున్నా, ఏమాత్రం బెటర్‌ కావడం లేదని తెలుస్తుంది.  తారకత్నకు మెలెనా వ్యాధి ఉన్నట్లు భావిస్తున్నారు. దానివల్ల చిన్నప్రేవులో రక్తస్రావం జరుగుతోందని చెబుతున్నారు. ఈ వ్యాధి లక్షణాలున్న వ్యక్తి అకస్మాత్తుగా కుప్పకూలే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు.

ఇప్పటికే మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడు, తారకరత్న ఫ్యామిలీ బెంగుళూరులోని నారాయణ హృదయాలయకు చేరుకున్నారు. బాలకృష్ణ సైతం దగ్గరుండి చూసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు హీరోలు ఎన్టీఆర్, కళ్యాణ్‌ రామ్‌లు కూడా అక్కడికి చేరుకోబోతున్నారట. ప్రత్యేక విమానంలో ఈ ఇద్దరు హీరోలు బెంగుళూరులోని నారాయణ హృదయాలయకు చేరుకోబోతున్నారని సమాచారం. ఇలా ఫ్యామిలీ అంతా ఆసుపత్రికి చేరుకుంటున్న నేపథ్యంలో అభిమానుల్లో మరింత ఆందోళన పెరుగుతుంది. ఏదైనా వినకూడని వార్త వినాల్సి వస్తుందేమో అని ఆందోళన చెందుతున్నారు. 

జనవరి 27న కుప్పంలో తారకరత్న గుండెపోటుకు గురైన విషయం తెలిసిందే. స్థానిక ఆసుపత్రులలో చికిత్స అందించారు. కానీ ఆరోగ్యం మెరుగుపడకపోవడంతో నారాయణ హృదయాలయ నుంచి నిపుణుల బృందం ని కుప్పంకు రప్పించారు. ఆ సమయంలో అతడిని తమ ఆస్పత్రికి బదిలీ చేయమని వైద్యులు కోరగా వెంటనే బెంగుళూరులోని నారాయణ హృదయాలయకు తారకరత్నని షిఫ్ట్ చేశారు. అక్కడ కార్డియాలజిస్ట్ లు, ఇంటెన్సివిస్ట్‌లు, ఇతర నిపుణులతో కూడిన మల్టీ డిసిప్లినరీ క్లినికల్ టీమ్ తారకరత్న ఆరోగ్య పరిస్థితిని పర్యవేక్షిస్తుంది. బెలూన్ యాంజియోప్లాస్టీతో ద్వారా రక్తాన్ని పంపింగ్ చేసేందుకు ప్రయత్నించారు. మరోవైపు ఎక్మో ద్వారా కృత్తిమ శ్వాస కొనసాగిస్తున్నారు. కానీ ప్రయోజనం కనిపించడం లేదని సమాచారం. 

తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువ గళం పేరుతో నిర్వహిస్తున్న పాదయాత్రను శుక్రవారం కుప్పం నుంచి ప్రారంభించారు. లోకేష్ వెంట బాలకృష్ణ, తారకరత్నలు కూడా ఉన్నారు. పాదయాత్ర ప్రారంభం సందర్భంగా కుప్పంలోని దేవాలయాలు, మసీదు, చర్చిలను లోకేష్ సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు. మసీదులో ప్రార్థనలు ముగించుకుని పాదయాత్ర చేస్తున్న క్రమంలో అభిమానులు ఒక్కసారిగా పోటెత్తారు. దీంతో ఒత్తిడిపెరిగిపోయింది. కళ్లు తిరిగిన తారకరత్న అక్కడే కుప్పకూలిపోయారు. వెంటనే ఆయన్ని కుప్పంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ఆ తర్వాత సమీపంలోని పీఈఎస్‌ ఆస్పత్రికి తరలించారు. 
 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Articles on
click me!

Recommended Stories

Gunde Ninda Gudi Gantalu: మనోజ్ కి నడిచొచ్చే కొడుకు.. రోహిణీ గతం బయటపడుతుందా? బాలుకి అబద్ధం చెప్పిన మీనా
Bigg Boss Telugu Winners : టైటిల్ గెలిచారు కానీ.. ఉపయోగం లేదు, బిగ్ బాస్ తెలుగు విన్నర్స్ ఇప్పుడు ఏం చేస్తున్నారు? ఎక్కడున్నారు?