యాంకర్ అనసూయకు సపోర్ట్ గా నిలిచిన మోహన్ బాబు

Published : Feb 08, 2018, 08:57 PM ISTUpdated : Mar 25, 2018, 11:51 PM IST
యాంకర్ అనసూయకు సపోర్ట్ గా నిలిచిన మోహన్ బాబు

సారాంశం

ఇటీవలే బాలుడి మొబైల్ పగలగొట్టినట్లు అనసూయపై ఆరోపణలు తనను చిరాకు పెట్టారని, అయినా మొబైల్ పగలగొట్టలేదని అనసూయ వాదన మరో వైపు గాయత్రిలో జర్నలిస్ట్ గా నటించిన అనసూయకు మోహన్ బాబు మద్దతు  

ఇటీవల హైదరాబాద్ లో ఓ బాలుడి సెల్ ఫోన్ పగలగొట్టిన కేసులో చిక్కుల్లో పడి సోషల్ మీడియాలో ట్రోలింగ్ ఎదుర్కొంటున్న అనసూయ.. తనకు ఎదురవుతున్న విమర్శల నేపథ్యంలో ఏకంగా తన సోషల్ మీడియా ఎకౌంట్లు క్లోజ్ చేసేసుకుంది అనసూయ. బాలుడని కూడా చూడకుండా అనసూయ అలా ప్రవర్తించడం సరికాదని.. అభిమానం చాటుతుంటే... కోపం ప్రదర్శించటం ఎందుకు అని నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు.

 

మరోవైపు అనసూయ కూడా ఈ అంశంపై సోషల్ మీడియాలో నిజం తెలుసుకోకుండా అంతా రకరకాలుగా మాట్లాడుతున్నారంటూ కౌంటర్స్ ఇచ్చే ప్రయత్నం చేసింది. కానీ అనసూయకు మద్దతు లభించకపోవటంతో ఏకంగా సోషల్ మీడియా ఎకౌంట్స్ అన్నీ బ్లాక్ చేసుకుంది.

 

ఇక అనసూయపై పోలీస్ కేసు దాకా మేటర్ వెళ్లినా.. ఆమెపై న్యూస్ లో కథనాలు వస్తున్నా... ఆమె జర్నలిస్ట్ పాత్ర పోషించిన గాయత్రి సినిమా మేకర్ డా.మోహన్ బాబు మాత్రం అనసూయకు మద్దతుగా నిలుస్తున్నారు. గాయత్రి సినిమా ప్రమోషన్ లో భాగంగా... ఓ యాంకర్ చేసిన ఇంటర్వ్యూలో... అనసూయ అనగానే నవ్వితే... ఎగతాలి చేస్తున్నావా.. జాగ్రత్త. అనసూయను ఏమన్నా అంటే.. అంటూ మోహనన్ బాబు అనసూయకు మద్దతుగా నిలిచారు.

PREV
click me!

Recommended Stories

Suman Shetty Eliminate: సుమన్‌ శెట్టి ఎలిమినేట్‌.. భరణితో స్నేహం దెబ్బ కొట్టిందా? తనూజ ఆవేదన
Ustaad Bhagat Singh: ఊపేసేలా ఉన్న `దేఖ్‌ లేంగే సాలా` పాట.. మళ్లీ ఆ రోజులను గుర్తు చేసిన పవన్‌ కళ్యాణ్‌