`మా ఎన్నికలు` మోహన్‌బాబు తీవ్ర వ్యాఖ్యలు.. చిరంజీవిని ఉద్దేశించేనా?.. టాలీవుడ్‌లో దుమారం..

By Aithagoni RajuFirst Published Oct 11, 2021, 8:23 PM IST
Highlights

సోమవారం సాయంత్రం మోహన్‌బాబు మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒకరిని టార్గెట్‌గా ఆయన తీవ్ర స్థాయిలో మండి పడ్డారు. తనని చాలా రోజులుగా రెచ్చగొడుతున్నారని, తాను సమయం కోసం వేచి చూస్తున్నానని తెలిపారు. 

మోహన్‌బాబు `మా` ఎన్నికల అనంతరం తీవ్ర వ్యాఖ్యలు. తనని రెచ్చగొట్టాలని చూస్తున్నారని, వేదిక దొరికింది కదా అని, నోరు ఉంది కదా అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. మాట్లాడనీ జనం చూస్తున్నారు. ఎప్పుడు సమాధానం చెప్పాలో అప్పుడే చెబుతా అని హెచ్చరించారు మోహన్‌బాబు. `మా` ఎన్నికలు ఆదివారం ముగిశాయి. మంచు విష్ణు ప్యానెల్‌ గెలిచారు. ఈసీ మెంబర్స్ గెలుపుకి సంబంధించిన క్లారిటీ వచ్చిన నేపథ్యంలో తాజాగా సోమవారం సాయంత్రం మోహన్‌బాబు మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. 

ఒకరిని టార్గెట్‌గా ఆయన తీవ్ర స్థాయిలో మండి పడ్డారు. తనని చాలా రోజులుగా రెచ్చగొడుతున్నారని, తాను సమయం కోసం వేచి చూస్తున్నానని తెలిపారు. వేదిక దొరికిందని దీని స్థితిలో మాట్లాడుతున్నారు. వయసు పెరిగే కొద్ది మరింత దిగజారి మాట్లాడుతున్నారు. తాము ఏ పొజీషియన్‌లో ఉన్నామో మర్చిపోయి నోరు ఉంది కదా అని ఇష్టారీతిన మాట్లాడుతున్నారు. `ఏంటీ పోటీ, ఏంటీ దుర్మార్గం, ఏంటీ వివాదం` అంటూ మాట్లాడారు. దీన్ని అందరు చూస్తున్నారు. చదువుకున్న యూత్‌ అంతా గమనిస్తుంది అని తెలిపారు మోహన్‌బాబు. 

తనని రెచ్చగొడుతున్నారని, సింహం నాలుగు అడుగులు వెనక్కి వేసిందంటే భయపడి కాదని, అది సునామీలా తిరిగి వస్తుందని, పంజా విసురుతుందన్నారు మోహన్‌బాబు. తాను అసమర్థుడిని కాదని, అన్నీ నవ్వుతో స్వీకరించాలని, చెప్పాల్సిన సమయంలో సమాధారం చెప్పాలన్నారు. `మా`లో ఏం జరుగుతుందో అందరికి తెలుసన్నారు. ఇండస్ట్రీ సమస్యలకు సంబంధించి ఇరు రాష్ట్రాల సీఎంలకు రిక్వెస్ట్ చేసుకోవాలని, వారిని గౌరవించుకోవాలని, తమ సమస్యలను విన్నవించాలని, అప్పుడే వాళ్లు పరిష్కరిస్తారన్నారు. 

అయితే మోహన్‌బాబు చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు టాలీవుడ్‌లో దుమారం రేపుతున్నాయి. ఆయన ఎవరిని ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేశారనేది ఆసక్తిగా మారింది. ఆదివారం `పెళ్లి సందడి` ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో చిరంజీవి మాట్లాడుతూ, ఎందుకింత రచ్చ, ఎందుకింత సంకుచిత మనస్థత్వం, మనమంతా ఒక్కటి, మనది వసుదైన కుటుంబం, అందరం కలిసి ఉండాలని, కానీ రెండు, మూడేళ్ల పదవి కోసం,  చిన్న పదవుల కోసం ఎందుకింత రచ్చ అంటూ వ్యాఖ్యానించారు. 

దీంతో ఇప్పుడు మోహన్‌బాబు కూడా చిరంజీవిని ఉద్దేశించే ఈ వ్యాఖ్యలు చేశారని, ఓ రకంగా చిరంజీవికే హెచ్చరికాలు పంపారని అంటున్నారు నెటిజన్లు. అదే సమయంలో మంచు విష్ణు కూడా తనని `మా` పోటీ నుంచి తప్పుకోవాలని కోరినట్టు తెలిపారు. ఆ తర్వాతనే మోహన్‌బాబు మాట్లాడి ఈ వ్యాఖ్యలు చేయడం ఇప్పుడు దుమారం రేపుతున్నాయి. టాలీవుడ్‌లో ఇప్పుడు మరో కొత్త రచ్చకి దారితీయబోతుందనే కామెంట్లు వస్తున్నాయి. మరి మోహన్‌బాబు, మంచు విష్ణు వ్యాఖ్యలకు ఎవరు రియాక్ట్ అవుతారు, ఎలా రియాక్ట్ అవుతారు, మోహన్‌బాబు సమయం చూసి ఏం సమాధానం చెప్పబోతున్నారనేది ఇప్పుడు సస్పెన్స్ గా మారింది. 

click me!