చిరంజీవి నన్ను విత్‌ డ్రా చేసుకోమన్నారుః మంచు విష్ణు సంచలన వ్యాఖ్యలు.. `మా`లో మరో చిచ్చు

By Aithagoni RajuFirst Published Oct 11, 2021, 7:45 PM IST
Highlights

ఎన్నికల అనంతరం చిరంజీవిని ఇరికించాడు మంచు విష్ణు. అంతేకాదు రామ్‌చరణ్‌ తనకు మంచి మిత్రుడు అని, కానీ ఆయన ఓటు ప్రకాష్‌రాజ్‌కే వెళ్లిందన్నారు. తాజాగా మంచు విష్ణు మీడియాతో మాట్లాడారు. 

`మా` ఎన్నికల్లో గెలిచిన మంచు విష్ణు సంచలన వ్యాఖ్యలు చేశారు. చిరంజీవిపై ఆయన షాకింగ్‌ కామెంట్‌ చేశారు.  తనని `మా` ఎన్నికల పోటీ నుంచి తప్పుకోవాలని కోరినట్టు తెలిపారు. చిరంజీవి నన్ను సైడ్‌ అయిపోవాలని కోరినట్టు తెలిపారు విష్ణు. ఎన్నికల అనంతరం ఈ వ్యాఖ్యలు చేసి చిరంజీవిని ఇరికించాడు మంచు విష్ణు. అంతేకాదు రామ్‌చరణ్‌ తనకు మంచి మిత్రుడు అని, కానీ ఆయన ఓటు ప్రకాష్‌రాజ్‌కే వెళ్లిందన్నారు. తాజాగా సోమవారం సాయంత్రం మంచు విష్ణు మీడియాతో మాట్లాడారు. 

ఆదివారం జరిగిన `మా` ఎన్నికల్లో మంచు విష్ణు అధ్యక్షుడిగా గెలుపొందిన విషయం తెలిసిందే. నిన్న అధ్యక్షుడు, కార్యదర్శి, వైస్‌ ప్రెసిడెంట్‌, జాయింట్‌ సెక్రెటరీలు, ట్రెజరీల గెలుపులను ప్రకటించారు. కానీ అందులో కొన్ని సవరణలు కనిపిస్తున్నాయి. ఈ సాయంత్రం కొత్తగా కార్యవర్గాన్ని ప్రకటించారు. ఇందులో గెలిచినవారిలో కొత్త పేర్లు ఉండటం అనేక అనుమానాలకు తావిస్తుంది. అయితే కొత్త కార్యవర్గం ప్రకటించిన సందర్భంగా మంచు విష్ణు మీడియాతో మాట్లాడారు. ఇందులో చిరుపై ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. `మా`లో సరికొత్త చిచ్చుకి తెరలేపారు. నన్ను, నాన్నగారిని సైడ్‌ అయిపోవాలని చిరంజీవి అంకుల్‌ చెప్పారని వెల్లడించారు మంచు విష్ణు. 

మంచు విష్ణు ఇంకా చెబుతూ, `మా` ఎన్నికల ప్రక్రియలో జరిగిందేదో జరిగింది. ప్రకాష్‌రాజ్‌ అంటే నాకు చాలా ఇష్టం. ఆయన రాజీనామాని ఆమోదించను. ఆయన్ని వ్యక్తిగతంగా కలిసి సముదాయిస్తాం. ఆయన ఐడియాలు మాకు కావాలి. కలిసి పనిచేయాలనుకుంటున్నామని మంచు విష్ణు తెలిపారు. అలాగే నాగబాబు ఆవేశంల రాజీనామా చేశారు. ఆయన రాజీనామాని కూడా ఆమోదించమని తెలిపారు. నాన్‌ తెలుగు అనేది నా దృష్టిలో లేదు. `మా`కి అన్ని ప్రాంతాల సభ్యులు కావాలి. అఫ్గానిస్తాన్, పాకిస్తాన్‌ నటీనటులు కూడా కావాలన్నారు. 

నాన్ లోకల్‌ ఫ్యాక్టరీ ప్రకాష్‌రాజ్‌ని ఓడించిందంటే నేను నమ్మను. ఎందుకంటే ఆయన కావాలని 274 మంది కోరుకున్నారు. అయితే ఓటమి ఎదురైనప్పుడు నిరాశ తప్పదు. నటీనటులకు అది కామనే. సినిమా పరాజయం చెందితే చాలా బాధపడతాం. నిరాశచెందుతాం. ప్రకాష్‌రాజ్‌ కూడా అదే ఫీలవుతున్నారు. పదవి శ్రీకారానికి సంబంధించి రేపు(మంగళవారం) నిర్ణయం తీసుకుంటామన్నారు. 

click me!