హక్కుల కంటే బాధ్యత గొప్పదన్న రామతత్వం.. చిరు, మోహన్‌బాబు, మహేష్‌, రవితేజ, అనసూయ శ్రీరామనవమి విషెస్‌!

Published : Apr 21, 2021, 02:57 PM IST
హక్కుల కంటే బాధ్యత గొప్పదన్న రామతత్వం.. చిరు, మోహన్‌బాబు, మహేష్‌, రవితేజ, అనసూయ శ్రీరామనవమి విషెస్‌!

సారాంశం

కరోనా కష్టాలతో చిత్ర పరిశ్రమ విలవిలలాడుతున్నా.. సినీ తారలు మాత్రం అందరు బాగుండాలని కోరుకుంటున్నారు. ఈ క్రమంలో చిరంజీవి, మోహన్‌బాబు, మహేష్‌, రవితేజ, యాంకర్‌ అనసూయ ఇలా సెలబ్రిటీలు, నిర్మాతలు సంస్థలు ఆడియెన్స్ కి శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేశారు. 

కరోనా కష్టాలతో చిత్ర పరిశ్రమ విలవిలలాడుతున్నా.. సినీ తారలు మాత్రం అందరు బాగుండాలని కోరుకుంటున్నారు. ఈ క్రమంలో చిరంజీవి, మోహన్‌బాబు, మహేష్‌, రవితేజ, యాంకర్‌ అనసూయ ఇలా సెలబ్రిటీలు, నిర్మాతలు సంస్థలు ఆడియెన్స్ కి శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేశారు. అందరు బాగుండాలని కోరుకుంటున్నారు. మెగాస్టార్ చిరంజీవి స్పందిస్తూ, `హక్కుల కంటే బాధ్యత గొప్పదన్నది- రామతత్వం! కష్టంలో కలిసి నడవాలన్నది- సీతాతత్వం! అందరికీ శ్రీ రామ నవమి శుభాకాంక్షలు. పుణ్య దంపతులైన సీతారాముల శుభాశీస్సులతో మనందరి మనసులు ఎప్పుడూ మంచి ఆలోచనలతో నిండాలని ఆశిస్తున్నాను' అని ట్విట్టర్‌ ద్వారా తెలిపారు చిరంజీవి. 

కలెక్షన్‌ కింగ్‌ మోహన్‌బాబు తెలుగు ప్రజలకు శ్రీరామ నవమి శుభాకాంక్షలు తెలియజేశారు. ఆయన కరోనాని పోల్చుతూ విషెస్‌ చెప్పడం విశేషం. `ఆనాడు లక్ష్మణరేఖ దాటిన సీతమ్మ తల్లి ఎన్నో అష్టకష్టాలు పడి చివరికి శ్రీరాముని వల్ల రావణుని చెర వీడింది. ఈనాడు కరోనా జాగ్రత్తలు తీసుకున్నా.. ప్రజలు ఎన్నో బాధలు పడుతున్నారు` అని తెలిపారు.

అలాగే సూపర్‌ స్టార్‌ మహేశ్‌బాబు, మాస్‌ మహారాజ రవితేజ, అనసూయ, వంటి హీరోలు రామనవమి శుభాకాంక్షలు చెప్తూనే ఇంట్లో సేఫ్‌గా ఉండాలని కోరారు.

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

500 కోట్ల ధురంధర్, స్టార్ హీరోలను కూడా భయపెడుతున్న రణ్ వీర్ సింగ్ సినిమా
రవితేజ సంచలన నిర్ణయం, మాస్ మహారాజా ట్యాగ్ ను దూరం పెట్టిన స్టార్ హీరో?