బాలయ్య సినిమాల విషయానికి వస్తే ఇది మంచి డీల్. కెరీర్ లో బెస్ట్ డీల్ అంటున్నారు. ఇక ఈ చిత్రం షూటింగ్ విషయానికి వస్తే..ఇంకా పదిహేను రోజులు పెండింగ్ ఉంది.
కొన్ని కాంబినేషన్స్ కు తిరుగుండదు. వాటి కోసం ప్రేక్షకులు, డిస్ట్రిబ్యూటర్స్, ఎగ్జిబిటర్స్ ఎదురూచూస్తూంటారు. అలాంటి అదిరిపోయే కాంబోనే బాలయ్య, బోయపాటి. వారిద్దరు కలిసి ఇప్పటికి ‘సింహా’ , ‘లెజెండ్’ అంటూ రెండు మెగా హిట్స్ ఇచ్చారు. దాంతో వీరి కాంబినేషన్ లో రూపొందుతున్న మూడో సినిమా కోసం ప్రేక్షకులు చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఆ సినిమానే ‘అఖండ’. రీసెంట్ గా ఈ చిత్రం టీజర్ రిలీజ్ అయ్యి..రికార్డ్ లు క్రియేట్ చేసింది. ఇక ఈ సినిమాకు సంభందించిన ప్రీ రిలీజ్ బిజినెస్ విషయానికి వస్తే.. థియోటర్ డీల్స్ ఇప్పటికే క్లోజ్ అయ్యిపోయాయి. తాజాగా శాటిలైట్, డిజిటల్ రైట్స్ డీల్ కూడా ఫినిష్ చేసినట్లు సమాచారం.
ట్రేడ్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు ‘అఖండ’ శాటిలైట్ రైట్స్ ని స్టార్ మా వారు తీసుకోగా, డిజిటల్ రైట్స్ ని హాట్ స్టార్ వారు సొంతం చేసుకున్నారు. రెండు డీల్స్ కలిసి 15 కోట్లుకు క్లోజ్ చేసారని సమాచారం. బాలయ్య సినిమాల విషయానికి వస్తే ఇది మంచి డీల్. కెరీర్ లో బెస్ట్ డీల్ అంటున్నారు. ఇక ఈ చిత్రం షూటింగ్ విషయానికి వస్తే..ఇంకా పదిహేను రోజులు పెండింగ్ ఉంది.
ఈ చిత్రంలో బాలకృష్ణ సరసన ప్రగ్యా జైస్వాల్ నటిస్తోంది. మరో హీరోయిన్ పూర్ణ డాక్టర్ పాత్రలో కనిపించనుందని సమాచారం. శ్రీకాంత్ కీలక పాత్రలో నటిస్తున్నారు. తమన్ స్వరాలు సమకూరుస్తున్నారు. ద్వారక క్రియేషన్స్ పతాకంపై మిర్యాల రవీందర్‌రెడ్డి నిర్మిస్తున్నారు. మే 28న ప్రేక్షకుల ముందుకు రానుంది. ‘సింహా’ , ‘లెజెండ్’ తర్వాత బోయపాటి శ్రీను- బాలకృష్ణ కాంబినేషన్‌లో రూపొందుతుండటంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.