ఎస్వీ రంగారావు పాత్ర‌లో న‌టిస్తున్న మోహ‌న్ బాబు

Published : Sep 18, 2017, 08:13 AM ISTUpdated : Mar 25, 2018, 11:51 PM IST
ఎస్వీ రంగారావు పాత్ర‌లో న‌టిస్తున్న మోహ‌న్ బాబు

సారాంశం

అలనాటి అందాల తార సావిత్రి జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్నసినిమా మ‌హాన‌టి  సావిత్రి పాత్ర‌లో న‌టిస్తున్న హిరోయిన్ కిర్తి సురేష్  ఈ మూవీలో న‌టిస్తున్న హిరోయిన్ స‌మంత షాలిని పాండే ప్ర‌కాశ్ రాజ్ దుల్క‌ర్ స‌ల్మాన్ ఎస్వీ రంగారావు పాత్ర‌లో న‌టిస్తున్న హిరో మోహ‌న్ బాబు 

 

అలనాటి అందాల తార సావిత్రి జీవిత కథ ఆధారంగా సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. మహానటి పేరుతో తెరకెక్కుతున్న ఈ సినిమాలో సావిత్రి పాత్రలో కీర్తి సురేష్ నటిస్తున్నారు. ఎవడే సుబ్రమణ్యం సినిమాతో దర్శకుడిగా పరిచయం అయిన నాగ అశ్విన్ ఈ సినిమాకు దర్శకుడు. ఇప్పటికే షూటింగ్ ప్రారంభమైన ఈ సినిమాలో దుల్కర్ సల్మాన్, సమంత, ప్రకాష్ రాజ్, షాలిని పాండేలు ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

సావిత్రి నిజజీవితంలో కీలక పాత్రలైన ఎన్టీఆర్, ఏఎన్నార్ పాత్రలను యంగ్ హీరోలతో చేయించాలని ప్రయత్నిస్తున్నారు. ఇక అలనాటి మహానటుడు ఎస్వీ రంగారావు పాత్రలో సీనియర్ నటుడు మోహన్ బాబు అలరించనున్నారు. ఎస్వీ రంగారావు పేరు తలుచుకోగానే గంభీరమైన ఆయన రూపం అనర్గళమైన ఆయన సంభాషణలు గుర్తుకొస్తాయి. 

ఎన్ని తరాలు గడిచినా అలాంటి నటుడు మళ్లీరాకపోవచ్చని అంటారు. ఆ మహానటుడు లేకపోయినా మహానటి సినిమాలో మోహ‌న్ బాబుని ఎస్వీ రంగారావుగా మనముందుకు తీసుకురాబోతున్నారు. మ‌రి ఈ పాత్రకి మోహ‌న్ బాబు ఓకే అన్నాడా లేదా అనే దానిపై క్లారిటీ కొసమే ఎదురు చూసారు అంతా. చాలా రోజులుగా ఈ వార్త వినిపిస్తున్నా. ఇంత వరకు అధికారిక సమాచారం లేదు.

అయితే తాజాగా మంచు లక్ష్మీ ఓ పత్రికలో వచ్చిన వార్తను రీట్వీట్ చేస్తూ ఈ విషయాన్ని కన్ఫామ్ చేశారు.ఇక ఎస్వీ రంగారావు .సావిత్రి మధ్య ఎంతో అనుబంధం వుంది. ఎస్వీఆర్ ను సావిత్రి నాన్నా అని పిలిచేదట. ఆయన ఓ కూతురులా ఆమెను చూసుకునేవారని అంటారు.అలాంటి ఎస్వీఆర్ పాత్ర కూడా ఈ సినిమాలో కీలకమే.

 అలాంటి పాత్రకోసం అందరినీ అనుకొని చివరికి మోహన్ బాబు దగ్గర ఆగింది నాగ్ అశ్విన్ అన్వేషణ. అయితే ఇన్నాళ్ళూ సమాచారం ఉన్నా సరైన క్లారిటీ లేకపోవటంతో ఎవ్వరూ ఈ విషయం మాట్లాడలేదు ఇప్పుడు మంచు లక్ష్మి ప్రకటనతో ఈ విషయాన్ని పక్కా చేసుకోవచ్చు.నాగ్ అశ్విన్ దర్శకత్వంలో మహానటి సినిమా షూటింగ్ చకచకా జరిగిపోతోంది. 

గండిపేట ప‌రిస‌ర ప్రాంతాల‌లో సెకండ్ షెడ్యూల్ జ‌రుపుకుంటుంది. సావిత్రికి సంబంధించిన కొన్ని ముఖ్యమైన సన్నివేశాలను కీర్తి సురేశ్ పై చిత్రీకరిస్తున్నారు. సావిత్రి భర్త జెమిని గణేశన్ పాత్రలో దుల్కర్ సల్మాన్ నటిస్తున్నాడు. అలాగే ఎన్టీ రామారావు, అక్కినేని పాత్రలకోసం జూనియర్ ఎన్టీఆర్ ను, నాగచైతన్య ను సంప్రదిస్తున్నట్టు సమాచారం.

PREV
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9 title Winner: నాగార్జున డైలాగ్‌తో చెప్పి మరీ కప్‌ కొట్టిన కళ్యాణ్‌, ఎమోషనల్‌ కామెంట్‌.. తనూజకే క్రెడిట్‌
Bigg Boss Telugu 9: రమ్య మోక్ష చేత అందరి ముందు క్షమాపణలు చెప్పించిన కళ్యాణ్‌.. పరువు పోయిందిగా