బాక్స్ ఆఫీస్: మోహన్ లాల్ మరో సెంచరీ

Published : Apr 09, 2019, 08:22 PM IST
బాక్స్ ఆఫీస్: మోహన్ లాల్ మరో సెంచరీ

సారాంశం

మలయాళం సినిమాలు కూడా బాక్స్ ఆఫీస్ వద్ద సరికొత్త రికార్డులు సృష్టిస్తున్నాయి. అందుకు మోహన్ లాల్ గట్టి పునాదులను నిర్మిస్తున్నారు.

మలయాళం సినిమాలు కూడా బాక్స్ ఆఫీస్ వద్ద సరికొత్త రికార్డులు సృష్టిస్తున్నాయి. అందుకు మోహన్ లాల్ గట్టి పునాదులను నిర్మిస్తున్నారు. నేషనల్ లెవెల్లో అందరిని ఆకర్షిస్తూ తాము కూడా గ్రాస్ కలెక్షన్స్ లో సత్తా చాటగలమని చెబుతున్నారు. రీసెంట్ గా విడుదలైన లూసిఫర్ సినిమా 100 కోట్ల కలెక్షన్స్ ను రాబట్టి మలయాళం ఇండస్ట్రీ రేంజ్ ని పెంచింది. 

కేవలం మోహన్ లాల్ ద్వారానే ఆ రికార్డు మళ్ళీ బద్దలవ్వడం విశేషం. మలయాళం ఇతర స్టార్ హీరోలు 50 కోట్ల కలెక్షన్స్ ని దాటడానికి నానా తంటాలు పడుతుంటే మోహన్ లాల్ మాత్రం ఒక సినిమా కాకపోతే మరొకటి అంటూ ఇప్పుడు లూసిఫర్ తో సెంచరీ కొట్టేశాడు. 

ఈ సినిమా కేవలం 8 రోజుల్లోనే ఈ రికార్డును అందుకుంది. ఇక మలయాళం హీరో పృథ్వీ రాజ్ ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. పొలిటికల్ డ్రామాగా తెరకెక్కిన లూసిఫర్ తెలుగులో ఈ నెల 12న రిలీజ్ కానుంది. 

PREV
click me!

Recommended Stories

విజయ్ దళపతి ఆడియన్స్ సహనాన్ని పరీక్షించబోతున్నాడా? జన నాయగన్ రన్ టైమ్ చూసి అభిమానులు షాక్
Motivational Dialogue: ఒక్కో డైలాగ్ ఒక్కో బుల్లెట్‌.. మ‌న‌సులో నుంచి పోవ‌డం క‌ష్టం