మహర్షి: కొనుక్కునేవాళ్లు లేక.. ఇలా రిలీజ్ చేస్తున్నారా?

Published : Apr 09, 2019, 07:07 PM IST
మహర్షి: కొనుక్కునేవాళ్లు లేక.. ఇలా రిలీజ్ చేస్తున్నారా?

సారాంశం

మహేష్ బాబు సినిమా అంటే ఓవర్ సీస్ లో దుమ్ము దులుపుతుంది. అక్కడ క్లాస్ ఆడియన్స్ మహేష్ సినిమాలను బాగా ఆదరిస్తూంటారు. ఈ విషయం నిర్మాతలకు తెలుసు. దాంతో ఓవర్ సీస్ రేట్లు ఓ రేంజిలో ఫిక్స్ చేస్తూంటారు. ఈ నేపధ్యంలో సినిమా తేడా కొడితే మినిమం రెవిన్యూ మాట దేవుడెరుగు భారీ లాస్ లు కనపడుతున్నాయి

మహేష్ బాబు సినిమా అంటే ఓవర్ సీస్ లో దుమ్ము దులుపుతుంది. అక్కడ క్లాస్ ఆడియన్స్ మహేష్ సినిమాలను బాగా ఆదరిస్తూంటారు. ఈ విషయం నిర్మాతలకు తెలుసు. దాంతో ఓవర్ సీస్ రేట్లు ఓ రేంజిలో ఫిక్స్ చేస్తూంటారు. ఈ నేపధ్యంలో సినిమా తేడా కొడితే మినిమం రెవిన్యూ మాట దేవుడెరుగు భారీ లాస్ లు కనపడుతున్నాయి. హిట్ అయినా అతి తక్కువ లాభాలు కనపడుతున్నాయి. కష్టానికి, పెట్టుబడికి తగ్గ ఫలితం ఉండటం లేదు. దాంతో మహేష్ సినిమా అంటే అక్కడ డిస్ట్రిబ్యూటర్స్ ఆచి,తూచి అడుగులు వేస్తున్నారు. మహర్షి చిత్రం కూడా అదే పరిస్దితి ఎదుర్కొంది. 

ఓవర్ సీస్ లో నిర్మాత  దిల్ రాజు చెప్పే రేట్లకు డిస్ట్రిబ్యూటర్స్ దడుసుకున్నారని చెప్పుకుంటున్నారు. అయితే భారీ బడ్జెట్ తో సినిమా తీసాం...ఆ రేట్లు చెప్పకపోతే వర్కవుట్ కావని దిల్ రాజు అంటున్నారట. ఈ నేపధ్యంలో గత కొంతకాలంగా ఓవర్ సీస్ డీల్ క్లోజ్ కాలేదు. దాంతో టీజర్ వచ్చాక క్రేజ్ క్రియేట్ అయ్యి అమ్ముదామని వెయిట్  చేసారు. 

దాంతో ప్రత్యేకమైన దృష్టి పెట్టి మరీ టీజర్ కట్ చేసారు. మాస్ సినిమా అనే కలర్ ఈ సినిమాకు వచ్చేసింది. ఒక్కసారిగా క్రేజ్ రెట్టింపు అయ్యింది. అయినా డిస్ట్రిబ్యూటర్స్ లో కదలిక లేదట. దాంతో దిల్ రాజు ...కమీషన్ బేసిస్ మీద ఈ చిత్రం ఓవర్ సీస్ రైట్స్ ఇచ్చినట్లు సమాచారం. బాహుబలి, భరత్ అనే నేను వంటి సూపర్ హిట్ చిత్రాలు డిస్ట్రిబ్యూట్ చేసిన గ్రేట్ ఇండియా ఫిల్మ్స్ వారు ఈ చిత్రం పంపిణీ భాధ్యతలు తీసుకున్నారు. 

పివిపి, అశ్వనీదత్, దిల్ రాజు కలిసి నిర్మిస్తున్న ఈ సినిమాకు వంశీ పైడిపల్లి దర్శకుడు.‘అల్లరి’ నరేశ్‌ ముఖ్య పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రం మే 9న థియేటర్లలోకి రానుంది. ఈ సినిమాకు సంగీతం: దేవిశ్రీ ప్రసాద్‌. కెమెరా: కె.యు.మోహనన్‌.  

PREV
click me!

Recommended Stories

నమ్రత ఎంత చెప్పినా వినకుండా డిజాస్టర్ చూసిన మహేష్ బాబు ? ఆ సినిమా చేసి తప్పు చేశాడా?
Eesha Rebba: డైరెక్టర్‌ని పెళ్లి చేసుకోబోతున్న ఈషా రెబ్బా.. అసలు కథ ఇప్పుడే స్టార్ట్