నితిన్ ది ఆత్మ హత్య కాదు... అనుమానాస్పదమే-మోహన్ బాబు

Published : Mar 15, 2017, 12:38 PM ISTUpdated : Mar 24, 2018, 12:11 PM IST
నితిన్ ది ఆత్మ హత్య కాదు... అనుమానాస్పదమే-మోహన్ బాబు

సారాంశం

జయసుధ భర్త నితిన్ కపూర్ ఆత్మహత్యపై స్పందించిన మోహన్ బాబు నితిన్ మృతి అనుమానాస్పదమే కాని, ఆత్మహత్య అనొద్టని మీడియాకు సూచన జయసుధ, నితిన్ లు నాలుగు రోజుల క్రితమే తనను కలిశారని తెలిపిన మోహన్ బాబు

జయసుధ భర్త నితిన్ కపూర్ ఆర్థిక ఇబ్బందులతోనే ఆత్మహత్య చేసుకున్నారని కథనాలు వచ్చిన నేపథ్యంలో.. మోహన్‌బాబు మరో సంచలన ప్రకటన చేశారు. ఆయనది ఆత్మహత్య కాదని, అనుమానాస్పద స్థితిలోనే మరణించారని మోహన్‌బాబు ప్రకటించారు. వాస్తవాలేంటో తెలుసుకుని కథనాలు రాయాలని మీడియాకు ఆయన విజ్ఞప్తి చేశారు.

 

ఆర్థిక ఇబ్బందులతోనే నితిన్ కపూర్ ఆత్మహత్య చేసుకున్నారంటూ ఎలా రాస్తారంటూ ఆయన ప్రశ్నించారు. నితిన్ మృతిపై వస్తున్న కథనాలు జయసుధ కుటుంబాన్ని ఆవేదనకు గురిచేస్తున్నాయని ఆయన అన్నారు. నితిన్ మృతికి స్పష్టమైన కారణాలు తెలిసేదాకా అనుమానాస్పద మృతిగానే కథనాలు రాయాలని మీడియాకు విజ్ఞప్తి చేశారు.

 

‘‘జయసుధ నా సోదరి. నితిన్ మరణంపై ఎవరికిష్టం వచ్చినట్టు వారు మాట్లాడడం సరికాదు. నితిన్ మరణానికి కారణం ఇంకా తెలియదు. ఆర్థిక కారణాలే ఆయనను ఆత్మహత్య చేసుకునేందుకు పురిగొల్పాయనడం అబద్ధం. ఆ కుటుంబం ఆర్థికంగా బాగా స్థిరపడింది. ఇకనైనా ఆ కథనాలు ఆపితే బాగుంటుంది. ఆయన మరణాన్ని అనుమానాస్పద మృతిగానే పరిగణించాలి’’ అని మోహన్ బాబు స్పష్టం చేశారు. కాగా, నాలుగు రోజుల క్రితమే జయసుధ, నితిన్ తమ ఇంటికి వచ్చారని మోహన్ బాబు చెప్పారు. నితిన్ ఆరోగ్యం గురించి వాకబు చేశానని, ఓ సినిమా తీయబోతున్నట్టు నితిన్ తనతో చెప్పాడని, ఆ చిత్రంలో రెమ్యునరేషనే లేకుండా ఓ గెస్ట్ రోల్ చేసేందుకు ఒప్పుకొన్నానని మోహన్ బాబు తెలిపారు.

PREV
click me!

Recommended Stories

5000 తో ఫిల్మ్ ఇండస్ట్రీకి వచ్చింది, ప్రస్తుతం 5 నిమిషాలకు 3 కోట్లు వసూలు చేస్తున్న హీరోయిన్ ఎవరో తెలుసా?
Actor Sivaji: మహిళా కమిషన్‌ దెబ్బకి దిగొచ్చిన శివాజీ.. స్త్రీ అంటే మహాశక్తితో సమానం అంటూ క్షమాపణలు