జున్ను తో బాధ పడుతున్న అఖిల్ అక్కినేని

Published : Mar 15, 2017, 10:55 AM ISTUpdated : Mar 25, 2018, 11:37 PM IST
జున్ను తో బాధ పడుతున్న అఖిల్ అక్కినేని

సారాంశం

త్వరలోనే అఖిల్ అక్కినేని సినిమా ప్రారంభం విక్రమ్ కుమార్ కథకు ఓకే చెప్పిన అఖిల్, నాగ్ ఏప్రిల్ లో పట్టాలెక్కనున్న ఈ మూవీ టైటిల్ పై రచ్చ జున్ను అనే టైటిల్ రిజిస్టర్ చేయించిన దర్శకుడు విక్రమ్

లాంచింగ్ సినిమాతోనే ఫ్లాప్ చవిచూసిన అఖిల్... ఆ సినిమా టైటిల్ కూడా ఆఖిల్ అని పెట్టుకున్నా నిరాశ తప్పలేదు. దాంతో రెండో సినిమా ఎలాగోలా... రీ లాంచ్ సినిమాగా చెప్పుకుంటూ చాలా కాలంగా కాలం వెళ్ల దీశాడు. అలా కథలు వింటూ వింటూ.. చివరికి మనం దర్శకుడు విక్రమ్ కుమార్ చెప్పిన కథకు ఓకే చెప్పాడు. నేడో రేపో ప్రారంభోత్సవం కూడా జరగబోతోంది. అయితే ఇప్పుడు అంతా ఓకే అయ్యాక... అఖిల్ ను మరో టెన్షన్ వెంటాడుతోంది. అసలె పెళ్లి తంతు రకరకాల ట్విస్ట్ లతో కన్ఫ్యూజన్ లో పడిన తరుణంలో... మరో టెన్షన్ తో అక్కినేని అఖిల్ తల పట్టుకుంటున్నాడట.

 

ఏడాదిన్నర విరామం తర్వాత ఎట్టకేలకు మళ్లీ అఖిల్‌ కెమెరా ముందుకి వెళ్తున్నాడు. మనం, 24 చిత్రాల దర్శకుడు విక్రమ్‌ కుమార్‌ డైరెక్షన్‌లో రూపొందే అఖిల్‌ రెండవ చిత్రం కోసం 'జున్ను' అనే టైటిల్‌ పరిశీలనలో వున్నట్టు ప్రచారం జరుగుతోంది.  అధికారిక సమాచారం లేకపోయినప్పటికీ 'జున్ను' టైటిల్‌పై విక్రమ్‌ కుమార్‌ పట్టు పట్టినట్టు తెలుస్తోంది. అయితే ఈ టైటిల్‌ లీక్‌ అయిన దగ్గర్నుంచి సోషల్‌ మీడియాలో జున్నును విమర్శించే జూజూలు ఎక్కువయ్యారు. 'జున్నా... పెరుగేం కాదు?' అంటూ గేలి చేస్తున్న వారు తయారయ్యారు. అక్కినేని అభిమానులు సైతం ఈ టైటిల్‌కి నెగెటివ్‌గానే రియాక్ట్‌ అవుతున్నారు. ఇదేం టైటిల్ అంటున్న అఖిల్‌ ఫ్యాన్స్ ఈ టైటిల్ వద్దంటూ ట్విట్టర్లో వేలాదిగా సందేశాలు పంపుతున్నారు.



ఇంత నెగెటివ్‌ ఫీడ్‌బ్యాక్‌ చూసి అఖిల్‌ క్యాంప్‌ వర్రీ అవుతోందట. ఈ టైటిల్‌ వద్దని విక్రమ్‌కి నచ్చచెప్పేందుకు ప్రయత్నిస్తోందట. ఏదైనా క్లాసీ టైటిల్‌ అయితే బాగుంటుందని సూచించిందట. కానీ తన సినిమా టైటిల్స్‌ షార్ట్‌ అండ్‌ 'స్వీట్‌'గా వుండాలని కోరుకునే విక్రమ్ ఇంతవరకు అతని సినిమాల టైటిల్స్‌ అన్నీ రెండక్షరాలో రెండు నంబర్లో ఉండేలా చూసుకున్నాడు. మరి ఈ 'జున్ను' టైటిల్‌ అతనికి ఎందుకంత టేస్టీగా అనిపిస్తుందో తెలీదు కానీ దీనికంటే బెటర్‌ అండ్ సింపుల్‌ టైటిల్‌ చూడమని అతన్ని బతిమాలుతున్నారట.

PREV
click me!

Recommended Stories

5000 తో ఫిల్మ్ ఇండస్ట్రీకి వచ్చింది, ప్రస్తుతం 5 నిమిషాలకు 3 కోట్లు వసూలు చేస్తున్న హీరోయిన్ ఎవరో తెలుసా?
Actor Sivaji: మహిళా కమిషన్‌ దెబ్బకి దిగొచ్చిన శివాజీ.. స్త్రీ అంటే మహాశక్తితో సమానం అంటూ క్షమాపణలు