సౌందర్య కోట్ల ఆస్తిని సొంతం చేసుకున్న మోహాన్ బాబు ..?

By Mahesh Jujjuri  |  First Published Oct 1, 2024, 9:06 PM IST

ఎంతో భవిష్యత్తు ఉన్నా.. చాలా చిన్న వయస్సులో మరణించింది హీరోయిన్ సౌందర్య. కోట్ల ఆస్తిని సంపాధించినా..  అది అనుభవించకుండానే తిరిగిరానిలోకాలకు వెళ్ళిపోయింది. 


సినీ నటి సౌందర్య చిన్న వయస్సులోనే విషాదకరమైన హెలికాప్టర్ ప్రమాదంలో మరణించారు. ఆమె అకాల మరణం ఆమె కోట్ల ఆస్తులను ఎవరు వారసత్వంగా పొందారనే ప్రశ్నలను లేవనెత్తింది.

సావిత్రి తరువాత తెలుగు పరిశ్రమకు దొరికిన ఆణిముత్యంలాంటి  హీరోయిన్ సౌందర్య.  హీరోయిన్ గా ఎంతో పేరు తెచ్చుకున్నఈమె తెలుగు, తమిళ, కన్నడ, హిందీ  భాషల్లో  ఎన్నో సినిమాల్లో నటించి మెప్పించింది. దాదాపు అందరు స్టార్ హీరోల సరసన ఆమె నటించింది. 

Latest Videos

తెలుగులో ఆమెను సావిత్రిలానే ఆదరించేవారు. ఏమాత్రం ఎక్స పోజింగ్ లేకుండా.. వల్గర్ గా డ్రెస్ లు వేసుకోకుండా చాలా పద్దతిగా ఉంటూ స్టార్ డమ్ అందుకున్న ఏకైక హీరోయిన సౌందర్య. నాలుగు భాషల్లో ఎన్నో సినిమాలు చేసిన ఆమె కోట్లకు కోట్లు ఆస్తులు కూడా కూడబెట్టినట్టు తెలుస్తోంది. 

ఇక రాజకీయాల్లోకి వెళ్ళిన సౌందర్య హెలికాప్టర్ ప్రమాదంలో మరణించారు. అయితే ఆమె అప్పటికే కోట్లకు కోట్లు సంపాదించగా.. సౌందర్య ఆస్తిని ఆమె భర్త తీసుకుని.. రెండో పెళ్ళి చేసుకున్నట్టు తెలుస్తోంది. అంతే కాదు అతనిపై లీగర్ లో కేసు వేసి..సౌందర్య తల్లీ తండ్రులు ఆస్తిని మళ్లీ దక్కించుకున్నట్టు సమాచారం. 

ఇక సౌందర్య ఆస్తిలో భాగంగా..హైదరాబాద్ లోని శంషాబాద్ ఏరియాలో 6 ఎకరాల వరకూ కొన్నిందట సౌందర్య. వాటిని తన తల్లీ తండ్రుల పేరు మీద రాసిందట. అయితే ఇప్పుడు ఆ ఆస్తి కోట్ల విలువ చేస్తుంది. వందల కోట్లు ఉంటుంది. అయితే ఆశ్చర్య కరంగా  ఆ ఆస్తి ఇప్పుడు టాలీవుడ్ సీనియర్ నటుడు మోహాన్ బాబు చేతుల్లోకి వచ్చినట్టు తెలుస్తోంది. ఇదేలా సాధ్యం  అని అనుమానం రావచ్చు. అసలేం జరిగిందంటే..ఝ 

సౌందర్య మరణం తరువాత ఆర్ధిక ఇబ్బందుల్లో పడిన ఆమె తల్లీ తండ్రులు ఇక్కడ ఉన్న భూమిని అమ్మారట. ఆ భూమిని మోహాన్ బాబు కొనుక్కున్నట్టు తెలుస్తోంది. ఆ ప్లేస్ లో భారీ స్థాయిలో ఆయన ఇల్లు కట్టుకున్నారు. మంచు టౌన్ షిప్ పేరుతో నిర్మించిన ఆ ఇంట్లోనే ఆయన ఉంటున్నారు. 

అయితే ఈ ప్లేస్ ను నిజంగా సౌందర్య ఫ్యామిలీ దగ్గర నుంచి ఆయన కొన్నారా లేదా అనేదానిపై క్లారిటీ లేదు కాని..ఫిల్మ్ ఇండస్ట్రీలో టాక్ మాత్రం నడుస్తోంది. 

సౌందర్య మరణం

అవ్వడానికి కన్నడ అమ్మాయి అయినా.. అచ్చతెలుగు ఆడపడుచులా ఉంటుంది సౌందర్య. ఆమె ఎక్కువ సినిమాలు చేసింది కూడా తెలుగులోనే. హీరోయిన్ గా అవకాశాలు తగ్గిపోతున్న టైమ్ లో ఆమె రాజాకీయాల వైపు అడుగులు వేసింది. బీజేపీ పార్టీలో చేరింది. ఆతరువాత పార్టీకి ప్రాచారం చేయాలని బెంగళూరు నుంచి హెలికాప్టర్ లో బయలు దేరింది సౌందర్య. అప్పుడు జరిగిన ప్రమాదంలోనే ఆమె మరణించింది. 

సౌందర్య హెలికాప్టర్ ఎక్కి.. అది పైకి ఎగరగానే వెంటనే పేలిపోయి కుప్పకూలిపోయింది. దాంతో అందులో ప్రయాణిస్తున్న సౌందర్యతో పాటు.. ఆమె సోదరుడు కూడా అందులోనే కాలిపోయారు. 2004 లో జరిగిన ఈ సంఘటన.. 20 ఏళ్ళు అవుతుననా.. ఇప్పటికీ ఆమె అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. 

అంతే కాదు సౌందర్య చనిపోయే నాటికి ఆమె 3 నెలల గర్భవతి. చాలా చిన్న వయస్సులోనే ఎంతో స్టార్ డమ్ ను చూసిన ఆమె.. 27 ఏళ్ళ అతి చిన్న వయస్సులోనే మరణించడం అభిమానులు మర్చిపోలేకపోతున్నారు. టాలీవుడ్ నుంచి సౌందర్య మరణం తట్టుకోలేక హీరోవెంకటేష్ , మోహన్ బాబులాంటి హీరోలు బోరున విలపించారు. 

సౌత్ స్క్రీన్ పై సౌందర్య వెలుగులు

అందమైన చిరునవ్వుతో అభిమానులను ఆకర్షించిన నటి సౌందర్య. బెంగళూరుకు చెందిన ఆమె కన్నడ కుటుంబంలో పుట్టి పెరిగింది.  1972లో జన్మించిన సౌందర్య కన్నడ సినిమాల్లో నటిస్తూ.. టాలీవుడ్  అవకాశాలు సాధించింది. తెలుగులో తిరుగులేని హీరోయిన్ గా వెలుగు వెలిగింది. సౌత్ ఇండస్ట్రీని ఏలిన నటి సౌందర్య. 

తెలుగు, తమిళ భాషల్లో స్టార్ హీరోయిన్ గా ఎదిగిన ఆమె.. దక్షిణ భారత భాషలలో వెలుగు వెలిగింది.  90వ దశకంలో సౌత్ ఇండియన్ సినిమాకు స్టార్ హీరోలుగా ఉన్న  చిరంజీవి, రజనీకాంత్, కమల్ హాసన్, మోహాన్ లాల్, వెంకటేష్,  నాగార్జున, లతో పాటు శ్రీకాంత్, జగపతిబాబులాంటి స్టార్స్ తో కూడా ప్యామిలీ మూవీస్ లో నటించి మెప్పించింది. 

అదేవిధంగా సౌందర్య తన 20 ఏళ్ల స్క్రీన్ కెరీర్‌లో సౌత్ ఇండియా టాప్ నటిగా ఎదిగింది. సౌత్ లో మాత్రమే కాదు.. అటు  బాలీవుడ్‌లో అమితాబ్ బచ్చన్ సరసన సూర్యవంశ్ సినిమాలో దేవయాని పాత్రను పోషించింది. అమితాబ్ బచ్చన్ సరసన నటించి అందరి దృష్టిని ఆకర్షించింది. తెలుగులో ఆ సినిమా పెద్ద హిట్ అవ్వడంతో హిందీ సినిమాల్లో నటించే అవకాశాలు వచ్చాయి. 

click me!