నాకెందుకు అమ్మాయిలు పడటం లేదు, నాగబాబు ఆవేదన, లవ్‌ స్టోరీ బయటపెట్టిన మెగా బ్రదర్‌

By Aithagoni Raju  |  First Published Oct 1, 2024, 7:57 PM IST

నాగబాబు టీనేజ్‌ లవ్‌ స్టోరీ బయటపెట్టాడు. వన్‌ సైడ్‌ లవ్‌ తో అమ్మాయిలను ఎంతగా ఆరాధించే వాడో తెలిపాడు. కానీ తనని ఎవరూ చూసేవాళ్లు కాదని ఆవేదన వ్యక్తం చేశాడు. 
 


మెగా బ్రదర్‌ నాగబాబు బోల్డ్. ఏదున్న మొహం మీదే అంటారు. మనసులో ఏదీ దాచుకోరు. మెగా ఫ్యామిలీపై ఎవరైనా ఎటాక్‌ చేస్తే, విమర్శలు చేస్తే వాళ్లకి గట్టిగా సమాధానం చెప్పేది నాగబాబే. ఓ రకంగా మెగా ఫ్యామిలీకి రిప్రజెంట్‌గా వ్యవహరిస్తారు. చిరంజీవి ఆచితూచి మాట్లాడుతుంటారు. హుందాగా వ్యవహరిస్తారు. ఇక పవన్‌ కళ్యాణ్‌ కొన్నిసార్లు రెచ్చిపోయి కామెంట్లు చేస్తారు. కొన్ని సార్లు అసలే పట్టించుకోరు. ఇప్పుడు రాజకీయాల్లోకి వెళ్లాక అన్ని రకాలుగా ఆయనే ముందుంటున్నారు. తన సత్తా చాటుతున్నారు. డిప్యూటీ సీఎంగా బిజీగా ఉంటున్నా విషయం తెలిసిందే. 

బిగ్‌ బాస్‌ తెలుగు 8 ఇంట్రెస్టింగ్ అప్‌ డేట్స్ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

నాగబాబు బయటపెట్టిన రహస్యాలు..

Latest Videos

అయితే ఇవన్నీ పక్కన పెడితే మెగా బ్రదర్స్ లో జోవియల్‌గా ఉండే వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది నాగబాబే. ఏదైనా నిర్మొహమాటంగా చెప్పేస్తారు. అందరితోనూ జోక్ చేస్తారు, విమర్శలు చేస్తారు. అంతలోనే కలిసిపోతారు. పెద్దగా సీరియస్‌గా తీసుకోరు. అందుకే ఎప్పుడూ నవ్వుతూ కనిపిస్తారు. ఏదైనా ప్రెస్‌ మీట్‌లో పాల్గొన్న ఆయన సరదాగానే సమాధానం చెబుతుంటారు. ఈ క్రమంలో తనకు సంబంధించి ఇప్పటి వరకు బయటకు రాని ఓ రహస్యాన్ని బయటపెట్టాడు నాగబాబు. తన టీనేజ్‌ రోజులను గుర్తు చేసుకున్నారు. తాను చేసిన కొంటెపనులను బయటపెట్టాడు. ముఖ్యంగా అమ్మాయిల విషయంలో తన వన్‌ సైడ్‌ లవ్‌ స్టోరీని బయటపెట్టాడు నాగబాబు. 

నాగబాబు వన్‌ సైడ్‌ లవ్‌ స్టోరీ..

నాగబాబు.. చిన్నప్పుడు అమ్మాయిలను ఎంతగానో ఆరాధించేవాడట. ఓ మోటుగా ఇష్టపడేవాళ్లమని, కానీ తనకు ఒక్క అమ్మాయి కూడా పడలేదని తెలిపారు. కనీసం తనవైపు కూడా చూసేవాళ్లు కాదని చెప్పాడు నాగబాబు. మరీ తానేం బాగా లేకుండా లేను కాదా, ఎందుకు పడటం లేదని బాధపడేవాళ్లట. అయితే తనకు అమ్మాయిలు పడేవాళ్లు కాదని, కానీ వాళ్లు ఇష్టపడే అబ్బాయిలు మాత్రం అంత బాగా ఉండేవాళ్లు కాదు, వాళ్ల ప్రేమలో ఎలా పడ్డారబ్బా అనే జెలసీ ఉండేదట.

తాను మాత్రం అమ్మాయిలను ఎంతో బాగా ఆరాధించేవాళ్లమని, మనసులోనే కొలుచుకునేవాళ్లమని, కానీ ఆ ప్రేమని వ్యక్తం చేసే ధైర్యం ఉండేది కాదని తెలిపారు నాగబాబు. వాళ్లు వెనక్కి తిరిగి చూస్తే పరిగెత్తుకుని పారిపోయేవాళ్లమని, అంత టెన్షన్‌గా భయంగా ఉండేదని తెలిపారు నాగబాబు. మనదంతా వన్‌ వే ట్రాక్‌ అని, అటు వైపు నుంచి రియాక్షన్స్ లేవని చెప్పారు. తన భగ్న ప్రేమని వెల్లడించారు. 

నాగబాబు చేసిన కొంటె పనులు..

అంతేకాదు ఆ టైమ్‌లో చేసిన కొన్ని కొంటెపనులను కూడా బయటపెట్టాడు నాగబాబు. టీనేజ్‌లో చాలా అల్లరిగా ఉండేవాడట. నెల్లూరులో లీలా మహల్‌ థియేటర్‌లో ఇంగ్లీష్‌ సినిమాలు బాగా ఆడేవట. వాటిని చూసేందుకు ఎక్కువగా ఇష్టపడేవాళ్లమని, అలా ఫ్రెండ్స్ తో ఎక్కువగా ఆ సినిమాలు చూసేవాళ్లమని తెలిపారు నాగబాబు. అయితే ఎప్పుడైనా తమ ఫ్రెండ్స్ చూడనప్పుడు వాళ్లని కావాలని ఇరికించేవాళ్లట. కొన్ని సినిమాలు బాగుండేవి కావని, అలాంటివి చూసినప్పుడు వాళ్లని కూడా ఇరికించాలని చెప్పి, సినిమా అద్భుతంగా ఉంది.

ప్రారంభం నుంచి ఎండింగ్‌ వరకు సూపర్‌ గా ఉందని చెప్పేవాడట. దీంతో వాళ్లు కూడా సినిమాకి వెళ్లేవాళ్లట. ఆ తర్వాత వచ్చి తమని తిట్టేవాళ్లని, అదంతా సరదాగా సాగిపోయేదని తెలిపారు. అంతేకాదు తన ఫ్రెండ్స్ లో ఒకరు కమల్ హాసన్‌ లా బాగా డాన్స్ చేసేవాడట. తమకు డాన్స్ చేయడం రాదు. ఆ జెలసీగా వాళ్ల డాన్స్ ని చెడగొట్టేవాళ్లమని, మధ్యలోనే దిగిపోయేంతటి తప్పుడు పనులు చేసేవాళ్లమని తెలిపారు నాగబాబు. తన కూతురు నిహారిక నిర్మించిన `కమిటీ కుర్రోళ్లు` సినిమా 50 రోజుల సక్సెస్‌ సెలబ్రేషన్‌లో గెస్ట్ గా పాల్గొన్న ఆయన ఈ విషయాలను పంచుకున్నారు. 

నాగబాబునే కాదు, చిరంజీవి కూడా..

ఇదిలా ఉంటే ఆ మధ్య చిరంజీవి కూడా ఇలాంటి అనుభవాలే పంచుకున్నాడు. టీనేజ్‌ టైమ్‌లో తాను కూడా అమ్మాయిలకు లైనేసేవాడని, కానీ అమ్మాయిలు వారిని పట్టించుకునేవాళ్లు కాదని తెలిపారు. రేగిపండ్ల కోసం వస్తే, ఆ పక్కనే తాము కొలను స్నానాలు చేసేవాళ్లమని, ఓ రోజు నాగబాబుని తీసుకుని వెళ్లాడట. అమ్మాయిలు కనిపించగానే వాళ్లని చూస్తూ ఉండిపోయానని, దీంతో నాగబాబు నీళ్లల్లో దూకి రెండు సార్లు మునిగిపోయాడని,

సడెన్‌గా చూసేసరికి మునిగిపోతున్నాడని దీంతో వెంటనే దూకి అతన్ని తీసుకొచ్చా అని చెప్పాడు. అంతేకాదు బస్సుల్లోనే లైన్‌ వేసేవాళ్లమని కానీ ఎవరూ పడేవాళ్లు కాదని చెప్పాడు. ఇలా అన్నదమ్ముల విషయంలో ఇదే జరిగింది. కానీ పవన్‌ విషయంలో మాత్రం భిన్నంగానే జరిగింది. సినిమాల్లోకి వచ్చాక ఆయన రెండు సార్లు ప్రేమలో పడ్డారు. పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. 

ఒకప్పుడు నటుడిగా బిజీగా ఉన్న నాగబాబు ఇప్పుడు అన్నీ తగ్గించాడు. మొన్నటి వరకు రాజకీయాల్లో బిజీగా ఉన్నారు. ఇప్పుడు చాలా సెలక్టీవ్‌గా సినిమాలు చేస్తున్నారు. బలమైన పాత్రలు వస్తే సినిమాల్లో నటిస్తున్నారు. టీవీ షోస్‌లో మెరుస్తున్నారు. ప్రస్తుతం జనసేన తరఫ న్యూస్‌ ఛానెల్‌ని నడిపించే పనిలో బిజీగా ఉన్నట్టు తెలుస్తుంది. 
 

click me!