ఆయన నా మాటలు మెచ్చుకునేవారు.. వాజ్‌పేయి మరణంపై మోహన్ బాబు!

Published : Aug 16, 2018, 07:05 PM ISTUpdated : Sep 09, 2018, 11:32 AM IST
ఆయన నా మాటలు మెచ్చుకునేవారు.. వాజ్‌పేయి మరణంపై మోహన్ బాబు!

సారాంశం

దివంగత మాజీ ముఖ్యమంత్రి వాజ్‌పేయి అనారోగ్యంతో తుదిశ్వాస విడిచిన సంగతి తెలిసిందే

దివంగత మాజీ ముఖ్యమంత్రి వాజ్‌పేయి అనారోగ్యంతో తుదిశ్వాస విడిచిన సంగతి తెలిసిందే. మూత్రనాళాల ఇన్ఫెక్షన్, బ్రీతింగ్ సమస్యలతో కొంతకాలంగా చికిత్స పొందుతున్న ఆయన గురువారం కన్నుమూశారు.

వాజ్‌పేయితో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ నటుడు మోహన్ బాబు సోషల్ మీడియా వేదికగా ఓ పోస్ట్ పెట్టారు. మోహన్ బాబు ఎంపీగా ఉన్నప్పుడు వాజ్‌పేయితో కలిసి పని చేశారు. ''వాజ్‌పేయి నిస్వార్థమైన రాజకీయ నాయకుడు. ఆయనతో కలిసి మూడు సార్లు వేదిక పంచుకునే అవకాశం దొరికింది. నా మాటలను ఆయన మెచ్చుకునేవారు. వాజ్‌పేయి గారు, విద్యాసాగర్ రావు, నేను కలిసి పని చేశాం.

ఆయన ప్రధాన మంత్రిగా ఉన్నప్పుడు నేను రాజ్యసభ సభ్యుడిగా విధులు నిర్వర్తించాను. ఆయనలాంటి వ్యక్తిత్వం ఉన్న వారు రాజకీయాల్లో అరుదు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నాను' అని అన్నారు. 

PREV
click me!

Recommended Stories

Gunde Ninda Gudi Gantalu Today ఎపిసోడ్ డిసెంబర్ 16 బాలుని సవతి తల్లిలా చూశాను... ప్రభావతిలో మొదలైన పశ్ఛాత్తాపం
Regina Cassandra: ముస్లింగా పుట్టి క్రిస్టియన్ పేరు ఎందుకు పెట్టుకుందో చెప్పేసిన రెజీనా