నా మిత్రుడు చిరంజీవి నటించిన సినిమా.. సైరాపై మోహన్ బాబు కామెంట్!

Published : Oct 01, 2019, 07:38 PM ISTUpdated : Oct 01, 2019, 07:42 PM IST
నా మిత్రుడు చిరంజీవి నటించిన సినిమా.. సైరాపై మోహన్ బాబు కామెంట్!

సారాంశం

సైరా నరసింహారెడ్డి రిలీజ్ ఫీవర్ తో తెలుగు రాష్ట్రాల్లోని సినీ అభిమానులు ఊగిపోతున్నారు. మెగాస్టార్ చిరంజీవి నటించిన సైరా చిత్రం అక్టోబర్ 2న ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే. తొలి తెలుగు స్వాతంత్ర సమరయోధుడు ఉయ్యాలవాడ జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన చిత్రం ఇది. 

చిరంజీవి నటించిన సైరా నరసింహారెడ్డి చిత్రం విడుదల సందర్భంగా సోషల్ మీడియా మోతెక్కుతోంది. తెలుగు రాష్ట్రాల్లో సైరా సంబరాలు అంబరాన్ని అంటుతున్నాయి. ఇదిలా ఉండగా సైరా చిత్ర యూనిట్ కు శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలెబ్రిటీలు ఒక్కొక్కరుగా స్పందిస్తున్నారు. 

తాజాగా సీనియర్ నటుడు మోహన్ బాబు సైరా చిత్రయూనిట్ కి శుభాకాంక్షలు తెలియజేసారు. ' నా మిత్రుడు చిరంజీవి నటించిన చిత్రం సైరా. చిరంజీవి కుమారుడు రాంచరణ్ అత్యధిక వ్యయంతో ఈ చిత్రాన్ని నిర్మించారు. సైరా చిత్రం ఘనవిజయం సాధించి డబ్బుతో పాటు పేరు ప్రఖ్యాతలు కూడా తీసుకురావాలని కోరుకుంటున్నట్లు మోహన్ బాబు ట్వీట్ చేశారు. 

దర్శకుడు సురేందర్ రెడ్డి తెరకెక్కించిన ఈ చిత్రం మరికొద్ది సేపట్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. రాంచరణ్ ఈ చిత్రాన్ని దాదాపుగా 250 కోట్ల బడ్జెట్ లో నిర్మించారు. అమితాబ్ బచ్చన్, తమన్నా, విజయ్ సేతుపతి, కిచ్చా సుదీప్, నయనతార నటించిన ఈ చిత్రంపై సౌత్ తో పాటు నార్త్ లో కూడా భారీ అంచనాలు ఉన్నాయి. 

PREV
click me!

Recommended Stories

Christmas Movies: క్రిస్మస్‌ కానుకగా విడుదలయ్యే సినిమాలివే.. కుర్రాళ్లతో శివాజీ ఫైట్‌.. ఒకేరోజు జాతరే
అమ్మాయిల దుస్తులపై శివాజీ వల్గర్ కామెంట్స్...చిన్మయి, అనసూయ స్ట్రాంగ్ కౌంటర్