సైరా రిలీజ్: హంగామా షురూ.. సైరా కటౌట్ కు స్పెషల్ డిజైన్!

By tirumala ANFirst Published Oct 1, 2019, 7:12 PM IST
Highlights

సైరా నరసింహారెడ్డి రిలీజ్ ఫీవర్ తో తెలుగు రాష్ట్రాల్లోని సినీ అభిమానులు ఊగిపోతున్నారు. మెగాస్టార్ చిరంజీవి నటించిన సైరా చిత్రం అక్టోబర్ 2న ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే. తొలి తెలుగు స్వాతంత్ర సమరయోధుడు ఉయ్యాలవాడ జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన చిత్రం ఇది. ఇలాంటి చారిత్రాత్మక నేపథ్యం ఉన్న చిత్రంలో చిరంజీవి నటించడంతో కనీవినీ ఎరుగని అంచనాలు ఉన్నాయి. 

దేశవ్యాప్తంగా, ఆ మాటకొస్తే ప్రపంచ వ్యాప్తంగా సైరా రిలీజ్ సంబరాలు మొదలయ్యాయి. మెగాస్టార్ చిరంజీవి నటించిన చిత్రం రిలీజవుతుంటే హంగామా ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో, చెన్నై, బెంగుళూరు లాంటి ప్రధాన నగరాల్లో, యూఎస్, దుబాయ్ లాంటి ప్రాంతాల్లో ఇలాంటి హంగామానే కనిపిస్తోంది. 

థియేటర్స్ వద్ద ఫ్యాన్స్ సందడి చేస్తున్నారు. హైదరాబాద్ లోని  సుదర్శన్ థియేటర్ వద్ద బెంగుళూరు నుంచి వచ్చిన మార్టిన్ అండ్ టీం కర్ణాటక స్టైల్ లో మెగాస్టార్ చిరంజీవి కటౌట్ కు పూలమాల అలంకరణ చేసారు. ఈ డిజైన్ అందరిని ఆకర్షిస్తోంది. 

దుబాయ్, యూఎస్, తెలుగురాష్ట్రాలలో కొన్ని ప్రాంతాల్లో మరికొన్ని గంటల్లో సైరా షోలు ప్రారంభం కానున్నాయి. 

click me!