ఎన్టీఆర్ కి నేనే మేకప్ చేశా: మోహన్ బాబు

Published : Dec 24, 2018, 02:07 PM IST
ఎన్టీఆర్ కి నేనే మేకప్ చేశా: మోహన్ బాబు

సారాంశం

దివంగత నందమూరి తారక రామారావుతో సీనియర్ హీరో మోహన్ బాబుకి ఉన్న అనుబంధం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వీరిద్దరూ కలిసి కొన్ని సినిమాలలో నటించారు. 

దివంగత నందమూరి తారక రామారావుతో సీనియర్ హీరో మోహన్ బాబుకి ఉన్న అనుబంధం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వీరిద్దరూ కలిసి కొన్ని సినిమాలలో నటించారు. మోహన్ బాబు బ్యానర్ లో నిర్మించిన 'మేజర్ చంద్రకాంత్' సినిమాలో ఎన్టీఆర్ నటించిన సంగతి తెలిసిందే.

అప్పటి అనుభవాలను గుర్తు చేసుకున్న మోహన్ బాబు సోషల్ మీడియా వేదికగా ఓ పోస్ట్ పెట్టాడు. అందులో ఏముందంటే.. ''మేజర్ చంద్రకాంత్ సినిమాలోని పుణ్యభూమి నాదేశం పాటలో అన్నగారు చాలా గెటప్పుల్లో కనిపిస్తారు.

ఆయన పర్సనల్ మేకప్ మ్యాన్ తప్ప ఎవరు మేకప్ వేసేవారుకాదు. అలాంటిది నేను వేశాను. ప్రతి గెటప్ లోను అన్నగారు విత్ మేకప్ 7 గం||లకు లొకేషన్ లో ఉండేవారు. అంతటి గొప్ప నటుడు అన్నగారు'' అంటూ రాసుకొచ్చాడు. ఇటీవల హైదరాబాద్ లో జరిగిన 'ఎన్టీఆర్' బయోపిక్ ఆడియో లాంచ్ కార్యక్రమానికి అతిథిగా విచ్చేశారు మోహన్ బాబు.

ఈ సందర్భంగా ఆయన ఎన్టీఆర్ గురించి ఎన్నో విషయాలను అభిమానులతో పంచుకున్నారు. ఈ క్రమంలో ఆయన దర్శకుడు క్రిష్ ని ఉద్దేశిస్తూ ఈ బయోపిక్ లో చెడ్డవాళ్లను కూడా మంచి క్యారెక్టర్స్ చేసావో.. ఎవరిని ఎలా చూపించావో నాకు తెలియదు అంటూ చేసిన కామెంట్స్ ఆసక్తికరంగా మారాయి. 

PREV
click me!

Recommended Stories

2025 Box office దగ్గర సునామీ సృష్టించిన చిన్న సినిమాలు, తక్కువ బడ్జెట్ ఎక్కువ కలెక్షన్స్
Mahesh Babu పిల్లలు కింద పడి మరీ నవ్విన వెంకటేష్ సినిమా? ఆ డైరెక్టర్ కు వెంటనే ఛాన్స్ ఇచ్చిన సూపర్ స్టార్