నాని `వి` సినిమాపై కోర్ట్ కెక్కిన సాక్షి మాలిక్‌.. ఆ సన్నివేశం తొలగించాల్సిందే..

Published : Mar 03, 2021, 08:12 PM IST
నాని `వి` సినిమాపై కోర్ట్ కెక్కిన సాక్షి మాలిక్‌.. ఆ సన్నివేశం తొలగించాల్సిందే..

సారాంశం

నాని నటించిన `వి` సినిమాపై కోర్ట్ కి ఎక్కింది మోడల్‌ సాక్షి మాలిక్‌. తన అనుమతి లేకుండా సెక్స్ వర్కర్‌ ఫోటోగా తనని ఫోటోని వాడుకోవడంపై ఆమె అభ్యంతరం వ్యక్తం చేశారు. నాని, సుధీర్‌బాబు హీరోలుగా ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో `వి` చిత్రం రూపొందిన విషయం తెలిసిందే.

నాని నటించిన `వి` సినిమాపై కోర్ట్ కి ఎక్కింది మోడల్‌ సాక్షి మాలిక్‌. తన అనుమతి లేకుండా సెక్స్ వర్కర్‌ ఫోటోగా తనని ఫోటోని వాడుకోవడంపై ఆమె అభ్యంతరం వ్యక్తం చేశారు. నాని, సుధీర్‌బాబు హీరోలుగా ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో `వి` చిత్రం రూపొందిన విషయం తెలిసిందే. అదితి రావు హైదరీ, నివేదా థామస్‌ హీరోయిన్లుగా నటించారు. ఈ సినిమా గతేడాది సెప్టెంబర్‌లో అమేజాన్‌ ప్రైమ్‌లో విడుదలైంది. 

ఇందులో మొబైల్‌ ఫోన్‌లో కమర్షియల్‌ సెక్స్ వర్కర్‌ ఫోటోని వేరే వ్యక్తికి చూపించే సన్నివేశం ఉంది. ఇందులో తన ఫోటోని వాడారని ఆరోపిస్తుంది సాక్షి మాలిక్‌. అందులో భాగంగానే ఈ హిందీకి చెందిన హాట్‌ మోడల్‌ కోర్ట్ కి ఎక్కారు. బాంబే కోర్ట్ లో పరువు నష్టం దావా చేయగా, దీనిపై స్పందించిన కోర్ట్ `వి` చిత్రం స్ట్రీమింగ్‌ అవుతున్న ఓటీటీ ఫ్లాట్‌ఫామ్‌కి ఆదేశాలు జారీ చేసింది. అనుమతి లేకుండా వేరే వ్యక్తుల ఫోటోలను, ముఖ్యంగా ప్రైవేట్‌ ఇమేజ్‌ని ఉపయోగించడం చట్ట విరుద్ధమని, ఇలా వాడితే వారి పరువుకు నష్టం కలిగించడమే అవుతుందని పేర్కొంది. సాక్షి మాలిక్‌ అభ్యంతరం తెలిపిన సన్నివేశాలను తొలగించాలని ఆదేశించింది. 

సన్నివేశాలు డిలీట్‌ చేసిన తర్వాతనే సినిమాని తిరిగి అప్‌లోడ్‌ చేయాలని నిర్మాణ సంస్థని ఆదేశించింది. అప్‌లోడ్‌ చేసే ముందు సాక్షికి చూపించాలని స్పష్టం చేసింది. ఇప్పటికే ఆ సన్నివేశం తొలగించారు. ఈ సినిమాని దిల్‌రాజు నిర్మించిన విషయం తెలిసిందే. ఇక సాక్షి `సోను కే టిటు కీ స్వీటీ` చిత్రంలో `బామ్‌ డిగ్గీ డిగ్గీ` అనే పాటలో ఆడిపాడి మెస్మరైజ్‌ చేసింది. హాట్‌ ఫోటోలతో సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉంటోంది సాక్షి మాలిక్‌. 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

Bigg Boss telugu 9 బోరుమని ఏడ్చిన రీతూ, బయటకు వెళ్తూ బాంబ్ పేల్చిన కంటెస్టెంట్
ఆలియా భట్ అదిరిపోయే హెయిర్ స్టైల్స్ , ఈ 5 లుక్స్ ట్రై చేశారా ?