ఏనుగుల ఇంట్లో మనుషుల అరాచకం.. `అరణ్య` ట్రైలర్‌..

By Aithagoni RajuFirst Published Mar 3, 2021, 7:31 PM IST
Highlights

అభివృద్ధి పేరుతో జరిగే నిర్మాణాల్లో ప్రకృతి, పర్యావరణ వ్యవస్థనే కాదు జీవరాశులు, అందులో ఏనుగులు కూడా అంతరించిపోతుందని చెప్పే ప్రయత్నమే `అరణ్య`. రానా హీరోగా ప్రభు సోలోమన్‌ ఈ చిత్రాన్ని తెలుగు, తమిళంలో రూపొందిస్తున్నారు. నేడు బుధవారం హైదరాబాద్‌లో ఈ చిత్ర ట్రైలర్‌ని విడుదల చేశారు.

కార్పొరేట్లు వచ్చి పచ్చని అడవి, సహజ సంపదలను దోచుకుంటున్నారు. పర్యవరణాన్ని దెబ్బ తీస్తున్నారు. ముఖ్యం అటవి జంతువులు, జీవరాశుల మనుగడ దెబ్బతినేలా చేస్తున్నారు. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా జరుగుతున్నది ఇదే. అభివృద్ధి పేరుతో జరిగే నిర్మాణాల్లో ప్రకృతి, పర్యావరణ వ్యవస్థనే కాదు జీవరాశులు, అందులో ఏనుగులు కూడా అంతరించిపోతుందని చెప్పే ప్రయత్నమే `అరణ్య`. తమ మనుగడ కోసం ఏనుగులు, ఏనుగుల ప్రేమికుడు చేసే పోరాటం ప్రధానంగా `అరణ్య` సినిమా సాగుతుందని అర్థమవుతుంది. 

రానా హీరోగా ప్రభు సోలోమన్‌ ఈ చిత్రాన్ని తెలుగు, తమిళంలో రూపొందిస్తున్నారు. నేడు బుధవారం హైదరాబాద్‌లో ఈ చిత్ర ట్రైలర్‌ని విడుదల చేశారు. మనుషులకు, అడవి జాతికి మధ్య జరిగే పోరాటం ప్రధానంగా సినిమా రన్‌ అవుతుందని తెలుస్తుంది. ఏనుగుల ప్రేమికుడు, వాటి మనుగడ కోసం మనుషులతో, ప్రభుత్వంతో ఏం విధంగా పోరాటం చేశాడనేది ఆసక్తికరంగా ఉంది. ప్రభుత్వ తీరుని ఇది ఎండగట్టేలాగా, ప్రశ్నించేలాగా ఉంది. విడుదలైన ట్రైలర్‌ ఆద్యంతం ఆసక్తికరంగా సాగుతూ ఆకట్టుకుంటుంది. 

రానా, విష్ణు విశాల్‌, జోయా హుస్సేన్‌ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఏరోస్‌ మోషన్‌ పిక్చర్స్ నిర్మిస్తుంది. మార్చి 26న ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతుంది. ఇందులో ముసలి తాతగా రానా నటన, గెటప్ కట్టిపడేస్తున్నాయి. 
 

click me!