Ram Charan పెళ్లైయ్యిందని వదిలేశాను.. లేకుంటే.. ప్రముఖ మోడల్ బోల్డ్ కామెంట్స్..

Published : Dec 06, 2023, 05:20 PM IST
Ram Charan పెళ్లైయ్యిందని వదిలేశాను.. లేకుంటే.. ప్రముఖ మోడల్ బోల్డ్ కామెంట్స్..

సారాంశం

రామ్ చరణ్ అంటే పిచ్చి అంటోంది ప్రముఖ తెలుగు మోడల్ జ్ఞానేశ్వరి కండ్రేగుల. పదేల్ల క్రితం ఆయన్ను కలిసుంటేనా అంటూ.. ఆమె చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.   

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్  అంటే ఇష్టం, అభిమానం, ప్రేమ లేనివారంటూ ఉండరు. ఆయన్ను యూత్ అంతా ఇష్టపడుతుంటారు. మరి ముఖ్యంగా ఆయనకు అమ్మాయిల్లో ఫాలోయింగ్ ఓ రేంజ్ లో ఉంటుంది. చరణ్ గ్లామర్ కాని, ఫిట్ నెస్ కాని ఆరేంజ్ లో మెయింటేన్ చేస్తుంటారు. ఇక చరణ్ అంటే పడిచచ్చిపోతుంటారు లేడీస్. అందులో సామాన్యుల దగ్గర నుంచి సెలబ్రిటీల వరకూ ఉన్నా. ఇక చరణ్ ఇమేజ్ ఆర్ఆర్ఆర్ తో మరింతగా పెరిగిపోయింది. ఈసినిమాలో సూపర్ లుక్ లో కనిపించి మురిపించారు చరణ్. 

ఇక చరణ్ ను అభిమానించి, ప్రేమించే వారిలో సెలబ్రిటీలు సైతం ఉన్నారు. తాజాగా తనకు చరణ్ అంటే పిచ్చి అంటోంది ప్రముఖ తెలుగు మోడల్ జ్ఞానేశ్వరి కండ్రేగుల. మోడల్ గా కెరీర్ ను స్టార్ట్ చేసి.. ఆతరువాత  నటిగా మారి.. పెళ్లి చూపులు అనే ఓ షోతో మంచి గుర్తింపు తెచ్చుకుంది జ్ఞానేశ్వరి. ఆ తర్వాత పలు సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, కొన్ని చిన్న చిన్న సినిమాల్లో హీరోయిన్ గా మెప్పించింది బ్యూటీ . ప్రస్తుతం సినిమాల్లో, సిరీస్ లలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా దూసుకుపోతుంది. ఇటీవలే మంత్ అఫ్ మధు అనే సినిమాలో మంచి పాత్ర చేసింది చిన్నది. ఇక ఇప్పుడు  నాగచైతన్య నటించిన దూత సిరీస్ లో ఓ క్యారెక్టర్ చేసి ఆడియన్స్ ను అలరించింది. 

 

ఇక దూతకు సబంధించి రకరకాల ప్రమోషన్ వీడియోలు బయటకు రాగా.. తాజాగా జ్ఞానేశ్వరి ఇచ్చిన  ఓ యూట్యూబ్ ఛానల్  ఇంటర్వ్యూ వైరల్ అవుతోంది. ఈ ఇంటర్వ్యూలో  పలు ఆసక్తికర విషయాలని పంచుకుంది తెలుగు బ్యూటీ. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అంటే తను ఎంత ఇష్టమో వెల్లడించింది బ్యూటీ.  గతంలోనే జ్ఞానేశ్వరి.. తాను చరణ్ కి పెద్ద ఫ్యాన్ అని, చిన్నప్పట్నుంచి చరణ్ ఫోటోలు కట్ చేసి పుస్తకంలో అతికించేదాన్ని అని చెప్పింది. తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో దీని గురించి ప్రస్తావిస్తూ.. ఆ పుస్తకం ఇంకా ఉంది. పుస్తకం నిండా చరణ్ ఫోటోలు ఉన్నాయి. ఈ సారి ఇంటర్వ్యూలో ఆ ఫోటోలు ఉన్న పుస్తకం తెచ్చి మొత్తం చూపిస్తాను అని తెలిపింది.

డీప్ ఫేక్ బాధితురాలిగా గ్లోబల్ బ్యూటీ, వైరల్ అవుతోన్న ప్రియాంక చోప్రా వీడియో.

అంతే  కాదు ఇప్పటికప్పుడు  చరణ్ ఎదురయ్యి.. ఆయన్ని కలిస్తే ఏమడుగుతారు అని యాంకర్ ప్రశ్నించగా.  ఒక పదేళ్ల క్రితం చరణ్ ని కలిస్తే పెళ్లి చేసుకుంటారా అని అడిగేదాన్ని ఇప్పుడు మీతో కలిసి వర్క్ చేయాలని ఉండి అని మాత్రమే అడుగుతాను అని తెలిపింది. దీంతో జ్ఞానేశ్వరి చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి. చరణ్ అభిమానులు ఇంకో నటి రామ్ చరణ్ కి ఇంత పెద్ద ఫ్యాన్ అని ప్రమోట్ చేస్తున్నారు.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Vahini Battles Cancer : విషమంగా సీనియర్ నటి ఆరోగ్య పరిస్థితి, సహాయం కోసం ఎదురుచూపులు
Remuneration: సౌత్‌లో అత్యధిక పారితోషికం తీసుకున్న ఒకే ఒక్కడు.. ఆయన ముందు ప్రభాస్, విజయ్‌, అల్లు అర్జున్‌ జుజూబీ