డీప్ ఫేక్ బాధితురాలిగా గ్లోబల్ బ్యూటీ, వైరల్ అవుతోన్న ప్రియాంక చోప్రా వీడియో..

Published : Dec 06, 2023, 04:12 PM IST
డీప్ ఫేక్ బాధితురాలిగా గ్లోబల్ బ్యూటీ, వైరల్ అవుతోన్న ప్రియాంక చోప్రా వీడియో..

సారాంశం

ప్రస్తుతం దేశ వ్యాప్తంగా సంచలనం సృస్టిస్తున్న మాట డీప్ ఫేక్. స్టార్ సెలబ్రిటీలు  ఈ డీప్ ఫేక్ బాధితులుగా మారిపోతున్నారు. తాజాగా గ్లోబల్ బ్యూటీ  ప్రియాంక చోప్రా కూడా బాధితురాలి లిస్ట్ లో చేరిపోయారు. 

ఫిల్మ్ ఇండస్ట్రీలో సంచలనంగా మారింది డీప్‌ఫేక్‌ వీడియోస్ వివాదం. ప్రస్తుతం దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనంగా సృష్టించింది  ఈ విషయం. స్టార్ సెలబ్రిటీలు మరీ ముఖ్యంగా హీరోయిన్ల ఫేస్ లు, బాడీలు మార్చేసి.. హాట్ గా.. వల్గర్ గా క్రియేట్ చేసి.. సోషల్‌ మీడియాలో వైరల్‌ చేస్తున్నారు సైబర్ నేరగాలు. ఇక ఈ  డీప్‌ఫేక్‌ వీడియోలను కట్టడి చేసేందుకు కేంద్రం ఓ వైపు కఠిన చర్యలు చేపడుతున్నప్పటికీ.. దేశంలోని టాప్‌ హీరోయిన్లు మాత్రం వరుసగా ఈ డీప్ ఫేక్ బాధితురాళ్లుగా మారుతున్నారు. 

అసలు ఈ వివాదం నేషనల్ క్రష్ రష్మికతో స్టార్ట్ అయ్యింది. రష్మిక వీడియో వైరల్ అవ్వడంతో అది సంచలనంగా మారింది. ఈ విషయంలో తన ఆవేదన వ్యక్తం చేసింది బ్యూటీ. ఇక అప్పటి నుంచి ఎవరో  ఒకరు కరు దీని బారిన పడుతూనే ఉన్నారు. ఇప్పటికే నేషనల్ క్రష్‌గా పేరుపొందిన దక్షిణాది తార రష్మిక మందన్నా ఆమె తరువాత  బాలీవుడ్‌ స్టార్‌ సీనియర్ హీరోయిన్  కత్రినా కైఫ్‌, కాజోల్‌, ఆలియా భట్‌కు సంబంధించిన మార్ఫింగ్‌ వీడియోలు నెట్టింట వైరల్‌ అయిన విషయం తెలిసిందే. తాజాగా గ్లోబల్‌ బ్యూటీ..  బాలీవుడ్‌ స్టార్‌ నటి ప్రియాంక చోప్రా సైతం డీప్‌ఫేక్‌ బారిన పడ్డారు.

KIFF 2023: బెంగాల్ సీఎం తో డాన్స్ చేయించిన సల్మాన్ ఖాన్, స్టార్స్ తో కలిసి మమతా బెనర్జీ మాస్ స్టెప్పులు..

అయితే ప్రియంక చోప్రా వీడియో ఒకటి ప్రస్తుతం వైరల్ అవుతోంది. అయితే ఈసారి ఆమె ఫోటోను మార్చకుండా.. ఆకతాయిలు డిఫరెంట్ గా చేశారు.. ప్రియాంక  వాయిస్‌ను మార్చేడంతో పాటు.. ఫేక్ బ్రాండ్ ను ప్రమోట్ చేశారు.  ప్రియాంక గతంలో ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన వీడియోకు ఇప్పుడు వాయిస్‌ మార్చేసి వైరల్‌ చేశారు. ఆ వీడియోలో ఆమె ఓ నకిలీ బ్రాండ్‌ను ప్రమోట్‌ చేస్తున్నట్లు క్రియేట్‌ చేశారు. ఆ బ్రాండ్‌ కారణంగా 2023లో తన వార్షిక ఆదాయం భారీగా పెరిగిందని.. అందరూ దాన్ని ఉపయోగించాలని పీసీ చెప్తున్నట్లుగా వీడియోను రూపొందించారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌గా మారింది. ఇది చూసిన నెటిజన్లు మండిపడుతున్నారు. 

PREV
click me!

Recommended Stories

Thanuja: దిమ్మ తిరిగే ట్విస్ట్, తనూజకి ఫైనలిస్ట్ గా నో ఛాన్స్.. నేనూ మనిషినే, ఇమ్మాన్యుయేల్ ఎమోషనల్
Vahini Battles Cancer : విషమంగా సీనియర్ నటి ఆరోగ్య పరిస్థితి, సహాయం కోసం ఎదురుచూపులు